Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 22nd February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 22nd February Information


నేటి ప్రాముఖ్యత
ప్రపంచ స్కౌట్ దినోత్సవం,
కవలల దినోత్సవం
ప్రపంచ ఆలోచన దినం.
చరిత్రలో ఈరోజు
1847: బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు  జార్జి వాషింగ్టన్ 1732 వ సం.లో జన్మించారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త బిరుదాంకితుడు కొండా వెంకటప్పయ్య 1866 వ సం.లో జన్మించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌ రావాడ సత్యనారాయణ 1911 వ సం.లో జన్మించారు.
భారతీయ ప్రముఖ శాస్రవేత్త "సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు పుష్ప మిత్ర భార్గవ 1928 వ సం.లో జన్మించారు.
ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి అలియా సబూర్ 1989 వ సం.లో జన్మించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి  మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1958 వ సం.లో మరణించారు.
బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ 1997 వ సం.లో మరణించారు.
కస్తూర్భా గాంధీ 1944  వ సం.లో మరణించారు.
నేటి అంశము:
భారత రాజ్యాంగ సవరణ విధానం
రాజ్యాంగాన్ని సవరించే హక్కు కేంద్ర పార్లమెంటుకు మాత్రమే ఉన్నది. రాష్ట్ర శాసన సభలకు లేదు. 368 నిబంధన రాజ్యాంగ సవరణకు రెండు పద్ధతులను వివరిస్తుంది.
1. మొదటి పద్దతి ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెట్టబడిన సభ మొత్తము హాజరైన సభ్యులలో 2/3 వంతు మంది దానిని ఆమోదించాలి. ఆ తరువాత ఆ సవరణ బిల్లు రెండవ సభకు పంపబడుతుంది. అక్కడ కూడా హాజరైన సభ్యులలో 2/3 వంతు మంది ఆమోదించాలి. ఈ విధంగా రెండు సభల ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టమై రాజ్యాం గంలో భాగమవుతుంది.
2. రెండవ పద్ధతి ప్రకారం మొదటి పద్దతిలో పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభలకు పంపాలి. రాష్ట్ర శాసన సభలలో కనీసం సగం శాసన సభ్యులు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగ సవరణ బిల్లు చట్టమై రాజ్యాంగంలో భాగమవుతుంది.
మంచి మాట /సుభాషితం:
అజ్ఞానం అహంకారానికి దారి తీస్తుంది, అహంకారం మనల్ని మరింత అధోగతి పాలు చేస్తుంది- స్వామి వివేకానంద


వార్తలలోని ముఖ్యాంశాలు
ఈనెల 23, 24 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ కొత్త ఓటర్ల నమోదు, సవరణ, పరిశీలన కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు తిరుపతిలో నిర్వహించనున్న 'ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర' బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా  హోదాపై తమ పార్టీ వైఖరిని వెల్లడించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్‌లో కూడా సాగునీటి రంగానికే తొలిప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన గిడ్డంగిలో చెలరేగిన మంటల కారణంగా 70 మంది దుర్మరణం చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
రెపో రేటును తగ్గించిన సందర్భంలో బ్యాంకులు కూడా రుణ రేట్లను తగ్గించి.. వినియోగదార్లకు ప్రయోజనం కలిగించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బ్యాంకులకు సూచించారు.
పుల్వామాలో జరిగిన దాడితో పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్‌ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సీ) పేర్కొంది. భారత్‌ ఎలాంటి దాడికి పాల్పడినా దీటుగా స్పందించాలని పాకిస్థాన్‌ సైన్యాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశించారు.
సింధూ నది జలాల విషయంలో మన దేశ వాటా నీటిని పాకిస్థాన్‌కు వెళ్లనీయకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నీళ్లను మేము తూర్పు నదుల్లోంచి మళ్లించి, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లోని ప్రజలను అందిస్తాం.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ షూటర్లకు ప్రభుత్వం వీసాలు నిరాకరించడంతో భారత్‌ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌ షూటింగ్‌లో ఒలింపిక్స్‌ కోటాను రద్దు చేసింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:22nd February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:22nd February(వార్తలలోని ముఖ్యాంశాలు)


  • School Assembly 22nd February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 22nd February 2019 assembly, 22nd February 2019 assembly,news of the day history,news of the day highlights,22nd dec 2019 assembly, dec 22nd assembly, dec 22nd historical events, 22nd February 2019 assembly, February 22nd assembly, February 22nd historical events,school related today assembly,school related today news, school related February 22nd information, school related February month information, School Assembly 22nd Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 22nd Feb 2019 assembly, 22nd Feb 2019 assembly,news of the day history,news of the day highlights,22nd dec 2019 assembly, dec 22nd assembly, dec 22nd historical events, 22nd Feb 2019 assembly, Feb 22nd assembly, Feb 22nd historical events,school related today assembly,school related today news, school related Feb 22nd information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar