Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 11th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....


School Assembly 11th February Information
నేటి ప్రాముఖ్యత 
ప్రపంచ వివాహ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.
విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ 1847 వ సం.లో జన్మించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త గురజాడ రాఘవశర్మ 1899 వ సం.లో జన్మించారు.. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. 
ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ 1942 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1974 వ సం.లో మరణించారు.
భారత ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1977 వ సం.లో మరణించారు.
పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత ఆస్మా జహంగీర్ 2018 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
శతక పద్యం
శతకం అంటే నూరు అని అర్థం. తెలుగు భాషలో శతకము మహాకావ్య ప్రక్రియతో పాటు ఎంతో గొప్పగా ఆదరింపబడింది. సంస్కృత వాజ్మయం నుంచి తెలుగుకు తెచ్చుకున్న సాహిత్య ప్రక్రియలలో శతక రచన ఒకటి. సంస్కృత పాకృత వాజ్మయ శతక ప్రక్రియకు తెలుగు శతక ప్రక్రియ ప్రతిరూపమే అయినా, తెలుగులో ఎన్నో విశిష్టపోకడలు పోయి ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. నన్నయనాటి నుంచి నేటి వరకు ఎంతో ఆదరింపబడుతున్న ప్రక్రియ ఈ శతకం.
మంచి మాట /సుభాషితం:
ఆందోళన మనిషిని బలహీనుడిని చేస్తుంది- మార్క్‌ ట్వైన్‌


వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష, మొండి వైఖరిని ఎండగట్టడానికి 'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదం తో డిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ధర్మపోరాట దీక్ష చేపట్టనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు పర్యటనలో భాగంగా ఆదివారం ఆయిల్‌ ఉత్పత్తులకు సంబంధించిన రెండు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విశాఖపట్నంలో ఎస్‌-1 వశిష్ట డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, స్ట్రాటజిక్‌ క్రూడ్‌ ఆయిల్‌ స్టోరేజీ ఫెసిలిటీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయగా కృష్ణపట్నంలోని కోస్టల్‌ ఇన్‌స్టలేషన్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ నెల నాలుగో వారంలో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు.
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ఆపరేషన్‌ కమల ఆడియో టేపులో మాటలు తనవేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పరోక్షంగా అంగీకరించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో యడ్యూరప్ప  యత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఆడియో టేపును విడుదల చేసిన విషయం తెలిసిందే.
జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజల డిపాజిట్ల మొత్తం త్వరలో రూ.90వేల కోట్లు దాటనుంది.  ప్రభుత్వం ఈ ఖాతాదారులకు రూ.2లక్షల మేరకు ప్రమాద బీమా కల్పించడం ప్రజలను ఆకర్షిస్తోంది. 
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఆడిట్‌ నిర్వహణ నుంచి వైదొలగాల్సిందిగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) రాజీవ్‌ మహర్షిని కాంగ్రెస్‌ కోరింది. ఆర్థిక కార్యదర్శిగా రఫేల్‌ ఒప్పంద చర్చల్లో మహర్షి పాల్గొన్న కారణంగా వైదొలగాలని సూచించింది.
భూగోళాన్ని ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయని.. ఫలితంగా 2014-2023 మధ్య కాలం గత 169 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా ఆవిర్భవిస్తుందని బ్రిటన్‌ వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రపంచ ఉష్ణోగ్రతల  గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
న్యూజిలాండ్‌లో ఆదివారం రసవత్తరంగా సాగిన చివరిదైన మూడో పురుషుల టీ20లో న్యూజిలాండ్‌ జట్టు 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మహిళల టి20 చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 2 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. 

Click Here.....To Download The Above Information in Pdf
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:11th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట )
  • SCHOOL ASSEMBLY:11th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 11th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 11th February 2019 assembly, 11th February 2019 assembly,news of the day history,news of the day highlights,11th dec 2019 assembly, dec 11th assembly, dec 11th historical events, 11th February 2019 assembly, February 11th assembly, February 11th historical events,school related today assembly,school related today news, school related February 11th information, school related February month information, School Assembly 11th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 11th Feb 2019 assembly, 11th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,11th dec 2019 assembly, dec 11th assembly, dec 11th historical events, 11th Feb 2019 assembly, Feb 11th assembly, Feb 11th historical events,school related today assembly,school related today news, school related Feb 11th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar