Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School assembly 10th December 2018
నేటి ప్రాముఖ్యత
ప్రతి సంవత్సరం డిసెంబరు 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం (Human Rights Day) జరుపుకుంటాము.
చరిత్రలో ఈ రోజు
భారత దేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10నాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు పునాది రాయి పడింది. భారత దేశ రెండవ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.
నేటి అంశము - తెలుగు
ఏ ఎండకా గొడుగు పట్టు - సమేత దాని పుట్టుక
రేపటి ఎండ, మాపాటి  ఎండ,  మధ్యాహ్నపు ఎండ, నీరెండ అని ఎండ పలురకాలు. ఎండ ననుసరించి గొడుగు దిశను గొడుగును మార్చుకుంటూ ఉండే వారిని గూర్చి ప్రారంభమైన ఈ సామెత పరిస్థితులను అనుసరించి స్వభావం లేదా శీలం మార్చుకునే అవకాశవాదులను, వ్యక్తిత్వం లేని వారిని గూర్చి తెలియజేయటానికి వాడబడుతుంది.
తెలుగు సంఖ్యా వాచక పదము
పంచ విధ లోహములు - 1. బంగారము 2. వెండి 3. రాగి 4. కంచు 5. ఇనుము
తెలుగు వారి వావి వరుసలు
ఆడపడుచు : ఒక తండ్రికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. అతను తన కుమారునికి వివాహం చేశాడు. కుమారుని భార్య తన కుమార్తెకు ఆడపడుచు లేదా ఆడబిడ్డ అవుతుంది.
మంచి మాట
ఉన్నత వ్యక్తిత్వం ఉంటే, శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు - ఐన్‌స్టీన్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
2019 సంవత్సరంలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ & చత్తీస్ గడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు మొత్తం 543 లోక్ సభ సీట్లలో 15 శాతం అయిన 83 స్థానాల్లో జనాభిప్రాయాన్ని ప్రతిబింబించనున్నాయి.
మనుషుల్ని, జాతుల్ని, ప్రపంచాన్ని కలప గలిగేది సాహిత్యం ఒక్కటే అని సాహిత్యం నేటి పిల్లలు చదవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 18వ రాష్ట్ర మహాసభలలో పలువురు వక్తలు పేర్కొన్నారు.
బ్యాంకులకు సుమారు రూ. 9 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత 'విజయ్ మాల్యాను' భారత్ కు అప్పగించే అంశంపై బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు నేడు తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.
సమాజం బాగుపడాలంటే ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలని అది యువత వల్లే సాధ్యమవుతుందని విజయవాడలో జరిగిన ఒక సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమై జనవరి 8వ తేదీ వరకు జరగనున్నాయి ఈ సమావేశాల్లో ముఖ్యమైన తలాక్ బిల్లు, భారత వైద్య మండలి (ఎంసీఐ) ను రద్దు చేస్తూ తీసుకువచ్చే బిల్లులతో పాటు మరో 40 బిల్లులకు ఆమోదం లభించనుంది.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పర్యాటక భారత జట్టును గెలుపు ఊరిస్తోంది. అడిలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో కంగారూలు ఆల్‌రౌండ్ వైఫల్యంతో ఓటమి కోరల్లో చిక్కుకున్నారు. అశ్విన్(2/44), మహ్మద్ షమీ(2/15) దెబ్బకు.. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదివారం ఆట చివరకు ఆసీస్ 104/4తో కష్టాల్లో పడింది.

School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2018 school assembly,december 2018 school assembly information,today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు,10th december 2018 assembly,11th december 2018 assembly,news of the day history,news of the day highlights,10th dec 2018 assembly,dec 10th assembly,dec 10th historical events,10th december 2018 assembly,december 10th assembly,december 10th historical events,school related today assembly,school related today news,school related december 10th information,school related december month information
Previous
Next Post »
0 Komentar