Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 18th December Information

School Assembly 18th December Information

నేటి ప్రాముఖ్యత 
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.
మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)
చరిత్రలో ఈ రోజు
➥1948 వ సం. జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
➥1971 వ సం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
➥2014 వ సం. భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం అయినది.
➥సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ పుట్టిన రోజు.
➥అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించే కాట్రగడ్డ బాలకృష్ణ మరణించిన రోజు.
నేటి అంశము-గణితము
బంగారము - తూకము 
1000 మిల్లీ గ్రాములు -------1 గ్రాము 
1000 గ్రాములు -------------1 కిలో గ్రాము 
8 గ్రాములు------------------1 సవరసు (కాసు)
11 మిల్లీ గ్రాములు ----------1 గురివింజ ఎత్తు 
11.664 గ్రాములు-----------1 తులము 
పాలు-ధాన్యపు కొలతలు  
2 గిద్దలు ------- 1అరసోల  
2 అరసోలలు -- 1 సోల
2సోలలు -------1 తవ్వ
2తవ్వలు - ----1మానిక 
2 మానికలు --1 అడ్డేడు 
20 అడ్డేళ్ళు ---1 అంకెము 
2 అంకెములు - 1 పలక 
8పలకలు - -----1 పుట్టి
మంచి మాట
విజయం ఎప్పుడూ మన ముందస్తు ప్రణాళిక మీదే ఆధారపడి ఉంటుంది- నెల్సన్‌ మండేలా
వార్తలలోని ముఖ్యాంశాలు 
➥ కోస్తాంధ్రకు పెథాయ్‌ ముప్పు తప్పింది. ఊహించిన దానికంటే ఈ తుపాను తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 26మంది మృత్యువాత పడ్డారు.
➥  సాధారణంగా తుపాన్లు సముద్ర తీర ప్రాంతంలో భూమిని తాకి కొద్ది దూరం ప్రయాణించాక బలహీనపడిపోతాయి. కానీ, సోమవారం తూర్పు గోదావరి తీరాన్ని తాకిన పెథాయ్‌ తుపాను దిశను మార్చుకొని, సముద్రంలోకి వెళ్లింది. మళ్లీ రాత్రికి తూర్పుగోదావరిలోని తుని వద్ద రెండో సారి తీరాన్ని తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెథాయ్‌ తొలుత సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కాట్రేనికోన యానాంల మధ్య సోమవారం మధ్యాహ్నం తీరాన్ని దాటింది.
➥ సోమవారం ఉదయం రాజస్తాన్‌ సీఎంగా అశోక్‌ గహ్లోత్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌ ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ ఫైల్ పై తొలి సంతకం చేశారు.
➥ వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. 
➥ 2018 విశ్వ సుందరి పోటీల్లో ఫిలిప్సీన్స్‌కు చెందిన క్యాట్రియోనా ఎలీసా గ్రే విజేతగా నిలిచారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్‌ గ్రీన్‌, రెండో రన్నరప్‌గా వెనిజువెలాకు చెందిన స్టిఫెనీ గ్యూటెరెజ్‌ నిలిచారు. భారతదేశానికి చెందిన నేహల్‌ చూడాసమా టాప్‌ 20లోనూ స్థానం దక్కించుకోలేకపోయారు.
➥ 1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చింది ఢిల్లీ హైకోర్టు. ఆయనకు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టులో సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా తేల్చగా.. ఆ తీర్పును హైకోర్టు తిరగరాసింది. ఈ నెల 31లోపు కోర్టులో లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌కుమార్‌ను ఆదేశించింది.
➥ రెండో టెస్టులో టీమిండియాకు 287 పరుగుల లక్ష్యంతో సవాలు విసిరింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైన ఆసీస్‌, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని మొత్తం 286 పరుగుల లీడ్‌ సాధించింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్‌లో మంగళవారం నిర్వహించనున్నారు.

School Assembly 18th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 18th December 2018 assembly, 18th December 2018 assembly,news of the day history,news of the day highlights,18th dec 2018 assembly, dec 18th assembly, dec 18th historical events, 18th December 2018 assembly, december 18th assembly, december 18th historical events,school related today assembly,school related today news, school related december 18th information, school related december month information
Previous
Next Post »
0 Komentar