Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Phirangipuram Church-The second Largest church in The Telugu States


Phirangipuram Church-The second Largest church in The Telugu States


క్రిస్మస్‌ వేడుకలంటే దేశవిదేశాల్లో జరిగేవే గుర్తొస్తాయి. కానీ అంతేరీతిలో ఆ సంబరాలకు వేదికవుతుంది గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని బాలయేసు ప్రార్థనా మందిరం. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చర్చిలో ఆరోజు లక్షల మంది ప్రభువు ఆశీస్సులు అందుకుంటారు.
'నావైపు చూసి రక్షణ పొందుడి; మీ భారమును నాపైబడవేయుడి నేను మోసెదను, నా సహాయమును సలహాను కోరిన తక్షణమే యొసంగ సిద్ధుడను’ అని చెప్పే క్రీస్తు వాక్యాలు ఎందరో ఆయన విశ్వాసుల మనసులను తేలిక పరుస్తాయి. ‘అందరునూ ఏసుకు కన్నబిడ్డల వంటి వారే’ అనే బైబిల్‌ వాక్యం కరుణామయుడైన తండ్రిని తనవాడిలా నమ్ముకునేలా చేస్తాయి. అందుకే విదేశాల్లోనే కాదు క్రిస్మస్‌ వేడుకలు తెలుగురాష్ట్రాల్లోనూ అంగరంగవైభవంగా జరుగుతాయి. భారతదేశంలో క్రైస్తవం వేళ్లూనుకున్న తొలినాళ్లనుంచే ఫిరంగిపురంలో ప్రభు విశ్వాసులు ఎక్కువ. మనదేశంలోని వారే కాదు ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ దేశాల నుంచీ మత గురువులు ఇక్కడికి వచ్చి క్రైస్తవాన్ని ప్రబోధించారు. అందుకే కేవలం ఈ ఒక్క వూరినుంచే దాదాపు రెండువందల మంది ఫాదర్లుగా, నన్‌లుగా మారి రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు.

రెండో అతి పెద్దది... 
అప్పట్లో మత గురువులు వివిధ దేశాలను దర్శిస్తూ, ప్రభువు మహిమలను జనానికి తెలియజేస్తూ జీవనాన్ని గడిపేవారు. అలా 1875వ సంవత్సరంలో లండన్‌ మిల్‌హిల్‌ సభకు చెందిన ఫాదర్‌ తియోడర్‌ డిక్మన్‌ ఫిరంగిపురానికి వచ్చారు. నిజానికి 1846 నాటికే ఫిరంగిపురం క్రైస్తవ మందిరం పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న బాలయేసు మందిరం శిథిలావస్థలో ఆయనకు కనిపించిందట. అది చూసి ఆయన మనసు చలించిపోయిందట. అంతేకాదు, ప్రభువు ఈ మందిర నిర్మాణానికి సంబంధించి ఆయనను ఆజ్ఞాపించిన అనుభూతిని పొందారట. అంతే, ఆయన ఫిరంగిపురంలోనే ఉండిపోయారు. దాదాపు పదిహేను సంవత్సరాలు శ్రమించి 1891నాటికి బాలయేసు కేథెడ్రెల్‌ను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద చర్చిగా ఇది ప్రఖ్యాతి పొందింది. మందిరం నిర్మించి నూట పాతిక సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఇది చెక్కు చెదరలేదు.
కార్మెల్‌ మాత మందిరం... 
ఇక్కడికి దగ్గరలో ఉండే కొండమీద ఫాదర్‌ డిక్మన్‌ ఆధ్వర్యంలోనే కార్మెల్‌ మాత మందిర నిర్మాణం జరిగింది. ఈ కొండ మీదకు చక్కటి మెట్లదారి ఉంది. మందిరంలోపల కార్మెల్‌ మాత బాలయేసును ఎత్తుకుని ఉన్నట్టుండే విగ్రహం కనిపిస్తుంది. బాలయేసు మందిరానికి వచ్చిన విశ్వాసులంతా ఇక్కడికీ వచ్చి ఆశీర్వాదం పొందుతారు. కొండమీద యాత్రికులకు వసతిగృహాలున్నాయి. జులై నెల 14, 15, 16 తేదీల్లో కార్మెల్‌ మాతకు ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడి పునీత అన్నమ్మ మఠాన్నీ డిక్మనే స్థాపించారు. విద్యావ్యాప్తికి కృషిచేస్తూ దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొందిన సెయింట్‌ ఆన్స్‌ విద్యాసంస్థలు తెలుగురాష్ట్రాల్లో మొదలైంది ఇక్కడే. అలా 1913 జులై 4న ఆయన మరణించే వరకూ ఫిరంగిపురంలోని చర్చి ఫాదర్‌గానే సేవలందించారు.
బెల్‌ టవర్‌... 
2013 సంవత్సరంలో ఫాదర్‌ డిక్మన్‌ మరణించి వందేళ్లైన గుర్తుగా చర్చి ఆవరణలో దాదాపు రూ.50 లక్షల వ్యయంతో 80 అడుగుల ఎత్తుతో బెల్‌ టవర్‌ను నిర్మించారు. పోలండ్‌ నుంచి తెప్పించిన 500కేజీల గంటను ఈ సందర్భంగా టవర్‌కు అమర్చారు. టవర్‌లో కింది భాగంలో ఫాదర్‌ డిక్మన్‌ విగ్రహం ఉండగా పై భాగాన మేరిమాత విగ్రహం కనిపిస్తుంది.

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు 
ఏసు జన్మదిన వేడుకలకు ఈ చర్చిని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. క్రీస్తు జననానికి సంబంధించిన బొమ్మలతో అక్కడ చేసే ప్రత్యేక ఏర్పాటు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మొత్తం మూడు రోజుల పాటు ఘనంగా క్రీస్తు జనన వేడుకల్ని నిర్వహిస్తారు. డిసెంబరు 23, 24, 25 తేదీల్లో జరిగే ఈ వేడుకల్లో 24 వతేదీ అర్ధరాత్రి జరిగే కార్యక్రమాలు ప్రధానమైనవి. గుంటూరు బిషప్‌ ఈ సమయంలో చర్చిలో దివ్యబలిపూజ నిర్వహిస్తారు. క్రీస్తుజననానికి సంబంధించిన ప్రసంగం, వాక్యం చెప్పడం సహా క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. వేడుకలకు ఇతర జిల్లాల నుంచి కూడా క్రైస్తవ మత గురువులు వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. అధిక సంఖ్యలో క్రైస్తవ మత విశ్వాసులు ఉండటం వల్ల దీన్ని ఆంధ్రారోమ్‌గా పిలుస్తారు.

Phirangipuram Church-The second Largest church in The Telugu States,phirangipuram church history in telugu,phirangipuram church history,phirangipuram church festival,phirangipuram church images,phirangipuram church photos,phirangipuram church timings,phirangipuram church videos,phirangipuram church wikipedia,phirangipuram church steps,guntur phirangipuram church,phirangipuram rcm church,phirangipuram church,phirangipuram church in india, Phirangipuram church-The Second Largest Church In Asia,phirangipuram church story,phirangipuram church area,phirangipuram church in india,phirangipuram church information,phirangipuram church architecture,phirangipuram church in andhra pradesh,about phirangipuram church in telugu,about phirangipuram church in telugu language,about phirangipuram church in telugu wikipedia,phirangipuram church built by,phirangipuram church bishop,phirangipuram church biography in telugu,secunderabad to phirangipuram church buses,phirangipuram church construction,phirangipuram church come,phirangipuram church charitra,phirangipuram church christmas,phirangipuram church celebration,phirangipuram church details,phirangipuram church details in telugu,phirangipuram church download,phirangipuram church day,phirangipuram district church,phirangipuram diocese church,phirangipuram church established,phirangipuram church essay in telugu,phirangipuram church gurinchi,phirangipuram church gurinchi in telugu,phirangipuram church information in telugu,phirangipuram church image,phirangipuram church information in telugu language,phirangipuram jilla church,phirangipuram church history in telugu language,phirangipuram church wikipedia in telugu language,phirangipuram church matter,phirangipuram church matter in telugu,phirangipuram church miracles,phirangipuram church meaning in telugu,phirangipuram church name,church of phirangipuram,phirangipuram church telugu,phirangipuram church telugu wikipedia,phirangipuram church temple,phirangipuram church wikipedia in telugu
Previous
Next Post »
0 Komentar