Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Akkineni Nageshwara Rao Biography

Akkineni Nageshwara Rao Biography

అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. భారతీయ దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు.
వ్యక్తిగత జీవితం
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 లో జన్మించారు. చిన్ననాటి నుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని 1949 లో అన్నపూర్ణని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా.
సినీజీవితం       
అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో విధివశాత్తు గుర్తించబడ్డాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నటించిన సినిమాలు 256.  ఆయన నటించిన ఆఖరి సినిమా మనం”. పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేనికే దక్కింది.
       1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశారు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి యువ సామ్రాట్, నవ యువ సామ్రాట్ ఇలా తన వారసులను అందించిన మహా వృక్షం.
1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మందుకుబానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు ( మాయాబజార్ ), విష్ణువు (చెంచులక్ష్మి), నారదుడు (భూకైలాస్), అర్జునుడు (శ్రీకృష్ణార్జున యుద్ధం )లో రాణించాడు.
గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, మరియు నమ్మినబంటులో నటించి, తెలుగు నటసామ్రాట్గా పేరుపొందాడు. మిస్సమ్మ, చక్రపాణి మరియు ప్రేమించుచూడు లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. లైలామజ్ను, అనార్కలి(1955), బాటసారి, ప్రేమనగర్,  ప్రేమాభిషేకం మరియు మేఘసందేశంలో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది. ఇది అప్పటిలో అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది.
తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించాడు. ప్రేమలో ‌ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవంపోసింది. ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతోమంది మరిన్ని భాషలలో నటించినా, ప్రముఖ హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించినదే ఒకేఒక దేవదాసు అని అన్నాడు. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి,మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, మరియు కాలేజి బుల్లోడు లాభాలుపొందిన సినిమాలు. 1991 లోఆయన నటజీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు, కొత్త మరియు యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున మరియు మనవడు నాగచైతన్యతో కలిసినటించిన మనం ఆయన నటించిన చివరి సినిమా.
     వివిధ ప్రాంతాల సాహిత్య మరియు సాంస్కృతిక ప్రముఖుల పాత్రలు అనగా, ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిషాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాం లను తెరమీదికి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు మరియు కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు .
     సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటనా ప్రతిభను మనం చూడవచ్చు.
సంఘసేవ
మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఎన్ఆర్ కళాశాల (ANR College) అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు.విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించాడు.
మరణం
అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 2014, జనవరి 22 న మరణించారు.
పురస్కారాలు, బిరుదులు
ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక క్రింది పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు.
·విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
·రాజ్ కపూర్ స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు.
·రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు - 10.03.1980 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
·పద్మవిభూషణ్ (భారత ప్రభుత్వం)
·పద్మ భూషణ్ - 1988 - భారత ప్రభుత్వం.
·కాళిదాస్ సమ్మాన్—మధ్యప్రదేశ్
·దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ.
·లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
·అన్నా అవార్డు - 24.11.1995 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
·పద్మశ్రీ - 1968 భారత ప్రభుత్వం.
·ఎన్ టి ఆర్ జాతీయ పురస్కారము (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)
·డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు
·నటసామ్రాట్
·కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)
·జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన Telugu Association of North America.


ANR Biography,ANR Biography in telugu,ANR biography pdf,ANR biography wikipedia,ANR a biography,ANR a biography by swami nikhilananda,autobiography of ANR,ANR a biography in pictures,ANR a born leader,ANR a born leader pdf,swami ANR all biography,ANR biography book pdf, ANR brief biography,ANR biography download,ANR born date,ANR born day,ANR biography in telugu download, ANR biography in telugu pdf download,ANR biography telugu,ANR biography telugu pdf,swami ANR biography essay,ANR full biography,ANR biography pdf free download,Akkineni Nageshwara Rao Biography,Akkineni Nageshwara Rao Biography in telugu,Akkineni Nageshwara Rao biography pdf,Akkineni Nageshwara Rao biography wikipedia,Akkineni Nageshwara Rao a biography,Akkineni Nageshwara Rao a biography ,autobiography of  ANR,Akkineni Nageshwara Rao a biography in pictures,Akkineni Nageshwara Rao a born leader,Akkineni Nageshwara Rao a born leader pdf,swami Akkineni Nageshwara Rao all biography,Akkineni Nageshwara Rao biography book pdf, Akkineni Nageshwara Rao brief biography,Akkineni Nageshwara Rao biography download,Akkineni Nageshwara Rao born date,Akkineni Nageshwara Rao born day,Akkineni Nageshwara Rao biography in telugu download, Akkineni Nageshwara Rao biography in telugu pdf download,Akkineni Nageshwara Rao biography telugu,Akkineni Nageshwara Rao biography telugu pdf,swami Akkineni Nageshwara Rao biography essay,Akkineni Nageshwara Rao full biography,Akkineni Nageshwara Rao biography pdf free download

Previous
Next Post »
0 Komentar