Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Mrinalini Sarabhai Biography

Mrinalini Sarabhai Biography

మృణాళినీ సారభాయ్ బయోగ్రఫీ
మృణాళినీ సారభాయ్ ( జననం: మే 11 ,1918 - మరణం: జనవరి 20, 2016 )భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు మరియు నృత్య గురువు. ఆమె "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్"కు వ్యవస్థాపకురాలు. ఈ సంస్థలో నృత్య రీతులు, నాటకాలు, సంగీతం మరియు పప్పెట్రీ లపై శిక్షణ నిస్తారు.ఈ సంస్థ అహ్మదాబాదులో ఉంది.ఆమె చేసిన కళా సేవలకు గాను అనేక పురస్కారాలను పొందింది. ఆమె 18,000 మంది శిష్యులకు భరతనాట్యం మరియు కథాకలి లలో శిక్షణ నిచ్చింది.
బాల్య జీవితం మరియు విద్య
మృణాళిని కేరళ లోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త అయిన అమ్ము స్వామినాథన్ కుమార్తె. ఆమె బాల్యం స్విడ్జర్లాండ్ లో గడిచింది. ఆమె "డాల్‌క్రోజ్" పాఠశాలలో మొదటి పాఠాలుగా పశ్చిమాది నృత్య భంగిమలను చేర్చుకుంది.ఆమె శాంతి నికేతన్‌లో రవీంధ్ర నాథ్ ఠాగూర్ మార్గదర్సకత్వంలో విద్యాభ్యాసం చేసింది. తర్వాత ఆమె కొంతకాలం అమెరికా సంయుక్త రాష్ట్రాల కు వెళ్ళి అచట అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో చేరింది. తర్వాత భారత దేశానికి వచ్చి ఆమె దక్షిణాది సాంప్రదాయక నృత్యం అయిన భరతనాట్యాన్ని "మీనాక్షి సుందరంపిళ్ళై" ద్వారా మరియు కథాకళి నృత్యాన్ని "తకఘి కుంచు కురూప్" ద్వారా శిక్షణ పొందింది.
వివాహం
మృణాళిని భారతీయ భౌతిక శాస్త్రవేత్త విక్రం సారాభాయ్‌ను వివాహం చేసుకుంది. అతడు భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితగా వ్యవహరింపబడ్డారు. వారికి ఒక కుమారుడు కార్తికేయ సారభాయ్ మరియు ఒక కుమార్తె మల్లికా సారభాయ్ ఉన్నారు. ఆమె కుమార్తె మల్లిక కూడా నృత్య కళాకారిణి. మృణాళిని 1948 లో దర్పణ అనే సంస్థను స్థాపించింది. విక్రం సారభాయ్ తన భార్యకు తన కెరీర్ ను పెంపొందించుకొనుటలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వారు సమస్యాత్మకమైన వివాహ బంధాన్ని గడిపారు.జీవిత చరిత్రల రచయిత "అమృతా షా"చెప్పిన ప్రకారం విక్రం సారభాయ్ వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి పూర్తిగా అంకితమయిన వ్యక్తి.
వివిధ రంగాలలో సేవలు
ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె అనేక నవలలు, కవితలు, నాటకాలు మరియు కథలు పిల్లల కోసం వ్రాసింది. ఆమె గుజరాత్ రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నది. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ఒక ట్రస్టీగా కూడా ఉన్నది. ఆమె నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్కు చైర్‌పర్సంగా ఉన్నది. ఆమె జీవిత చరిత్ర "మృణాళినీ సౌరభాయ్:ది వోయిస్ ఆఫ్ ద హర్ట్" పుస్తకం ద్వారా ప్రచురణ అయినది.


కుటుంబం
ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లా కాలేజీలో ప్రిన్సిపాల్ గా యుండేవాడు. అమె తల్లి అమ్ము స్వామినాథన్ ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అజాద్ హిందు ఫౌజ్ లోని "రాణి ఆఫ్ ఝాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా యుండేది. ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. అతడు మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించాడు.
అవార్డులు
మృణాళినీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును 1992 లో అందుకున్నారు. 1997 లో యు.కె లోని న్యూయాచ్ కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా మరియు మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచింది. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడింది.మరియు 1994 లో న్యూఢిల్లీ లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందింది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృనాళినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్‌లెన్స్" అవార్డును ప్రకటించారు.
మరణం
ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 21 2016 న మరణించింది.


Mrinalini Sarabhai Biography,Mrinalini Sarabhai Biography in telugu,Mrinalini Sarabhai biography pdf,Mrinalini Sarabhai biography wikipedia,Mrinalini Sarabhai a biography,Mrinalini Sarabhai a biography by swami nikhilananda,autobiography of Mrinalini Sarabhai,Mrinalini Sarabhai a biography in pictures,Mrinalini Sarabhai a born,Mrinalini Sarabhai a born leader pdf,swami Mrinalini Sarabhai all biography,Mrinalini Sarabhai biography book pdf, Mrinalini Sarabhai brief biography,Mrinalini Sarabhai biography download,Mrinalini Sarabhai born date,Mrinalini Sarabhai born day,Mrinalini Sarabhai biography in telugu download, Mrinalini Sarabhai biography in telugu pdf download,Mrinalini Sarabhai biography telugu,Mrinalini Sarabhai biography telugu pdf,swami Mrinalini Sarabhai biography essay,Mrinalini Sarabhai full biography,Mrinalini Sarabhai biography pdf free download
Previous
Next Post »
0 Komentar