Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ASER (Annual Status of Education Report)-2018

ASER (Annual Status of Education Report)-2018


దేశంలో విద్యాప్రమాణాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. గ్రామీణప్రాంతాల్లో చదువుతున్న పిల్లల విద్యాప్రమాణాల స్థాయిని లెక్కించడానికి ప్రతి రెండేళ్లకోసారి కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సర్వే నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన 'యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (రూరల్)-2016 చేదు నిజాలను బయటపెట్టింది. రెండోతరగతి పుస్తకాలు చదవగలిగే అయిదో తరగతి విద్యార్థుల సంఖ్య 2008లో 53.1% మేర ఉండగా 2018నాటికి ఆ సంఖ్య 44.2%కి పడిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థుల్లోనూ ఉమ్మడిగా పరవశక్తి తగ్గిపోతోంది. 2వ తరగతి పుస్తకాలు చదివే అయిదోతరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 2008లో 53.1% ఉండగా 2018లో 44.2%కి తగ్గిపోయింది. ఇదే సమయంలో ప్రైవేటు విద్యార్థుల సంఖ్య 67.5% నుంచి 65.1%కి పడిపోయింది. ఆంద్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్న తేడా లేకుండా పిల్లలందరిలో ఒకటి ధోరణి కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో మౌలికవసతుల పరిస్థితి కొంటి మెరుగుపడింది. మరుగుదొడ్లు, రాగునీరు, కంప్యూటర్, విద్యుత్తు సౌకర్యం లాంటి వాటి కల్పనలో గతం కంటే పరిస్థితి మెరుగ్గా ఉంది. పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలు కూడా బాగానే ఉన్నట్లు తేలింది. 
➥ ఆంద్రప్రదేశ్ లో 6-14 మధ్య వయసు పిల్లల్లో 35.2% మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు. 
➥ 11-14 మధ్య వయస్సు బాలికల్లో 2.9% మంది పాఠశాలలకు వెళ్లడం లేదు. 15-16 ఏళ్ల మధ్య బాలికల్లో 9.7% మంది పరిస్థితీ అదే విధంగా ఉంది.
➥ మూడో తరగతి చదువుతున్న పిల్లల్లో 22.4% మంది మాత్రమే రెండోతరగతి పుస్తకాలు చదవగలుగుతున్నారు. ఇది జాతీయ సగటు 27.2% కంటే తక్కువ. మూడో తరగతి పిల్లల్లో 38.4% మంది తీసివేతలు చేయగలుగుతున్నారు. ఇది జాతీయ సగటు 28.1% కంటే ఎక్కువ.
➥ అయిదోతరగతి చదువుతున్న పిల్లల్లో 59.7% మంది రెండోతరగతి పుస్తకాలు చదవగలరు. 39,3 మంది భాగహారాలు చేయగలరు. 8వ తరగతి పిల్లల్లో 78.2% మందికి రెండో తరగతి పుస్తకాలు చదివేశక్తి ఉంది, 47,6% మంది భాగహారాలు చేయగలుగుతున్నారు. ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ పిల్లలు జాతీయ సగటు కంటే కొంత పై స్థాయిలోనే ఉన్నారు.
➥ విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి రాష్ట్రంలో 2010లో 60% ఉండగా 2018 నాటికి 61,5%కి పెరిగింది. తరగతి-టీచర్ నిష్పత్తి ఇదే సమయంలో 53.5 నుంచి 70%కి చేరింది. ఆఫీసు/స్టోర్లాంటి సౌకర్యాలున్న పాఠశాలల నిష్పత్తి 57% నుంచి 58.6%కి చేరింది. క్రీడా మైదానాలున్న పాఠశాలల నిష్పత్తి 61.2% నుంచి 61.9%కి పెరిగింది.
➥ ప్రహరీలున్న పాఠశాలల సంఖ్య 47.2 నుంచి 55.1%కి చేరింది. 
➥ మధ్యాహ్నభోజనం వండటానికి వంటశాలలున్న పాఠశాలల సంఖ్య 64.2% నుంచి 72.9%కి పెరిగింది.
➥ మరుగుదొడ్లున్న బడుల సంఖ్య 38.6% నుంచి 86.4%కి చేరింది. ఇందులో బాలికల మరుగుదొడ్లున్న పాఠశాలల సంఖ్య 25.4% నుంచి 81.1%కి పెరిగింది.
➥ 60, ఆలోపు పిల్లలున్న పాఠశాలల సంఖ్య 2010-2018 మధ్యకాలంలో 31,5% నుంచి 38.6%కి చేరింది. 
➥ గ్రంధాలయం, పుస్తకాలు అందుబాటులో ఉన్న స్కూళ్ల సంఖ్య 92% నుంచి 91%కి తగ్గింది. గ్రంధాలయం పుస్తకాలు ఉపయోగించుకుంటున్న పిల్లల సంఖ్య 2010లో 77.6% ఉండగా 2018నాటికి 54.8%కి తగ్గింది. 
➥ కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య 2010లో 9.3% ఉండగా, 2018 నాటికి 22.6%కి చేరింది. సర్వేకి వెళ్లినరోజు కంప్యూటర్లు ఉపయోగిస్తూ కనిపించిన పిల్లల సంఖ్య 2014లో 5.6% ఉండగా 2018లో 6.6%మేర ఉంది. సర్వేనాడు మధ్యాహ్నభోజనం సరఫరా చేస్తూ కనిపించిన పాఠశాలల సంఖ్య 2010లో 99.7% ఉండగా, 2018లో 96%కి పరిమితమైంది. "
➥ 6-14 మధ్య వయస్సున్న పిల్లల హాజరుశాతం ఆంద్రప్రదేశ్లో 80-84% మధ్య ఉంది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ రెండోదశ రాష్ట్రాల జాబితాలో నిలబడింది.
➥ 11-14 మధ్య వయస్సులో బడికి వెళ్లని బాలికల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 2005లో 10.5% మంది ఉండగా, 2018 నాటికి అది 2.9%కి తగ్గింది. 15-16 ఏళ్ల మధ్య గల బాలికల్లో బడికి వెళ్లని వారి సంఖ్య 2006లో 21.3% ఉండగా 2018 నాటికి అది 9.7% తగ్గింది. ఈ రెండు అంశాల్లో జాతీయ సగటు కంటే ఏపీలో పరిస్థితి బాగుంది.
➥ కనీస తీసివేతలు చేయగలిగే 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఏపీలో 5%మేర తగ్గింది. 2016లో ఈ సంఖ్య 39.1%మేర ఉండగా, 2018 నాటికి 34.1%కి చేరింది.
➥ రెండోతరగతి స్థాయి పుస్తకాలు చదవగలిగే 3వ తరగతి విద్యార్థుల సంఖ్య 2008-2018 మధ్యకాలంలో ఏపీలో 71-80% ఉంది. ఇందులో ఏపీ దేశంలో మూడోస్థాయి రాష్ట్రాల సరసన నిలిచింది.

ASER (Annual Status of Education Report) is an annual survey that aims to provide reliable annual estimates of children’s schooling status and basic learning levels for each state and rural district in India. It is the largest citizen-led survey in India, and is also the only annual source of information on children’s learning outcomes available in India today.When we started ASER in 2005 we made a commitment to do it every year and we did it annually for 10 years till 2014. This is because we think for data to feed into policy it has to be reliable, comparable and available on a regular basis. In 2015, ASER took a year off to reflect and consolidate the learnings from the last 10 years. However, even today learning levels remain low and ASER remains the only source of comparable and regularly available data on learning in the public domain. Therefore, we re-started ASER in 2016.


ASER (Annual Status of Education Report)-2018,Annual Status of Education Report-2018,annual status of education report 2018,annual status of education report (aser) 2018,aser 2018,aser 2018 report,aser 2018 abstract,aser 2018 abstract submission,aser 2018 india,aser 2018 pdf,aser report 2018 summary,acer aspire 2018,aser report on education 2018,aser 2018 program,aser report 2018 pdf
Previous
Next Post »
0 Komentar

Google Tags