Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Louis Braille biography


                లూయీ బ్రెయిలీ
                        



                                     

               " ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ "
బాల్యం- విధ్యాభ్యాసం
1809 సం. జనవరి 4 న పారిస్ దగ్గరలోని క్రూవేగ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ మరియు సైమన్ రెనె బ్రెయిలీ. మూడేళ్ల వయసులో తన తండ్రి తోళ్లను కోసేందుకు ఉపయోగించే కత్తి వలన ప్రమాదవశాత్తు తన రెండు కళ్ళను కోల్పోయి, తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. పారిస్‌లో అంధుల పాఠశాలలో  బ్రెయిలీ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న లైన్ టైపుపద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.


అంధుల లిపి కోసం కృషి
పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసేవాడు. ప్రింటింగు విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి వుండాలని, ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుంటే చదవటం తేలిక అని బ్రెయిలీ నిశ్చయానికి వచ్చాడు. ఛార్లెస్ బార్బియర్ తయారు చేసిన 12 ఉబ్బెత్తు చుక్కలలో ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను బ్రెయిలీ రూపొందించాడు. ఈ నిరంతర శ్రమవల్ల 1851 లో క్షయ వ్యాధికి గురై మరణించాడు. బ్రెయిలీ శిష్యులు కృషి ఫలితంగా  అతని లిపికి అధికార గుర్తింపు లభించింది.  
బ్రెయిలీ లిపి
 చూసి చదవలేని, రాయలేని అంధుల కోసం లూయీస్ బ్రెయిలీ తయారు చేసిన లిపిని బ్రెయిలీ లిపి అంటారు. దృశ్య వైకల్యం ఉన్న అంధులకు స్పర్శ రచన పద్ధతి ఉపయోగించటం ద్వారా పుస్తకాలలో, మెనూలలో, ద్రవ్యంపై చదవటం, వ్రాయటమే బ్రెయిలీ లిపి. యువకుడైన బ్రెయిలీ తన పరిశోధనలో ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవాత్మకమైన మార్పు, ఒక చుక్కనుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు. ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరు చుక్కలలో బ్రెయిలీ రూపొందించాడు. ఈ రకంగా గ్రుడ్డివారు బ్రెయిలులో వ్రాయగలరు, చదవగలరు. వారికి ఇతరుల సహాయం అక్కరలేదు. సంగీతాన్ని కూడా తన లిపిలో వ్రాయడం అతని విశిష్టత. ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిలీ లిపికి గుర్తింపు వచ్చి అంగీకరించినా, అమెరికా 1916 లోనే దానిని ఆమోదించింది.
మరణం - గుర్తింపు
బ్రెయిలీ 1852 జనవరి 643 సంవత్సరాల పిన్న వయస్సులోనే మరణించాడు. 1952లో అతని అస్తికలను పారిస్‌లో పాంథియన్‌లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినోత్సవం సందర్భంగా 2009 లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదే విధంగా అమెరికా ఒక డాలరు నాణాన్ని విడుదలచేయడం అపూర్వం, అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు. ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.

Click here for Louis Braille Biography in Telugu
louis braille biography in telugu,louis braille biography pdf,about louis braille biography,louis braille brief biography,louis braille biography.com,louis braille was born in,louis braille biography in telugu language,biography of louis braille,biography of louis braille in telugu,louis braille short biography,scholastic biography louis braille,louis braille was born
Previous
Next Post »
0 Komentar