Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 12th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 12th February Information


నేటి ప్రాముఖ్యత 
జాతీయ ఉత్పాదనా దినోత్సవం, గులాబీల దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయితచార్లెస్ డార్విన్ 1809 వ సం.లో జన్మించారు.
అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1809 వ సం.లో జన్మించారు.
ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 1824 వ సం.లో జన్మించారు.
భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు 1942 వ సం.లో జన్మించారు.
మొఘల్ చక్రవర్తి జహందర్ షా 1713 వ సం.లో మరణించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త ఎం.ఎల్.నరసింహారావు 2016 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
మొబైల్ ఫోన్ కు సంభందించిన కొన్ని పదాలు - వాటి అర్ధాలు
wifi- Wireless Fidelity
IMEI- International Mobile Equipment Identity
OTG- On The Go
SIM- Subscriber Identity Mobile
SMS- Short Message Service
మంచి మాట /సుభాషితం:
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ
భావం- ఎంత అడిగినా జీతము ఇవ్వని యజమానిని సేవించి కష్టపడుట కంటే మంచి యెద్దులను కట్టి పొలమి దున్నుకొని బతకడం మంచిది.


 వార్తలలోని ముఖ్యాంశాలు
ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో చెప్పిన 18 పెండింగ్‌ అంశాల పరిష్కారం కోసం దిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ధర్మపోరాట దీక్షలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ 'పార్లమెంటు సాక్షిగా ఒక ప్రధాని ఇచ్చిన హామీలను మరో ప్రధాని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని' వాఖ్యానించారు.
తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తోందని, పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగ ప్రగతి కోసం వినూత్న ప్రణాళికలను కొనసాగిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు.
ఉన్నత విద్యనందించే కళాశాలల సాంద్రతలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యాసంస్థల సంఖ్యలో మాత్రం బాగా వెనుకబడింది. కళాశాలల్లో కనీస వసతులు ఉన్నాయనడానికి న్యాక్‌ గుర్తింపును ఒక కొలమానంగా తీసుకుంటారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థని, 2030 నాటికి ప్రపంచంలో రెండో స్థానంలో ఉండనుందని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో ఉల్లంఘనలపై మరో అంశం వెలుగులోకి వచ్చింది. అవినీతి చర్యలకు జరిమానా, చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా నిర్వహణ వంటి కీలక షరతులను ఒప్పందం నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ద హిందూ పత్రిక తాజాగా ఒక కథనం ప్రచురించింది.
పిల్లలు పుష్టిగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందనీ... వారిని శక్తిమంతులుగా, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం తక్షణావసరమని, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అక్షయపాత్ర 300 కోట్లవ భోజనాన్ని వడ్డించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల ఆకర్షణ నడుమ నేడు ప్రారంభంకానుంది. నిరుటి ఫైనల్లో హోరాహోరీ పోరాటంతో ఆకట్టుకున్న సింధు, సైనా మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు.


Click here for download above information in PDF
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:12th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:12th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 12th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 12th February 2019 assembly, 12th February 2019 assembly,news of the day history,news of the day highlights,12th dec 2019 assembly, dec 12th assembly, dec 12th historical events, 12th February 2019 assembly, February 12th assembly, February 12th historical events,school related today assembly,school related today news, school related February 12th information, school related February month information, School Assembly 12th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 12th Feb 2019 assembly, 12th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,12th dec 2019 assembly, dec 12th assembly, dec 12th historical events, 12th Feb 2019 assembly, Feb 12th assembly, Feb 12th historical events,school related today assembly,school related today news, school related Feb 12th information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar