Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 20th December Information

School Assembly 20th December Information


చరిత్రలో ఈ రోజు
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త  ఈడుపుగంటి వెంకట సుబ్బారావు గారి పుట్టినరోజు.
ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య కళాకారిణి  యామినీ కృష్ణమూర్తి గారి పుట్టినరోజు.
మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందిన  బి.జయమ్మ మరణించిన రోజు.
నేటి అంశము-గుడ్లలో రెండు   సొనలు ఎందుకు?
గుడ్డులోని ప్రతి భాగము పక్షిపిల్ల  ఎదగడానికి తన వంతు సహకారం అందిస్తుంది. పచ్చటి భాగాన్ని పచ్చ సోన( యోక్) అంటారు. దీని మీద ఉండే అతి చిన్న' స్పాట్' నుంచే పిల్ల పెరగడం ప్రారంభిస్తుంది. పచ్చి కోడిగుడ్డును పగలగొట్టి చూస్తే మీకు ఈ మచ్చ కనిపిస్తుంది. దీన్నే బ్లాస్టోడిస్క్ అంటారు. పచ్చ సోన, తెల్ల సోన( అల్బూమెన్)లను  పోషక పదార్థాలు గా స్వీకరిస్తూ కోడి పిల్ల గుడ్డులో పెరిగి పెద్దదవుతుంది. తెల్లసొనతో మరో ఉపయోగం కూడా ఉంది. చుట్టూ మెత్తటి  కుషన్ లా   ఉండి గుడ్డు లోపలి పిల్లను ఇది కాపాడుతుంది.
మంచిమాట/సుభాషితం
ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు, మనకి అదంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుందంతే- చర్చిల్
మంచి పద్యం
స్వార్థమను  ముసుగేసుకుంటే
లోకమంతా కుళ్ళు దేవా
మాయపొరలే విప్పి  చూస్తే
మంచియే కనిపించును...!
నేటి జీ.కె
ప్రశ్న: విద్యుద్ధీపంలోని ఫిల‌మెంట్ దేనితో త‌యార‌వుతుంది.?

జ: టంగ్‌స్టన్‌


వార్తలలోని ముఖ్యాంశాలు
ఏ.పి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడునేడు కార్యక్రమానికి సహకారం అందించేందుకు కార్పొరేట్‌ సంస్థ లైన హెటిరో, వసుధ ఫార్మా, ఆదిలీల ఫౌండేషన్, రెయిన్‌ కార్బన్‌ లారస్‌ ల్యాబ్స్‌ సంస్థలు పాఠశాల విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ స్కూళ్లలో రూ.85.65 కోట్లతో నాడునేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
‘పుష్టికర భారత్‌నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్‌ బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలతో పాటు ప్రొటీన్‌ సహిత ఆహారపదార్థాలను కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా దేశంలోని పేదలకు అందజేసేందుకు సరికొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గుడ్లు, చికెన్, మాంసం, చేపలను ఈ జాబితా లో చేర్చింది.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీ, బిహార్‌ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో తీర్మానం ఆమోదం పొందింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్దిపేట అడిషనల్‌ ఎస్పి గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్‌ అయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో హాజరు పరచగా, ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.
తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని పేర్కొంటూ నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్‌కుమార్‌ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు 25 వేల రూపాయల జరిమానా విధించింది.
దేశంలో అత్యధిక వేతనాలను ఐటీ ఫ్రొఫెషనల్స్ అందుకుంటున్నారని, ఐటీ సీటీ బెంగళూర్‌ అత్యధిక వేతనాలను చెల్లించే నగరంగా ముందుందనీ రాండ్‌స్టడ్‌ ఇన్‌సైట్‌ సాలరీ ట్రెండ్స్ (2019) నివేదిక వెల్లడించింది. బెంగళూర్‌లో జూనియర్‌ లెవెల్‌ టెకీకే సగటు వేతనం రూ 5.27 లక్షలు కాగా, సీనియర్‌ లెవల్‌ టెకీకి రూ 35.45 లక్షల వార్షిక వేతనం ఉందని ఈ నివేదిక తెలిపింది.
ఐపీఎల్‌ -2020 సీజన్‌లో భాగంగా కోల్‌కతా లో జరుగుతున్న వేలంలో ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్స్‌ కమ్మిన్స్‌ కి రూ. 15.50 కోట్ల భారీ ధర పలికింది. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ గుర్తింపు పొందాడు.

ఒకప్పుడు ముంబయిలో పానీపూరీ అమ్మిన యువ క్రికెటర్‌ యశస్వి జైశ్వాల్‌ గురువారం జరిగిన ఐపీఎల్‌ 2020 వేలంలో కోటీశ్వరుడయ్యాడు. 17 ఏళ్ల యశస్వి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్‌ రూ.2.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
School Assembly 20th December Information, School Assembly, prayer songs,Assembly information, historical events, information of the day, news of the day,golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, December month school assembly day wise, December 2019 school assembly, December 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని ముఖ్యాంశాలు, 20th December 2019 assembly, 20th December 2019 assembly,news of the day history, news of the day highlights, 20th dec 2019 assembly, dec 20th assembly, dec 20th historical events, 20th December 2019 assembly, december 20th assembly, december 20th historical events, school related today assembly, school related today news, school related december 20th information, school related december month information

Previous
Next Post »
0 Komentar

Google Tags