Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Balala Geyalu-Part-5

Balala Geyalu-Part-5


1.తెలుగుదేశపు
తెలుగుదేశపు తెలుగు పిల్లలు , తెలుగు వెలుగులమండి
తెలుగు బాలురు తెలుగు పాపలు , తెలుగు సొమ్ములమండి
తెలుగు తోటలు తెలుగు బాటలు , తిరుగుచు కనరండీ
తెలుగు సీమల ఆట పాటలు
తెలియగ వినరండి (3)



  • 1.తెలుగుదేశపు

  • 2.వానదేవుడోచ్చినాడు వాసుదేవా
    వానదేవుడోచ్చినాడు వాసుదేవా , చెరువులన్నీ నిండినాయి చెన్నకేశవా
    మడులన్ని దున్నినాము మల్లికార్జునా , ఎరువంతా వేసినాము ఎర్రిస్వామీ
    వరినాట్లు వేసినాము వరదరాజూ , వరిపంట బాగొచ్చె వన్నూరప్పా 
    కరువులే పోయినాయి కాశినాధా , కేరింతలు కొట్టినారు బాలలంతా



  • 2.వానదేవుడోచ్చినాడు వాసుదేవా

  • 3.అదిగదిగో కొంగల జంట
    అదిగదిగో కొంగల జంట , చల్లని నీటిలో ఉన్నాదంట
    అందులోనే చేపల మంద , చేపలు ఉన్నాయ్ ఒక వంద
    చేపలు ఉన్నాయ్ కొంగల చెంత , కొంగకు దొరకక ఒకటే చింత!



  • 3.అదిగదిగో కొంగల జంట

  • 4.చిన్ని కుక్కా !చిన్ని కుక్కా!
    చిన్ని కుక్కా !చిన్ని కుక్కా!
    తింటావా, తింటావా? బిస్కెట్ ముక్క
    వేగం వేగం వస్తావా, నాతో దౌడు తీస్తావా?



  • 4.చిన్ని కుక్కా !చిన్ని కుక్కా!

  • 5.దళితవాడలో పుట్టావయ్యా
    దళితవాడలో పుట్టావయ్యా - పేదరికంలో పెరిగావయ్యా
    బడిలో చివరన చేరావయ్యా - గుడికి దూరంగా నిలిచావయ్యా |దళిత |
    కులతత్వపు ఈ అడ్డు గీతలు - కోటి ప్రశ్నలే లేవనెత్తగా
    ఎటు చూసినా అజ్ఞానం - చుట్టూరా అంధకారం |దళిత |
    బాధలూ ఈసడింపులూ - బానిస బతుకుల విముక్తి కోసం
    దేశాలెన్నో తిరిగీ తిరిగీ - శాస్త్రాలెన్నో చదివి చదివీ |దళిత |
    మానవత్వపు విలువలు పెంచి - మతతత్వానికి హద్దులు చెరిపి
    నీవు కూర్చిన రాజ్యాంగం - జాతి జనులకు కరదీపం |దళిత |



  • 5.దళితవాడలో పుట్టావయ్యా


  • 6.జోలాలి పాడాలి
    జోలాలి పాడాలి (2)
    ఈ జోల పాటతో పాపాయి
    ఆపాలి నీ గోల పాపాయి (2) | జోలాలి పాడాలి|
    పొలం నుంచి రమ్మని
    పాలిచ్చి పొమ్మని
    అమ్మనీ రమ్మని
    కాకితో కబురంపాను
    నే కాకితో కబురంపాను
    ఈ కాకి చేరలేదు
    ఆ కబురు అందలేదు
    కామందు పంపలేదు
    మన అమ్మ రానేలేదు
    నువు ఆకలేసి గుక్క పడితే ఏం చేయాలి?
    నేనేం చేయాలి? |జోలాలీ|
    అమ్మ రాలేదనీ
    ఆటలాగ లేదనీ
    బొమ్మ తెచ్చి ఇవ్వనా
    నీను బొమ్మతో ఆడించనా(2)
    మరి బొమ్మ లేనే లేదు
    మన అమ్మ పేదరాలు
    మన అయ్య బీదవాడు
    చిన గిలక్కాయ లేదు
    ఇక బొమ్మనేమి కొంటారు
    మరి బొమ్మలేక అమ్మ రాక ఏం చేయాలి?
    నేనేం చేయాలి? |జోలాలీ|
    బూచోడొస్తాడనీ
    నిను పట్టుకపోతాడనీ
    నిను ఎత్తుకు పోతాడనీ
    బుజ్జిని నేను బెదిరించాను
    చిన్న బుజ్జిని నేను బెదిరించాను
    బూచోడు రానే లేదు
    మా బుజ్జి బెదరలేదు
    ఆ కుక్క భయం లేదు
    ఈ పిల్లి భయం లేదు
    చెల్లాటలాపలేదు
    మరి అదరలేదు బెదరలేదు ఏం చేయాలి?
    నేనేం చేయాలి? |జోలాలీ|
    ఎంత ఆడించినా
    ఏ జోల పాట పాడినా
    ఏడుపాగలేదనీ
    పాపను నేను బాదేశాను
    చిన్న పాపను నేను బాదేశాను
    మా చెల్లి ముఖం చూసి
    నా కళ్ల నీళ్లు తిరిగే
    ఈ తల్లి రాకపోయె
    నాకేమీ తోచదయ్యో!
    ఏం చేయాలి?
    నేనేం చేయాలి? |జోలాలీ|



  • 6.జోలాలి పాడాలి

  • 7.నీడను ఇచ్చే తరులూ
    నీడను ఇచ్చే తరులూ-నింగిని తాకే గిరులూ
    జల జల పారే ఝరులూ-తళ తళ విరిసే విరులు
    అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం[2)
    వెలుగును ఇచ్చే సూర్యుడు-వెన్నెలనిచ్చే చంద్రుడు (2)
    తలతల మెరిసే తారలూ-చల్లని మబ్బుల బారులూ(2)
    అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం[2)
    ధాన్యమునిచ్చే పొలాలు-దాహము తీర్చే జలాలు(2)
    పొలాలు దున్నే హలాలు-పలు రకంబుల ఫలాలు(2)
    అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం(2)
    అడవిన తిరిగే మృగాలు -అంతట ఎగిరే ఖగాలు(2)
    చోద్యమైన కీటకాలు-చూడ చూడ పలు రకాలు(2) 
    ఎన్నో ఉన్న ఈ లోకం-ఎన్నదగిన ఒక నాకం[2)
    దేవుని కోసం గుళ్లూ-దూరము పోవగ బళ్లూ(2)
    అందాలొలికే ఇళ్లూ-అన్నీ చూడగ కళ్లూ(2)
    అమరిఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం
    అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం
    అందమైన ఒక నాకం



  • 7.నీడను ఇచ్చే తరులూ

  • 8.కోడి పిల్ల కోడి పిల్ల
    కోడి పిల్ల కోడి పిల్ల ముద్దుగుంటది
    ముట్టుకుంటే పట్టుకుంటే మెత్తగుంటది
    గింజలేసి పెంచితే పెద్దదౌతది
    పెద్దదై పెద్దదై గుడ్డు పెడతది
    గుడ్డు తింటే బాలలకు బలం వస్తది
    తల్లి పొట్టకింద పొదిగితే పిల్లౌతది! 



  • 8.కోడి పిల్ల కోడి పిల్ల

  • Balala Geyalu-Part-5.balala geyalu..balala geyalu in telugu.balala geyalu in telugu lyrics.balala geyalu in telugu lyrics pdf,telugu balala geyalu pdtbalala geethalu in telugu.balala telugu patalu.school telugu geyalu. telugu childrens songs.telugu balala geyalu,children folk songs.telugu childrens folk songs. 
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags