Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 13th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 13th February Information


చరిత్రలో ఈరోజు
1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
భారత కోకిల సరోజినీ నాయుడు 1879 వ సం.లో జన్మించారు.
ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించిన నూతి శంకరరావు 1930 వ సం.లో జన్మించారు.
సామాజిక శాస్త్రవేత్త నూనె శ్రీనివాసరావు 1972 వ సం.లో జన్మించారు.
దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు బాలు మహేంద్ర 2014 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు నవలా రచయిత పి. కేశవ రెడ్డి 2015 వ సం.లో మరణించారు.
కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు ఎస్.మునిసుందరం 2015 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ఉపగ్రహాలను ఆకాశంలో వదిలితే జారి భూమ్మీద పడవా ?
ఆకాశం పైకి పోయే కొద్దీ వస్తువులను కిందకి ఆకర్షించే శక్తి భూమికి తగ్గుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తిని బట్టి భూమి చుట్టూ కక్ష్యలు ఉంటాయి. కక్ష్యలు అంటే తిరిగే మార్గాలు. అంటే కక్ష్యలో ఒక వస్తువును వదిలితే భూమి ఆకర్షణకులోనై భూమ్మీద పడకుండా భూమి చుట్టూ వేగంగా తిరుగుతూ ఆ వస్తువు తప్పించుకుంటూ ఉంటుంది. ఉపగ్రహం ఒక రోజులో ఎక్కువసార్లు భూమి చుట్టూ తిరగాలంటే దగ్గరి కక్ష్యలో తక్కువసార్లు తిరగాలంటే దూరమున్న కక్ష్యలో ప్రవేశపెడతారు. ఏ కక్ష్యలో ఉన్నా... ఉపగ్రహాలు అక్కడే తిరుగుతూ ఉంటాయి. భూమ్మీదకు జారిపడే ప్రసక్తే లేదు.
మంచి మాట /సుభాషితం:
నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు - స్వామి వివేకానంద


వార్తలలోని ముఖ్యాంశాలు
పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం అమలుచేసేలా చూడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.
ఏపీ డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15న ప్రకటిస్తామని అలాగే మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని,  ఏప్రిల్‌ 27న ఫలితాలు విడుదల చేస్తామని ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 12న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో విజయ సాధన కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 60 సభల్లో ఆయన పాల్గొనాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదలాయించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రిట్‌ అప్పీళ్లు, కోర్టు ధిక్కరణ, పునఃసమీక్ష పిటిషన్లు అన్నింటినీ వాటి పరిధిలోకి తీసుకురావాలని పేర్కొంది.
ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన/ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌(జీఎఫ్‌పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసి నివేదికను వెలువరించింది. దీని ప్రకారం మొదటి మూడు స్థానాలలో అమెరికా, రష్యా , చైనా నిలిచాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది.
దిల్లీలోని కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని నాలుగంతస్తుల హోటల్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు హెచ్‌పీసీఎల్‌ అధికారులు సహా మొత్తం 17 మంది మృతిచెందారు. ఈ హోటల్‌ పలు నిబంధనలను అతిక్రమించి నడుపుచునట్లు భావిస్తున్నారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎం.నాగేశ్వరరావు మరియు న్యాయ సలహాదారు ఎస్‌.భాసురామ్‌లు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీం కోర్టు తేల్చింది. వారిద్దరికీ చెరో రూ.లక్ష జరిమానా, మంగళవారం కోర్టు సమయం ముగిసేవరకూ వారు కోర్టు గదిలోనే కూర్చోవాలని ఆదేశించింది.
రఫేల్‌ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనిల్‌ అంబానీకి దళారీలా వ్యవహరించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి రక్షణ ఒప్పందం గురించి ముందే అంబానీకి చెప్పేశారని ఆరోపించారు. ఇది దేశద్రోహమని పేర్కొన్నారు.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:13th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట )
  • SCHOOL ASSEMBLY:13th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 13th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 13th February 2019 assembly, 13th February 2019 assembly,news of the day history,news of the day highlights,13th dec 2019 assembly, dec 13th assembly, dec 13th historical events, 13th February 2019 assembly, February 13th assembly, February 13th historical events,school related today assembly,school related today news, school related February 13th information, school related February month information, School Assembly 13th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 13th Feb 2019 assembly, 13th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,13th dec 2019 assembly, dec 13th assembly, dec 13th historical events, 13th Feb 2019 assembly, Feb 13th assembly, Feb 13th historical events,school related today assembly,school related today news, school related Feb 13th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar