Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School assembly 11th December 2018 info

School assembly 11th December 2018 info

నేటి ప్రాముఖ్యత
యూనిసెఫ్ దినోత్సవం.
చరిత్రలో ఈ రోజు
➥ యునిసెఫ్ ఆవిర్భావం
యునిసెఫ్ (United Nations International Children's Emergency Fund) ను 1946 డిసెంబరు 11 వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏర్పాటు చేసారు . జాతి , మత , రాజకీయ వివక్షలేవి లేకుండా పిల్లలకు సహాయపడాలన్నది యునిసెఫ్ లక్ష్యము.
➥ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం           
ప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న జన్మించారు. ఈయన స్వగ్రామం పశ్చిమబెంగాల్ లోని బిర్బం జిల్లా మిరాఠీ. ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13 రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.
➥1891లో  తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
 నేటి అంశము - సాంకేతిక పరిజ్ఞానము
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం (Android OS) దాని చరిత్ర  
స్మార్ట్ ఫోన్ పని చేయాలి అంటే దానికి ఒక ఆపరేటింగ్ సిస్టం అవసరమౌతుంది. ఇప్పుడు లభించే స్మార్ట్ ఫోన్ లలో ఎక్కువ భాగం (85%) ఆండ్రాయిడ్ ఒ.ఎస్ (ఆపరేటింగ్ సిస్టం) ను ఉపయోగిస్తున్నారు. 
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం మొదటిగా బీటా వెర్షన్ ను నవంబరు 5, 2007 న రిలీజ్ చేశారు. అయితే కమర్షియల్ వర్షన్ ఆండ్రాయిడ్ 1.0 ను సెప్టెంబర్ 23 2008 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే 1.1 మరియు 1.2 వర్షన్ లకు ఎటువంటి పేర్లు ఇవ్వలేదు. తరువాత 2009లో ప్రారంభమైన 1.5 కు కప్ కేక్ అని నామకరణం చేశారు. అప్పటి నుండి ఇంగ్లీష్ ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో నామకరణం చేయుచున్నారు. ఆగస్టు 2018 నుండి ఆండ్రాయిడ్ 9 పై అందుబాటులో ఉన్నది. అయితే వీటి పేర్లను బేకరీ ఐటమ్స్ (స్వీట్ షాపుల్లో దొరికే ఐటమ్స్) పేర్లను ఉంచటం జరుగుచున్నది. వీటిలో బాగా పాపులర్ అయినవి  కిట్ కాట్ , లాలీ పాప్.
మంచి మాట
అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం - బుద్ధుడు

వార్తలలోని ముఖ్యాంశాలు
➥భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణమే రాజీనామాకు కారణమని తెలియుచున్నది.
 ➥ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికి వారే తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకకే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
 ➥ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో కంగారు జట్టును ఓడించింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడుతూ తొలి మ్యాచ్ గెలవడం భారత్ కు ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో 11 క్యాచ్ లు పట్టిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రపంచ రికార్డును సమం చేయటం మరో విశేషం.
 ➥కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ మాల్యాను భారత్ కు తీసుకురావడానికి మార్గం సుగమం అయినది. భారత్ కు అనుకూలంగా బ్రిటన్ కోర్టు తన తీర్పును వెలువరించింది. నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తన  డాబు , దర్పాలతో వాటిని మోసగించాడని మాల్యాపై అభియోగం. అయితే మాల్యాను ముంబైలోని రోడ్డు జైలు ఉంచనున్నారు
 ➥కులం, డబ్బు, అందం, కుటుంబం ఇవి ఏమి మనిషిని ఉన్నతుడిని చేయలేవని కేవలం వ్యక్తి లోని శక్తి సామర్థ్యాలు, ఆత్మ విశ్వాసం, పట్టుదల గొప్పవారిగా తీర్చిదిద్దుతాయని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకనూ మానవత్వం, సంతృప్తి, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్న దూరదృష్టి, తపన వంటివి ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమని చెప్పారు.
 ➥గడిచిన 2 నెలల్లో అత్యధిక ఒకరోజు పతనాన్ని సోమవారం నాడు దేశీయ మార్కెట్లు చవిచూశాయి. సెన్సెక్స్ ప్రారంభమే దాదాపు 500 పాయింట్లు కోల్పోయింది. నష్టాన్ని పెంచుకుంటూ పోయి చివరకు 700 పైచిలుకు పాయింట్లు కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరియు అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య పరమైన ప్రతికూలాలు, రూపాయి మారక విలువ పడిపోవడమే కారణమని తెలియచున్నది.

School assembly 11th December 2018 info,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2018 school assembly,december 2018 school assembly information,today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు,11th december 2018 assembly,11th december 2018 assembly,news of the day history,news of the day highlights,11th dec 2018 assembly,dec 11th assembly,dec 11th historical events,11th december 2018 assembly,december 11th assembly,december 11th historical events,school related today assembly,school related today news,school related december 11th information,school related december month information
Previous
Next Post »

1 comment