Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP and Telangana Cost of TV Channels DTH and Cable Operators Detailes

AP and Telangana Cost of TV Channels DTH and Cable Operators Detailes


మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత?
🍥కొత్త కేబుల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జనవరి 31 వరకూ పాత ధరలే ఉంటాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలకు తగిన సమయం ఇవ్వడానికి వీలుగా గడువు సడలించారు.
📺తొలుత 2018 డిసెంబర్ 29 నుంచే అమలు చేయాలని నిర్ణయించినా తాజాగా ఫిబ్రవరి 1కి మార్చారు.
📺అయితే బిల్లులు పెరగడంపైనా, కేబుల్ కనెక్షన్ విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులపైనా అనేక మంది సందేహాలున్నాయి.
📺కేబుల్ విషయంలో వినియోగదారునికి ఉన్న ముఖ్యమైన హక్కులను ఇక్కడ అందిస్తున్నాం.
📡గరిష్ఠ ధర రూ.19
కొత్తగా కేబుల్ కనెక్షన్ తీసుకుంటుంటే, సెట్ టాప్ బాక్సును వాయిదా పద్ధతిలో లేదా అద్దె పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. కచ్చితంగా కొనాలన్న నిబంధన లేదు.
ఏ పే చానల్ అయినా గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయగలదు. అంత కంటే తక్కువ కూడా చేయవచ్చు. ఎక్కువ చేయకూడదు.
కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18 శాతం జీఎస్టీ అంటే మొత్తం 153.40 రూపాయలు చెల్లించాలి.
ఈ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది.
వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. సాధారణంగా ఈ అవసరం ఎక్కువ మందికి రాదు.
ప్రతీ చానల్ కీ విడివిడి ధర ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపుకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు.
ప్రతీ ఆపరేటరూ మీ దగ్గరకు ఒక చానళ్ల లిస్టు తేవాలి. అందులో తాను అందిస్తోన్న చానళ్ల పేర్లు, వాటి ధరలూ ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. ఈ కాపీ మీ దగ్గర ఒకటి, ఆపరేటర్ దగ్గర ఒకటీ ఉండాలి.
కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా.
మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపికను మీ నెలవారీ బిల్లూ - మొత్తం ఉండాలి. ఈ కార్డు ఒక కాపీ వినియోగదారుడి దగ్గరా, ఇంకో కాపీ ఆపరేటర్ దగ్గరా ఉండాలి.
అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి.
ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కానీ దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ కావాలంటే ఇవ్వవచ్చు లేదా తీసుకోవచ్చు.
ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి.
నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల మందే ఆపరేటర్ కి చెప్పాలి. కానీ మళ్లీ రీ కనెక్షన్ కి మూడు నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి.
ఈ ఏర్పాట్లు కేబుల్ ఆపరేటర్ లేదా ఎమ్మెస్వో (ఎమ్మెస్వో అంటే చానల్ కీ కేబుల్ ఆపరేటర్ కీ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్ వంటి వారు)లు చేయాలి.


📡ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్చేస్తోన్న ధరలు (రూ.ల్లో)( SD చానల్స్ )
1) జెమినీ టీవీ రూ. 19.00
2) జెమినీ మూవీస్ రూ. 17.00
3) జెమినీ కామెడీ రూ. 5.00
4) జెమినీ లైఫ్ రూ. 5.00
5) జెమిని మ్యూజిక్ రూ. 4.00
6) ఖుషి టీవీ రూ. 4.00
7) జెమిని న్యూస్ రూ. 0.10
📺పాకేజ్/బొకే ధర రూ. 30.00
📡ఈటీవీ పాకేజ్ (ధర రూ.ల్లో) ( SD చానల్స్ )
1) ఈటీవీ రూ. 17.00
2) ఈటీవీ ప్లస్ రూ. 7.00
3) ఈటీవీ సినిమా రూ. 6.00
4) ఈటీవీ అభిరుచి రూ. 2.00
5) ఈటీవీ లైఫ్ రూ. 1.00
6) ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రూ. 1.00
7) ఈటీవీ తెలంగాణ రూ. 1.00
📺పాకేజ్/బొకే ధర రూ. 24.00
📡స్టార్ తెలుగు వాల్యూ పాక్ (రూ.ల్లో) ( SD చానల్స్ )
1) మా టీవీ  రూ. 19.00
2) మా మూవీస్ రూ. 10.00
3) మా గోల్డ్ రూ. 2.00
4) మా మ్యూజిక్ రూ. 1.00
5) స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు రూ. 19.00
6) స్టార్ స్పోర్ట్స్ రూ. 26.00
7) స్టార్ స్పోర్ట్స్ రూ. 34.00
8) నేషనల్ జాగ్రఫిక్ రూ. 2.00
9) నాట్ జియో వైల్డ్ రూ. 1.00
10) స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ రూ. 1.00
📺పాకేజ్/బొకే ధర39.00
📡జీ ప్రైమ్ పాక్ ( SD చానల్స్ )
1) జీ తెలుగు రూ. 19.00
2) జీ సినిమాలు రూ. 10.00
3) లివింగ్ ఫుడ్జ్ రూ. 4.00
4) జీ యాక్షన్ రూ. 1.00
5) జీ ఇటిసి రూ. 1.00
6) వియాన్1.00
7) జీ న్యూస్ రూ.0.50
8) జీ హిందుస్తాన్ రూ. 0.50
9) జీ కేరళమ్ రూ. 0.10
📺పాకేజ్/బొకే ధర20.00
💰నెలవారీ బిల్లు ( SD చానల్స్ )
🍥100 ఉచిత చానల్స్ రూ. 130.00+ GST రూ. 23.40=153.40
🍥జెమినీ బొకే రూ. 30.00+ GST రూ. 5.40= రూ. 35.40
🍥ఈటీవీ బొకే రూ. 24.00+ GST  రూ. 4.32=రూ. 28.32
🍥స్టార్ తెలుగు బొకే రూ. 39.00+ GST రూ. 7.02= రూ. 46.02
🍥జీ ప్రైమ్ పాక్ బొకే  రూ. 20.00+ GST రూ. 3.60=రూ. 23.60
💰మొత్తం బిల్లు రూ. 243.00+ GST రూ. 43.74= మొత్తం రూ. 286.74 
పైన తెలిపిన వన్నీ SD ఛానల్ లకు మాత్రమే. మరి HD టీవీ ఛానల్ చూడాలనుకునే వారికి మరింత భారం కానుంది. TRAI నిర్ణయం వల్ల కేవలం ఆయా నెట్వర్క్లు (చానల్స్) నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకే లాభం. కస్టమర్లకు ఎటువంటి ప్రయోజనం లేదు. మరి చానల్ విలువ ₹ 19 నిర్ణయించినప్పుడు దానిలో ప్రకటనలు ఉండకూడదు అనే వాదన కూడా ప్రజల్లో ఉన్నది. మునుముందు ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడవలసిందే.


AP and Telangana Cost of TV Channels DTH and Cable Operators Detailes,new tv channels packages,new tv channels package list,new channels package of dish tv,new tv channels 2019,new tv channels 2019,cost of tv channels,price of tv channels in india, new cost of tv channels 2019,కేబుల్ ధరలు,chanel wise cost per month 2019,2019 dth new packages
Previous
Next Post »
0 Komentar

Google Tags