Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Lal Bahadur Shastri Biography

Lal Bahadur Shastri Biography


లాల్ బహాదుర్ శాస్త్రి 
లాల్ బహాదుర్ శాస్త్రి  (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది.
ప్రారంభ జీవితం
శాస్త్రి వారణాసి లోని రామనగర లో తన తల్లితరపున తాత గారింట కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2నజన్మించాడు. అతను జన్మించిన మొదటి సంవత్సరంలో ఇక్కడ పెరిగాడు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయునిగా పనిచేసాడు. తరువాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసాడు. ఆమె తల్లి మొఘల్ సరాయ్ లోని రైల్వే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఆంగ్ల ఉపాద్యాయునిగా పనిచేసిన మున్షీ హజారీ లాల్ కుమార్తె. శాస్త్రి రెండవ సంతానంగా పెద్ద కుమారునిగా జన్మించాడు. అతని అక్క పేరు కైలాష్ దేవి.
1906 ఏప్రిల్ లో శాస్త్రికి ఒక యేడాది వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందాడు కానీ ప్లేగు అనే అంటువ్యాధికి గురై మరణించాడు. ఆ సమయంలో 23 సంవత్సరాల వయస్సు గల రామ్‌దులారీ దేవికి మూడవ బిడ్డతో గర్భంతో ఉంది. ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె తన కన్నవారి ఇంటికి (ముఘల్‌సరాయ్) వచ్చి అక్కడ స్థిరపడింది.
ఆ విధంగా శాస్త్రి ఆమె సొదరీమణులతో కలసి తాతగారైన హజారీ లాల్ ఇంటి వద్ద పెరిగాడు.
తరువాత శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీ లాల్ చూసుకున్నాడు. దర్బారీలాల్ ఘజీపూర్ లోని "నల్లమందు నియంత్రణ విభాగం" లో ప్రధాన గుమస్తాగా పనిచేస్తూండేవాడు. ప్రభుత్వంలో ఆంగ్ల భాష రాక ముందు అనేక శతాబ్దాలుగా ఉర్దూ/పర్షియన్ భాషలు వాడబడుతున్నందున ఈ భాషలు నేర్చుకోవాలనే ఆచారం ఆనాడు ఉండేది. అందువలన శాస్త్రి తన నాలుగు సంవత్సరాల వయస్సులో ముఘల్‌సరాయ్ లోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్ కళాశాలలో బుధన్ మిలన్ అనే మౌల్వీ (ముస్లిం పండితుడు) వద్ద విద్యను అభ్యసించాడు. అక్కడ 6వ తరగతి వరకు చదివాడు. 1917లో తన కుటుంబాన్ని పోషిస్తున్న మామయ్య బృందేశ్వర ప్రసాద్ కు వారణాసి కి బదిలీ అయింది. అందువల్ల కుటుంబం అంతా వారణాసి వెళ్లవలసి వచ్చింది. ఆ కుటుంబంతో పాటు రామ్‌దులారీ దేవి తన ముగ్గురు పిల్లలతో కలసి వారణాసి చేరింది. శాస్త్రి హరిష్ చంద్ర హైస్కూలు లో ఏడవ తరగతిలో చేరాడు.
నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు.
సత్యాగ్రహం చేసే యువకునిగా (1921–1945)
శాస్త్రి కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్ర్యోద్యమ నేపధ్యం లేనప్పటికీ అతను చదివే హరిష్ చంద్ర హైస్కూల్ లోని ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. తరువాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్ అంటి వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసాడు. 1921 జనవరిలో అతను 10వ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షలకు మూడు మాసాల వ్యవధి ఉన్న సమయంలో బెనారస్ లో మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ద్వారా నిర్వహింపబడిన సభకు హాజరైనాడు. మహాత్మా గాంధీ పిలువుకు ప్రేరణ పొందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. రెండవరోజే శాస్త్రి హరీష్ చంద్ర పాఠశాలను వదలి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరాడు. అతను చురుకుగా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. ఈ కారణంగా అతనిని అరెస్టు చేసారు కానీ మైనర్ అయినందువలన వెంటనే విడిచిపెట్టారు.  ఒక సంపన్న పరోపకారం గల వ్యక్తి, కాంగ్రెస్ జాతీయవాది అయిన శివప్రసాద్ గుప్తా మద్దతుతో 1921 ఫిబ్రవరి 10 న బెనారస్ లో ఉన్నత విద్యా సంస్థ (కాశీ విద్యా పీఠ్) స్థాపించబడి గాంధీచే ప్రారంభించబడినది. 1925 లో ఈ విద్యాపీఠ్ లోని మొదటి బ్యాచ్ విద్యార్థులలో శాస్త్రి తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతనికి "శాస్త్రి" (పండితుడు) అనే బిరుదునిచ్చారు. ఈ బిరుదును బ్యాచిలర్స్ డిగ్రీ అందజేసే విద్యాపీఠ్ ఇస్తుంది కానీ ఇది అతని పేరులో స్థిరపడిపోయింది. అతను లాలా లజపతిరాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ (లోక్ సేవక్ మండల్) లో జీవితకాల సభ్యత్వం తీసుకున్నాడు. అతను ముజఫర్ పూర్ లో గాంధీజీ అధ్వర్యంలో హరిజనుల మంచి కోస్ం వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు.
స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర
శాస్త్రి 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా మారాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో అతను పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసాడు. 1940 లో అతను స్వాతత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు. 1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశ్ం విడిచి పోవాలనే డిమాండ్ తో గాంధీజీ ముంబై లోని గోవిలియా టాంక్ వద్ద క్విట్‌ ఇండియా ఉద్యమం గూర్చి సందేశాన్నిచ్చాడు. శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించి విడుదలైన వెంటనే అలహాబాదుకు ప్రయాణమయ్యాడు. జవహర్ లాల్ నెహ్రూ గృహమైన ఆనందభవన్‌లో ఉన్న స్వాతంత్ర్య ఉద్యమకారులకు సూచనలను ఒక వారంపాటు పంపాడు. కొద్ది రోజుల తరువాత అతను అరెస్టు కాబడి 1946 వరకు జైలు శిక్ష అనుభవించాడు. శాస్త్రి స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. అతను జైలులో ఉన్నకాలాన్ని పుస్తకాలు చదవడంతో గడిపాడు. పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నాడు.
భారత ప్రధానమంత్రి (1964–66)
1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.
1964 జూన్ 11 న ప్రధానమంత్రిగా అతను చెప్పిన మొదటి మాటలు ప్రసారమైనాయి. అవి:
" చరిత్ర యొక్క రోడ్లకూడలి వద్ద ఉన్నప్పుడు మరియు వెళ్ళడానికి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే సమయంలో ప్రతి దేశం యొక్క జీవితం లో ఒక సమయం వస్తుంది. కానీ మాకు ఏ కష్టం లేదా సంశయం అవసరం లేదు, కుడి లేదా ఎడమ వైపులకు చూడనవసరం లేదు.మా మార్గం నేరుగా మరియు స్పష్టమైనది-స్వాతంత్ర్యం మరియు శ్రేయస్సుతో ఒక లౌకిక మిశ్రమ-ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం,మరియు ఎంచుకున్న దేశాలతో ప్రపంచ శాంతి మరియు స్నేహం నిర్వహణ చేయడం. "
దేశీయ విధానాలు
అతని పరిపాలనా కాలంలో 1955లో మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది. భారతీయ ప్రభుత్వం చాలా కాలంగా భారతదేశ ఏకైక జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి ప్రయత్నం చేసింది. ఈ విధానాన్ని హిందీ భాషేతర ప్రాంతాలైన ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం వ్యతిరేకించింది. పరిస్థితిని శాంతింపజేయడానికి శాస్త్రి హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగించబడుతుందనే హామీ ఇచ్చాడు. ఈ సందర్భంలో జరిగిన విద్యార్ధి ఆందోళనలు, శాస్త్రి హామీ తరువాత సద్దుమణిగాయి.
ఆర్థిక విధానాలు
కేంద్ర ప్రణాళికతో నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను శాస్ర్తి నిలిపివేశాడు. అతను వైట్ విప్లవాన్ని(వైట్ రివల్యూషన్) ప్రోత్సహించాడు. ఈ వైట్ విప్లవం ముఖ్య ఉద్దేశ్యం పాలు ఉత్పత్తి, సరఫరా పెంచడానికి ఒక జాతీయ ప్రచారం చేయడం. గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతంలో ఉన్న అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సహకారంతో "నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు" ఏర్పాటు చేయడమైంది. 1964 అక్టోబరు 31 న అతను గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతాన్ని సందర్శించి కంజరి వద్ద ఏర్పాటు చేసిన అముల్ పశుగ్రాస ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసాడు. ఈ కో-ఆపరేటివ్ విజయాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి కలిగిన అతను ఒక గ్రామంలో రైతులతో రాత్రిపూట బస చేసి ఒక రైతు కుటుంబముతో విందు కూడా చేసాడు. అతను కైరా జిల్లా కో-ఆపరేటివ్ పాల ఉత్పత్తుల యూనియన్ లిమిటెడ్ (అమూల్) జనరల్ మేనేజర్ అయిన వర్ఘీస్ కురియన్ తో ఈ విషయంలో చర్చలు జరిపాడు. అతను ఇటువంటి నమూనాలను దేశంలో రైతుల సాంఘిక-ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో కూడా నెలకొల్పాలని వర్ఘీస్ కురియన్ తో చర్చించాడు. ఈ సందర్శన ఫలితంగా 1965 లో ఆనంద్ వద్ద నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు (NDDB) స్థాపించబడింది.
దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక భోజనాన్ని ఇవ్వాలని కోరాడు. దీని ఫలితంగా ఆహార కొరత గల ప్రజలకు కూడా ఆహారం దొరుకుందని తెలియజేసాడు. అయితే దేశానికి విజ్ఞప్తి చేసే ముందు అతను మొదట తన సొంత కుటుంబంలో ఈ వ్యవస్థను అమలు చేసి ధృవీకరించాడు. ఒక వారంలో ఒక భోజనాన్ని వదిలివేసే అభ్యర్థనను ప్రజలకు తెలియజేయడానికి అతను దేశమంతా పర్యటించాడు. అతని విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతీ సోమవారం సాయంత్రం మూసివేయబడినవి. దేశంలోని అనేక ప్రాంతాలు "శాస్త్రి వ్రత్" ను పరిశీలించారు. న్యూఢిల్లీ లోని తన అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్నడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించాడు.
1965 అక్టోబరు 19 న పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో 22వ రోజున అతను అలహాబాదులోని ఉర్వా లో ప్రభావశీలమైన "జై జవాన్ జై కిసాన్" (సైనికులకు అభినందనలు, రైతులకు అభినందనలు) నినాదాన్నిచ్చాడు. అది తరువాత జాతీయ నినాదమైనది. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) అతను బాటలు వేసాడు. అతను సామ్యవాది అయినప్పటికీ, భారతదేశం క్రమమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండరాదని పేర్కొన్నాడు.
1964 ఫుడ్ కార్పొరేషన్ చట్టం అద్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినది. తరువాత నేషనల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బోర్డ్ చట్టం కూడా ఏర్పడినది.


విదేశీ విధానాలు
శాస్త్రి నెహ్రూ విధానాన్ని నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు సోవియట్ యూనియన్ తో మరింత దగ్గరి సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. 1962 సైనో-ఇండియన్ యుద్ధం తరువాత, చైనీస్ పీపుల్స్ రిపబ్లిక్, పాకిస్తాన్ మధ్య సంబంధాల కోసం సైనిక ఏర్పాటు కోసం భారతదేశ సైనిక దళాల రక్షణ బడ్జెట్‌ను విస్తరించాలని శాస్త్రి ప్రభుత్వం నిర్ణయించింది.
1964లో సిలోన్ లోని భారతీయ తమిళుల హోదాకు సంబంధించి శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే తో జరిగిన ఒప్పందంపై సంతకం చేసాడు.[19] ఈ ఒప్పందాన్ని "సిరిమా-శాస్త్రి ఒడంబడిక" గా వ్యవహరిస్తారు.  ఈ ఒప్పందం ప్రకారం, 600,000 మంది భారతీయ తమిళులను తిరిగి స్వదేశానికి పంపించగా, 375,000 మంది శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఈ పరిష్కారం 31 అక్టోబరు 1981 నాటికి జరిగింది. అయితే, శాస్త్రి మరణం తరువాత, 1981 నాటికి, భారతదేశం 300,000 తమిళులను మాత్రమే స్వదేశంలోకి తీసుకున్నారు. శ్రీలంక పౌరసత్వాన్ని 185,000 పౌరులకు (1964 తరువాత మరో 62,000 మంది జన్మించారు) మాత్రమే ఇచ్చింది. తరువాత, భారతదేశం పౌరసత్వం కోసం ఏ ఇతర దరఖాస్తులను పరిగణించకుండా తిరస్కరించింది, 1964 ఒప్పందం గడిచినట్లు పేర్కొంది.
 న్యూ డిల్లీలోని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి వస్తున్న పౌరులను తిరిగి బదిలీచేసే మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ, బర్మా నుండి తిరిగి వచ్చిన భారతీయుల గుర్తింపు, రవాణా కొరకు ఏర్పాటు చేసింది. ఇది భారతీయ నేల మీద నిరాశకు గురైనవారికి ఆశ్రయం కల్పించడానికి, తగిన సౌకర్యాలను అందించడానికి స్థానిక ప్రభుత్వాల బాధ్యతలకు లోబడి ఉంది. ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి, మింజుర్ కె.భక్తవత్సలం, తిరిగి వచ్చిన వారిని పునరావాసం చేయటంలో శ్రద్ధ చూపించాడు. 1965 డిసెబరులో బర్మాలోని రంగూన్ కు తన కుటుంబంతో పాటు అధికారికంగా పర్యటించాడు. జనరల్ "నె విన్" సైనిక ప్రభుత్వంతో సహజమైన సంబంధాలను తిరిగి పునఃస్థాపించాడు.
పాకిస్థాన్ తో యుద్ధం
1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది.
శాస్త్రి తన ప్రధానమంత్రిగా పదవీ కాలంలో రష్యా, యుగోస్లేవియా, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్టు, బర్మా దేశాలను సందర్శించాడు. 1965 లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్త్రి, అయుబ్ ఖాన్ తాష్కెంట్ లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. దీనిని అలెక్సీ కోసైజిన్ నిర్వహించాడు. 1966 జనవరి 10 న శాస్త్రి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మృతిచెందాడు.
మరణం
తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన రోజున 02:00 గంటలకు అతను తాష్కెంట్ లో గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడినది. కానీ ప్రజలు మరణం వెనుక కుట్ర ఆరోపించారు. అతను విదేశంలో చనిపోయే భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతనిని జాతీయ నాయకునిగా శ్లాఘిస్తూ అతని జ్ఞాపకార్థం విజయఘాట్ లో స్మారకం ఏర్పాటు చేసారు. అతను మరణించిన తరువాత భారత కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇందిరా గాంధీని ఎన్నుకొనే వరకు గుల్జారీ లాల్ నందా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు.
కుట్రపూరిత సిద్ధాంతాలు
పాక్‌తో జరుగుతున్న యుద్ద విరమణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు. తాష్కెంట్‌ (ఇది ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఉంది) లో 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడే మరణించాడు. ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్ళి అక్కడే అసహజ, అనుమానాస్పదంగా మృతి చెందడం చరిత్రలో అంతకు ముందెప్పడూ లేదు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధ్రువీకరించింది. కానీ ఆధారాల మేరకు శాస్త్రి బౌతికఖాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. అంతకుముందెప్పుడూ శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్రం రాజ్‌నారాయణ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం నివేదిక ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఆఖరికి ఇది భారత పార్లమెంట్‌ లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు.
భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పాడు. ఈలోగా ఫోన్‌లైన్‌ డిస్కనెక్ట్‌ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్‌ లైన్‌ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్‌ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్‌ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు సంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్రి వెంట అతని వ్యక్తిగత వైద్యుడు ఆర్‌ఎన్‌ చుగ్‌ కూడా తాష్కంట్‌ వెళ్ళాడు. అతనూ పక్కగదిలోనే ఉన్నాడు. కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్‌ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు.
శాస్త్రి విష ప్రయోగం వలన మరణించాడని అతని భార్య లలితా శాస్త్రి ఆరోపించింది. 1978 లో క్రాంత్ ఎం.ఎల్.వెర్మా హిందీలో "లలితా కె ఆంసు" పేరుతో పుస్తకాన్ని రాసి ప్రచురించాడు. ఈ పుస్తకంలో శాస్త్రి మరణం గురించి విషాద కథ అతని భార్య లలిత శాస్త్రిచే వ్యాఖ్యానించబడింది.
తాష్కెంట్ ఒప్పందం గూర్చి శాస్త్రి రష్యా వెళ్ళిన తరువాత పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ నుండి పాకిస్థాన్ భవిష్యత్తులో భారత్ పై బలగాలను ఎప్పుడూ ప్రయోగించరాదనే వాగ్దానాన్ని కోరాడు. కానీ చర్చలు కొనసాగలేదు. తరువాత రోజు శాస్త్రి మరణించాడు.  భారత ప్రభుత్వం అతని మరణం గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. అప్పుడు మీడియా నిశ్శబ్దంగా ఉంది. భారతదేశంలో ఈ కుట్ర జరిగే సాధ్యాసాధ్యాలను "అవుట్ లుక్ మ్యాగజైన్" ప్రచురించింది.
శాస్త్రి మరణం నాటికే భారత్‌, సోవియట్‌ల మధ్య విస్తృతమైన మైత్రిబంధముంది. దీంతో మరణం వెనుక సోవియట్‌ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. అప్పటికే యుద్ధంలో పాక్‌ ఓటమిదశకు చేరుకుంది. నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్‌కు అండగా నిల్చింది. ఈ కారణంగా సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనావేయలేం. పైగా ఆ సమయంలో సిఐఎలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లాన్స్‌గా ఉన్న రోబర్డ్‌ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్‌ అనే జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్‌ హోమీబాబా మరణాలకు సిఐఎ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్‌ను కోరారు. శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలెట్‌ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుంది.
కుటుంబం, వారసులు
1928 మే 16 న శాస్త్రి మిర్జాపూర్ కు చెందిన లలితా దేవిని వివాహమడాడు. ఈ వివాహం పెద్దలచే సాంప్రదాయ పద్ధతిలో చేయబడినది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వారి పేర్లు:
1.కుసుమ శాస్రి, పెద్ద కుమార్తె
2.హరికృష్ణ శాస్త్రి, పెద కూమరుడు. అతని భార్య విభా శాస్త్రి
3.సుమన్ శాస్త్రి, రెండవ కుమార్తె, ఆమె విజయ్ నాథ్ సింగ్ ను వివాహమాడింది. వారి కుమారుడు సిద్దేంద్రనాథ్ సింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రాతినిధి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో వైద్యశాఖామంత్రి.
4.అనిల్ శాస్త్రి. ఆమె మంజు శాస్త్రిని వివాహమాడాడు. అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అతని కుమారుడు ఆదర్శ్ శాస్త్రి ఏపిల్ కంపెనీ తో కార్పొరేట్ జీవితాన్ని ప్రారంభించి 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమ్‌ఆదమీ పార్టీ తరపున అలహాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
5.సునీల్ శాస్త్రి. అతను మీరా శాస్త్రిని వివాహమాడాడు. అతను భారతీయ జనతాపార్టీలో సభ్యుడు.
6.అశోక్ శాస్త్రి. చిన్న కుమారుడు. అతను కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తూ 37 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతని భార్య నీరా శాస్త్రి, కుమారుడు సమీప్ శాస్త్రి లు భారతీయ జనతా పార్టీలో సభ్యులు.
వారసత్వ సంపద
1960 నుండి 1964 మధ్య కాలంలో కులదీప్ నయ్యర్, శాస్త్రికి సలహాదారునిగా ఉండేవాడు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అతని కుమార్తెకు జబ్బు చేసింది. అతను జైలు నుండి పెరోల్ పై విడుదలయ్యాడు. అయినప్పటికీ వైద్యులు ఖరీదైన మందులు సూచించిన కారణంగా ఆమెను రక్షించుకోలేక పోయారని నయ్యర్ తన జ్ఞాపకాలను తెలిపాడు. 1963 తరువాత, కేబినెట్ నుండి బయటికి వచ్చిన తరువాత అతను తన గృహంలో చీకటిలో కూర్చున్నాడు. దానికి కారణం అడిగితే అతను ఇకపై మంత్రిని కాదు కనుక అన్ని ఖర్చులు స్వయంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపాడు. ఒక పార్లమెంటు సభ్యుడు, మంత్రిగా అతను అవసరమైన సమయం కోసం ఆదాచేయడానికి తగినంత సంపాదించలేదు అని తెలిపాడు.
స్మారకాలు
శాస్త్రి నిజాయితీ పరుడు, మానవతావాదిగా పేరొందాడు. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన వ్యక్తులలో మొదటివాడు. న్యూఢిల్లో లో "విజయ్ ఘాట్" పేరుతో అతనికి స్మారక స్థలముంది.
అతని పేరుతో లాల్ బహాదుర్ శాస్త్రి అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విద్యాసంస్థను ముస్సోరీ, ఉత్తరఖండ్ లో నెలకొల్పారు.
1995 లో "లాల్ బహదూర్ శాస్త్రి ఎడ్యుకేషన్ ట్రస్టు" ద్వారా "లాల్ బహాదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు" స్థాపించబడినది. ఇది భారత దేశంలో అతి పెద్ద బిజినెస్ స్కూలు. ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ను లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ మెమొరియల్ ట్రస్టు ప్రారంభించింది.
2011లో శాస్త్రి 45వ వర్థంతి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రామ్‌నగర్ లో శాస్త్రి నివసించిన పూర్వీకుల భవనాన్ని పునరుద్ధరించి అతని జీవిత చరిత్ర మ్యూజియంగా మలచాలని ప్రకటించింది.
వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి అతని పేరును పెట్టారు.
ఉజ్బెకిస్థాన్, తాష్కెంట్ నగరంలో ఒక వీధికి అతని పేరును పెట్టారు.
కొన్ని స్టేడియాలకు అతని పేరు పెట్టారు. ఉదా: హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియం. అదే విధంగా అహ్మదాబాద్, కొల్లం, కేరళ, భవానీపాట్నా లలో ఈ పేరుతో స్టేడియం లు ఉన్నాయి.
కృష్ణా నదిపై ఉత్తర కర్నాటకలోనిర్మిచిన ఆల్మట్టి డ్యాం కు "లాల్ బహాదూర్ శాస్త్రి సాగర్" గా నామకరణం చేసారు.
కార్గో షిప్ కు "ఎం.వి.లాల్ బహాదూర్ శాస్త్రి" గా నామకరణం చేసారు.
భారతీయ రిజర్వు బ్యాంగు ఐదు రూపాయల నాణేన్ని అతని చిత్రంతో విడుదల చేసింది.

1991 నుండి ప్రతీ సంవత్సరం ఆల్ ఇండియా లాల్ బహాదూర్ శాస్త్రి హాకీ టోర్నమెంటు జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు "లాల్ బహాదూర్ శాస్త్రి కాలువ" గా పేరుపెట్టారు. దీని పొడవు 295 కి.మీ.
అతని పూర్తి విగ్రహాలు ముంబై, బెంగళూరు(విధాన సౌధ), న్యూఢిల్లీ(సి.జి.ఒ సముదాయం), ఆల్మట్టి ఆనకట్ట స్థలంలో, రామనగర్ (యు.పి), హిసార్, విజగపట్టిణం, నాగార్జున సాగర్ ఆనకట్ట స్థలం, వరంగల్ లలో ఉన్నాయి.
అతని సగం భాగం గల బస్ట్ విగ్రహాలు తిరువనంతపురం, పూణె, వారణాసి (విమానాశ్రయం), అహ్మదాబాద్ (సరస్సు ప్రక్కన), కురుక్షేత్ర, షిమ్లా, కాసర్గాడ్, జలంధర్, లలో ఉన్నాయి.
న్యూఢిల్లీ, ముంబై, పూణె, పాండిచేరి, లక్నో, వరంగల్, అలహాబాద్ లలో ముఖ్యమైన రోడ్లకు పేరు పెట్టారు.
లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కళాశాల, మండి, హిమాచల ప్రదేశ్ లో వుంది.
శాస్త్రి భవనాలు న్యూఢిల్లీ, చెన్నై, లక్నోలలో వున్నాయి.
2005లో భారత ప్రభుత్వం ఆయన పేరుతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్య మరియు పరిపాలన అధ్యయన విభాగంలో అధ్యక్ష స్థానం కల్పించింది.
ఇతర విషయాలు
దేశ ప్రధాని కాకముందు లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచాడు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యాడు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్త్రి’ గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు, శాస్త్రికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితాశాస్త్రి తో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు "స్వంత ఇల్లు" అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’ అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు.
లాల్‌ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్త్రిగారు) మీద ఒత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నాడు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించాడు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రి కి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.
లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపాడు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట.


Lal Bahadur Shastri Biography,lal bahadur shastri biography pdf,lal bahadur shastri biography in telugu
,lal bahadur shastri born and died,autobiography of lal bahadur shastri,about lal bahadur shastri biography in telugu,lal bahadur shastri brief biography,lal bahadur shastri death wiki,biography documentary of lal bahadur shastri,lal bahadur shastri family history,lal bahadur shastri full history,lal bahadur shastri full history in telugu,lal bahadur shastri ji biography,lal bahadur shastri history telugu,lal bahadur shastri ki biography,lal bahadur shastri ka biography,lal bahadur shastri ki history,lal bahadur shastri life history,lal bahadur shastri life history in telugu,lal bahadur shastri life history in short,lal bahadur shastri biography in telugu language,lal bahadur shastri wikipedia marathi,prime minister lal bahadur shastri biography,biography of lal bahadur shastri in telugu,lal bahadur shastri biography in telugu pdf,lal bahadur shastri biography telugu,lal bahadur shastri biography in telugu wikipedia
Previous
Next Post »
0 Komentar