Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Madapati Hanumantha Rao Biography

Madapati Hanumantha Rao Biography


మాడపాటి హనుమంతరావు
మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. 
వ్యక్తిగత జీవితం
మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేన మామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 
రచనారంగం
మాడపాటివారు మంచి కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త. రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
ఆంధ్రోద్యమం
తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పారు. రాజకీయ రంగంలో మాడపాటి వారిది మితవాదధోరణి. మాడపాటి హనుమంతరావును భిన్న రాజకీయ దృక్పథాలు, వేర్వేరు సిద్ధాంత ప్రాతిపాదికలు ఉన్నవారు కూడా గౌరవించేవారు. తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన తొలియత్నాలే కారణం కావడమే వారి పట్ల ఆ గౌరవానికి కారణం. ఆయన ఆంధ్రమహాసభకు పెద్దదిక్కువలె వ్యవహరించేవారు. నిజాం ప్రభుత్వ విధానాల కారణంగా తెలంగాణలో తెలుగుభాష దెబ్బతింటున్నప్పుడు ఆయన తెలుగుభాష, తెలుగు సంస్కృతి వికాసానికి ఎనలేని కృషి చేశారు. ఆంధ్రోద్యమాన్ని ఆరంభ దశ నుంచి ఓ మహోద్యమంగా మలిచేవరకూ సాగిన ఆయన జీవనపథంలో పలువురు తర్వాతి తరం మహానాయకుల్లో రాజకీయ నేతృత్వాన్ని ఆయనే మొదట ప్రోత్సహించారు. ఆంధ్రోద్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించారు. వారి చేతిలో తర్వాతి తరం తెలంగాణా పోరాట నాయకత్వం రూపుదిద్దుకున్నది అన్నా అతిశయోక్తికాదు.
గ్రంథాలయోద్యమం
ఆయన గ్రంథాలయోద్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు. ఈ క్రమంలో ఆయన తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే. వీటిలో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా చారిత్రిక ప్రశస్తి పొందింది. గ్రంథాలయాల ద్వారానే చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది.


విద్యారంగం
ఆయన ప్రజాసేవ విద్యారంగంలోనూ విస్తరించింది. భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. 
రాజకీయరంగం
రాజకీయ రంగంలో ప్రత్యక్ష కార్యాచరణ, క్రియాశీల రాజకీయం వంటివి మాడపాటి హనుమంతరావు ప్రముఖంగా చేపట్టలేదు. దీనికి ముఖ్యకారణం ఆయన ప్రజాజీవనంలో ప్రవేశించిన అప్పటి స్థితిగతుల గురించి ఒక్కమాటలో చెప్పాల్సివస్తే ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో రాజకీయాలకు తావుండేది కాదు. ఈ నేపథ్యంలో మాడపాటి హనుమంతరావు అప్పటి స్థితికి అనుగుణంగా తన ప్రజాసేవా కార్యకలాపాలు మలుచుకున్నారు. అప్పటి ఆయన వ్యూహ రచన ఇలావుండేది: ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలి. ఈ ప్రణాళిక మొత్తం ఆనాటి స్థితిగతుల మూలంగా ఏర్పడింది. నిజానికి ఈ రాజకీయ కార్యకలాపాలకు తావులేని సాంస్కృతికోద్యమమే తదుపరి కాలంలో తెలంగాణాలో వెల్లువెత్తిన అన్నిరకాల ఉద్యమాలకు ముఖ్యభూమికగా నిలిచింది. ఆంధ్రోద్యమ ప్రభావంలో చదువుకున్న వారే తర్వాత నాయకులై ముందుండి నడిపారు.
మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. కాకుంటే ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు.
విమర్శలు
1920ల్లో ఈ వ్యూహం సత్ఫలితాలు ఇచ్చినా తర్వాత దశాబ్దాలు గడుస్తున్నా, స్థితిగతులు మారుతున్నా మాడపాటి అదే మార్గంలో కొనసాగుతుండడంతో ఆయన వైఖరి తర్వాతి తరం నాయకుల విమర్శలకు లోనైంది. ఒక సందర్భంలో స్టేట్ కాంగ్రెస్ పక్షాన సత్యాగ్రహం చేయమని మాడపాటి హనముంతరావును ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆహ్వానించగా, "సత్యాగ్రహాలు చేసి జైళ్ళపాలై సంపాదన పాడుచేసుకోమని, కోర్టుల్లో తాము చేయగలిగిన పని ఏదైనా ఉంటే చెప్పమని" బదులిచ్చినట్లు చెబుతుంటారు.
పురస్కారాలు-గౌరవాలు
ఆయన తెలంగాణా రాజకీయరంగంలో వహించిన బాధ్యతలను పురస్కరించుకుని ఆంధ్రపితామహుడన్న బిరుదుతో వ్యవహిరిస్తూంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి.
మరణం

మాడపాటి 1970, నవంబరు 11న తన 85వ ఏట కన్నుమూశారు.


Madapati Hanumantha Rao Biography,Madapati Hanumantha Rao Biography in telugu,Madapati Hanumantha Rao biography pdf,Madapati Hanumantha Rao biography wikipedia,Madapati Hanumantha Rao a biography,Madapati Hanumantha Rao a biography by swami nikhilananda,autobiography of Madapati Hanumantha Rao,Madapati Hanumantha Rao a biography in pictures,Madapati Hanumantha Rao a born,Madapati Hanumantha Rao a born leader pdf,swami Madapati Hanumantha Rao all biography,Madapati Hanumantha Rao biography book pdf, Madapati Hanumantha Rao brief biography,Madapati Hanumantha Rao biography download,Madapati Hanumantha Rao born date,Madapati Hanumantha Rao born day,Madapati Hanumantha Rao biography in telugu download, Madapati Hanumantha Rao biography in telugu pdf download,Madapati Hanumantha Rao biography telugu,Madapati Hanumantha Rao biography telugu pdf,swami Madapati Hanumantha Rao biography essay,Madapati Hanumantha Rao full biography,Madapati Hanumantha Rao biography pdf free download

Previous
Next Post »
0 Komentar