Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Vladimir Lenin Biography

Vladimir Lenin Biography


లెనిన్ బయోగ్రఫీ
లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్లిక్ ఉలియనోవ్ రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజమ్ లేదా మార్క్స్సిజమ్-లెనినిజమ్ అని అంటారు. 20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. 
బాల్యం
ఏప్రిల్ 22, 1870 లో ఓల్గా నదీతీరాన గల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అదిచూచి లెనిన్ మనస్సు రాయిచేసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో ఆరంభమైన యీ దృష్టి లెనిన్ లో రానురాను గట్టిపడింది. విప్లవ చర్యలకు ఉపక్రమించాడు. సైబీరియా ప్రవాస జీవితార్ధం పంపబడిన లెనిన్ అక్కడే విప్లవ కారిణి క్రుపస్కయాను పెళ్ళాడాడు.
విప్లవ కార్యక్రమాలు, దేశ బహిష్కారం
తన 31వ ఏట(1901లో) లెనిన్ మారుపేరు ధరించాడు. లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు. స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరామంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు. పొలంపనులకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరించాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు. 


రష్యాకు తిరిగి రాక
రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్ధం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో ఉన్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు. 1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు. జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.
తన అధికారానికి బయటా, లోపల తిరుగులేకుండా చెసుకోడానికి లెనిన్ చేయవలసిన దారుణ కృత్యాలన్నీ చేశాడు. జర్మనీవారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, లెనిన్ వారితో సంధి చేసుకున్నాడు. అంతటితో రష్యాకు జర్మనీ సైవ్యాల బెడద ఆగింది. లెనిన్ రాక్షసకృత్యాలకు అంతరంగికంగా మరింత అవకాశం చిక్కింది. ఇందుకు అండగా నిలిచినవాడు స్టాలిన్. చేకా అనే రహస్య సంస్థ విచారణకూడా రహస్యంగానే జరిపేది. చేకా సంస్థతో బాటు రష్యా అంతటా రహస్య నిర్బంధ శిబిరాలు, జైళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోగ్రాడ్ నుండి మాస్కోకు రాజధానిని మార్చిన లెనిన్ తక్షణమే క్రెమ్లిస్ లో ఒక రహస్య కేంద్రాన్ని, దీనికి తెలియకుండా జర్జినిస్కే నాయకత్వాన మరో రహస్య స్థావరాన్ని ఏర్పరచాడు. ఇదే చేకా అంటే. ఈ సంస్థ లెనిన్ కు మాత్రమే జవాబుదారి. దీని ఉనికి ఎవరికీ తెలియదు. ఊరికే తిరిగేవారిని వున్న పళంగా చంపేయమని లెనిన్ చేకాకు ఉత్తర్వులిచ్చాడు. అనేక విధాలైన శత్రువులను సంహరించమని 1918 ఫిబ్రవరి 23న లెనిన్ మరో ఉత్తర్వు చేకాకు యిచ్చాడు.  
1918లో మొదటి ఆరునెలల్లో లెనిన్ ఉత్తరువులననుసరించి, కేవలం 22 మందినే చేకా చంపినట్లు అధికార నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత ఆర్నెల్లలో ఆరు వేల మందిని ఉరితీశారు. 1919లో కేవలం 10 వేల మందిని చంపేశారు. 1920 వచ్చే సరికి చేకా సంస్థకు చేతినిండా పని తగిలింది. ఆ యేడు 50 వేల మందిని ఉరితీసేశారు. ఇదంతా లెనిన్ ప్రోత్సాహం, ఉత్తర్వుల మేరకే జరిగిన మారణకాండ.       
రష్యాలో రైతులకు హామీలు గుప్పించిన లెనిన్ వారికి చెల్లని చెక్కులు యిష్టానుసారంగా యిచ్చి నమ్మించి మోసం చేశాడు. విదేశాలవారికోసం స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని వల్లించిన లెనిన్ రష్యాలో దీనిని పాటించలేదు. ఉక్రైన్, కాక్పన్, ఏషియన్ రష్యాలో లెనిన్ స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని అనుమతించలేదు. లెనిన్ కు చిట్టచివరి వ్యతిరేకత నావికదళం నుండి వచ్చింది. పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. 
1917లో ధనవంతుల భూముల్ని ఆక్రమించుకోవలసిందిగా లెనిన్ రైతులకు పిలుపు నిచ్చారు. 86 శాతం భూమి రైతుల చేతుల్లో వుండగా ప్రభుత్వ సమష్టి వ్యవసాయానికి 11 శాతమే దక్కింది. ఇది చూచి 1918లో పంటను స్వాధీనం చేసుకోమంటూ లెనిన్ ఫాక్టరీ కార్మికులను పొలాల మీదకు పంపించాడు. కులక్ లకు అంటే ధనవంతుల వ్యతిరేకంగా చిన్న రైతుల్ని సమీకరించాడు. నగరాలలో ఆహార కొరత తీర్చడానికి రైతులకు పెద్దఎత్తున ప్రయత్నించాడు. అంతటితో రైతులకు స్వేచ్ఛను యిచ్చామన్నారు. . 1921లో వచ్చిన కరువు కారణంగా లెనిన్ విధాన ఫలితంగా 30 లక్షల మందికి ఉపయోగం జరిగింది.
చివరి రోజులు
1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించేవాడు. లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. ముందుగా నోరు పడిపోయిన లెనిన్ జనవరి 21, 1924 లో మరణించాడు. 


Lenin Biography,Lenin Biography in telugu,lenin biography pdf,lenin biography wikipedia,lenin a biography,lenin a biography by swami nikhilananda,autobiography of lenin,lenin a biography in pictures,lenin a born leader,lenin a born leader pdf,swami lenin all biography,lenin biography book pdf, lenin brief biography,lenin biography download,lenin born date,lenin born day,lenin biography in telugu download, lenin biography in telugu pdf download,lenin biography telugu,lenin biography telugu pdf,swami lenin biography essay,lenin full biography,lenin biography pdf free download,Vladimir Lenin Biography,Vladimir Lenin Biography in telugu,Vladimir Lenin biography pdf,Vladimir Lenin biography wikipedia,Vladimir Lenin a biography,Vladimir Lenin a biography by swami nikhilananda,autobiography of Vladimir Lenin,Vladimir Lenin a biography in pictures,Vladimir Lenin a born leader,Vladimir Lenin a born leader pdf,swami Vladimir Lenin all biography,Vladimir Lenin biography book pdf, Vladimir Lenin brief biography,Vladimir Lenin biography download,Vladimir Lenin born date,Vladimir Lenin born day,Vladimir Lenin biography in telugu download, Vladimir Lenin biography in telugu pdf download,Vladimir Lenin biography telugu,Vladimir Lenin biography telugu pdf,swami Vladimir Lenin biography essay,Vladimir Lenin full biography,Vladimir Lenin biography pdf free download

Previous
Next Post »
0 Komentar