Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Medak Cathedral church-The Second Largest Church In Asia

Medak Cathedral church-The Second Largest Church In Asia

మెతుకు సీమ మెదక్ జిల్లా, జూన్ 2, 2014 న ఏర్పడ్డ నూతన రాష్ట్రం తెలంగాణలో మెదక్ జిల్లా ఉంది. మెదక్ పట్టణం హైదరాబాదుకు 100 కి మీ ల దూరంలో ఉంది. సంగారెడ్డి జిల్లాకు ముఖ్యపట్టణం. జిల్లాలోని ఇతర పట్టణాల్లో ముఖ్యమైనవి, సిద్దిపేట , నర్సాపూర్, రామాయంపేట , గజ్వేల్, నారాయణఖేడ్ మరియు గుమ్మడిదల.
చరిత్ర పూర్వం సిద్దాపూర్ అని పిలువబడే నేటి మెదక్, కాకతీయుల కాలంలో ఉచ్చస్థితిలో ఉండేది. ఆ కాలం నాటి దుర్గం మెదక్ లో ఉంది. కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని కాలంలో మెదక్ దుర్గం నిర్మించారు. వ్యూహాత్మకంగా ఒక గుట్టపైన నిర్మించిన ఈ దుర్గాన్ని మెతుకుదుర్గం అని ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అని అనేవారు. ముఖద్వారం వద్ద కాకతీయుల మద్ర రెండు తలల " గండభేరుండం రీవిగా ఉంటుంది. కాకతీయుల నిర్మాణ ధురీణతకు ఈ కోట తార్కాణంగా నిలుస్తుంది. కోటలోని ఒక బావినుండి గొట్టాల ద్వారా కోటలోకి నీటి సరఫరా జరిగేది. కోటకు మూడు ద్వారాలున్నాయి: "ప్రధమ ద్వారం", గర్జిస్తున్న రెండు సింహాల మూర్తులతో కూడిన "సింహ ద్వారం", ఇరువైపులా రెండు ఏనుగుల ప్రతిమలు కలిగిన "గజ ద్వారం". కోటలో 17 వ శతాబ్దంకు చెందిన 3.2 మీటర్ల పొడవైన శతఘ్నిని చూడవచ్చు. సహజ సిద్ధమైన భౌగోళిక రూపురేఖలను చక్కగా వినియోగించుకున్న ఈ కోటకు చుట్టు ఉన్న గండ శిలలు సహజ రక్షణగా నిలుస్తున్నాయి.
మెదక్ చర్చి
అది కల్లోల జగతికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి కోవెలే కాదు, అన్నార్తులను ఆదుకునే మహోన్నత ఆశయంతో రూపుదిద్దుకొన్న ఆధ్యాత్మిక నిలయం, మత సామరస్యానికి ప్రతీకగా భాసిల్లుతున్న, ఆసియాలో రెండో అతిపెద్దదైన క్రీస్తు ప్రార్థనా మందిరం!

ఆసియాలోనే అత్యంత సుందరమైన మెదక్‌ చర్చి నిర్మాణం వెనుక మానవత్వానికి సంబంధించిన చరిత్ర చాలా ఉంది. 1914 సంవత్సరంలో ఈ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోయేవారు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌ నుంచి మెదక్‌ ప్రాంతానికి వచ్చి సువార్త సేవలందిస్తున్న క్రైస్తవ గురువు చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ ఆ పరిస్థితికి చలించిపోయారు. అన్నార్తులను ఆదుకోవాలన్న సదాశయంతోపాటు... ఏసుక్రీస్తుకు ఈ ప్రాంతంలో ఓ మందిరం నిర్మించాలన్న ఆలోచనతో ఈ చర్చి నిర్మాణానికి పూనుకొన్నారు. ఈ విషయాన్ని నిజాం ప్రభువు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన 120 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పనికి ఆహారం ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924 వరకూ పదేళ్లపాటు కొనసాగింది. చారిత్రక ప్రాధాన్యం గల మెదక్‌ చర్చి భారతదేశంలోనే పెద్దదిగా ప్రఖ్యాతిగాంచింది.
మెదక్ చర్చ్ చరిత్ర తెలుసుకుందాం
సర్వమానవాళి పాపప్రక్షాళనకు అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం... ప్రశాంతతకు నిలయం ... శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం... కరువు కాలంలో అన్నార్తులను ఆదుకున్న అమృతహస్తం... నీరుపమాన సేవలకు నిలువెత్తు నిదర్శనం... విదేశీ నైపుణ్యం, కళాత్మక నిర్మాణ కౌశలంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం... ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తూ పర్యాటక కేంద్రంగా దినదిన ప్రవర్థమానమవుతున్న ప్రముఖ పర్యాటక కేంద్రం. అతిసుందర మందిరంగా... ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా... రెండో వాటికన్గా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చి విశేషాలివి. నిర్మించి 90 వసంతాలైనా చెక్కుచెదరని అందాలతో సుందర మందిరంగా అలరారుతోంది... మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతోంది.
గోథిక్‌ శైలిలో 
అత్యద్భుతమైన నిర్మాణ శైలి, అబ్బురపరిచే అద్దాల కిటికీలు, కళ్లు తిప్పుకోనివ్వని కళాత్మక నైపుణ్యం.. మెదక్‌ చర్చిని సందర్శిస్తే కనిపించే దృశ్యాలివి. ఇది ఐరోపా గోథిక్‌ నిర్మాణ శైలిలో నిర్మితమైంది. ఈ చర్చి నమూనాను ఇంగ్లాండుకు చెందిన ఇంజనీర్‌ బ్రాడ్‌షా రూపొందించగా, వాస్తుశిల్పిగా థామస్‌ ఎడ్వర్డ్‌ వ్యవహరించారు. ఇటలీ దేశస్థులతో పాటు, భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణరంగ నిపుణులూ కళాకారులూ చర్చి నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకొన్న ఈ ప్రార్థనా మందిరానికి 175 అడుగుల ఎత్తున్న గోపురం ప్రత్యేక ఆకర్షణ. పూర్తిగా రాళ్లు, డంగుసున్నం వినియోగించి నిర్మించిన చర్చి అడుగడుగునా కళాత్మకంగా కనిపిస్తుంది. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్నీ, ఎత్తైన శిఖరాన్నీ, ప్రార్థనా మందిరం పైకప్పునూ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం... ఆనాటి నిర్మాణ నిపుణుల పనితనానికి నిదర్శనం. ప్రతిధ్వని రాకుండా రబ్బరు, పత్తితోపాటు పలు రకాల రసాయన పదార్థాలు వినియోగించి పైకప్పును ప్రత్యేకంగా చేయించారు. ఐదువేల మంది భక్తులు ఒకేసారి ప్రార్థనకు కూర్చునే సౌలభ్యం ఈ మందిరంలో ఉంటుంది.
చరిత్ర చెప్పే కిటికీలు 
క్రీస్తు జీవితంలోని మూడు ప్రధాన ఘట్టాలను రంగురంగుల గాజు ముక్కలతో చర్చి కిటికీ అద్దాలమీద చిత్రాలుగా రూపుదిద్దారు. చర్చి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే కిటికీ అద్దాలపై క్రీస్తు పునరుత్థానం, కుడివైపు కిటికీపైన క్రీస్తు జన్మవృత్తాంతం, ఎడమవైపు కిటికీపైన శిలువపై ఏసు ఉన్న దృశ్యమూ కనిపిస్తాయి. బయట నుంచి కాంతి వీటిపై పడ్డపుడు లోపల నుంచి ఈ దృశ్యాలు ఎంతో స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటితోపాటు చెకొస్లొవాకియా కళాకారులు అనేక రోజుల పాటు శ్రమించి సూక్ష్మమైన పనితనంతో దేవదారు కర్రతో పక్షిరాజు ఆకారంలో రూపొందించిన బైబిల్‌ పఠన వేదిక, రంగూన్‌ టేకుతో తయారుచేసిన ప్రభు భోజనపు బల్ల, వెలుగులు విరజిమ్మే షాండ్లియర్‌లు... ఇలా చర్చిలో ప్రతీదీ ప్రత్యేకమే, అన్నీ ఆకట్టుకొనేవే. చర్చి గోపురం పైభాగాన వేలాడదీసిన శిలువ రాత్రివేళ విద్యుద్దీపాల కాంతితో ధగధగలాడుతుంది.

ఏడుగురు బిషప్లు 
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) పరిధిలో మొత్తం 22 డయాసిసలు ఉన్నాయి. అందులో మెదక్ డయాసిస్ ఒకటి. 1947 సెప్టెంబరు 30న ఇది ఆవిర్భవించింది. దీని పరిధిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మెదక్ బిషప్లుగా ఏడుగురు పనిచేశారు. తొలి బిషప్ రేట్ రెవరెండ్ ప్రాంక్ విటకర్ కాగా ఏడవ బిషప్గా టి.ఎస్.కనకప్రసాద్ 2012 వరకు పనిచేశారు. ప్రస్తుతం సి.ఎస్.ఐ. డిప్యూటీ మాడరేటర్ రెట్ రెవరెండ్ దైవాశీర్వాదం మెదక్ డయాసిస్ ఇంచార్జి బిషప్గా కొనసాగుతున్నారు.

1924 డిసెంబరు 25, క్రిస్మస్‌ రోజున ఈ చర్చిని ప్రజలకు అంకితం చేశారు. ఆనాటి నుంచి ప్రేమ, శాంతి, సామరస్యాలను అందించే ప్రార్థనా మందిరంగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందీ చర్చి. ఈ చర్చిలో ఏటా క్రీస్తు జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆరోజున విద్యుద్దీపాలతో చర్చిని అలంకరిస్తారు. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల్లో భక్తులు హాజరవుతారు. ‘చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ)’ ఆవిర్భావ దినోత్సవం, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌, నూతన సంవత్సర వేడుకలూ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలూ, విదేశాల నుంచీ తరచూ భక్తులూ పర్యటకులూ ఈ చర్చి సందర్శనకు వస్తుంటారు. 
సీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఈ చర్చి పరిధిలోని ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో పేదలకు విద్యాసేవలందిస్తున్నారు. చిన్న పిల్లల క్రష్‌లతోపాటు పాఠశాలలూ, కళాశాలలూ, విద్యార్థి వసతి గృహాలూ అందులో ఉన్నాయి. ఇక్కడ అన్ని మతాల వారూ విద్యాభ్యాసం చేస్తారు.
పునాదికాలం నుంచీ నేటివరకూ మతబోధ, సేవ రెండు కళ్లుగా సాగిపోతోన్న ఈ చర్చి ప్రస్థానం మరెన్ని ప్రత్యేకతలను సంతరించుకోనుందో!

medak cathedral church,medak cathedral church in india, Medak Cathedral church-The Second Largest Church In Asia,medak church story,medak church area,medak church in india,medak church information,medak church architecture,medak church in andhra pradesh,about medak church in telugu,about medak church in telugu language,about medak church in telugu wikipedia,medak church built by,medak church bishop,medak church biography in telugu,secunderabad to medak church buses,medak church construction,medak church come,medak church charitra,medak church christmas,medak church celebration,medak church details,medak church details in telugu,medak church download,medak church day
,medak district church,medak diocese church,medak church established,medak church essay in telugu,medak church gurinchi,medak church gurinchi in telugu,medak church information in telugu,medak church image,medak church information in telugu language,medak jilla church,medak church history in telugu language,medak church wikipedia in telugu language,medak church matter,medak church matter in telugu,medak church miracles,medak church meaning in telugu,medak church name,church of medak,medak church telugu,medak church telugu wikipedia,medak church temple,medak church wikipedia in telugu
Previous
Next Post »
0 Komentar