Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 27th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 27th February Information


చరిత్రలో ఈరోజు
1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు 1932 వ సం.లో జన్మించారు.
భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి మొదటి బహదూర్ షా 1712 లో మరణించారు.
భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, చంద్రశేఖర్ ఆజాద్ 1931 లో మరణించారు.
లోక్‌సభ మొదటి అధ్యక్షుడు, జి.వి.మావలాంకర్ 1956 లో మరణించారు.
ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, "రవీంద్ర భాస్కరం" రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆకురాతి చలమయ్య 1985 లో మరణించారు.
నేటి అంశము:
విద్యుత్ బల్పు నుండి కాంతి ఎలా వస్తుంది?
          ఎలక్ట్రిక్ స్తంభాలకు కట్టిన తీగల గుండా విద్యుద్ ప్రవహించినపుడు కాంతి, ఉష్ణం వెలువడుతాయన్న సిద్ధాంతం ఆధారంగా ఎలక్ట్రిక్ బల్బు తయారైంది. నిజానికి ఈ లైట్ విద్యుత్తును ఉష్ణంగాను, కాంతిగాను మారుస్తుంది. బల్బులో చుట్టగా చుట్టిన టంగ్స్టన్ ఫిలమెంట్ గాజు దీపంలో సీలు వేయడి, ఫిలమెంట్ రెండు కొనలను దళసరి వైరుకు జత చేయబడి  ఆ రెండు వైరులు గాజుగొట్టం ద్వారా వెలుపలికి వస్తాయి. ఆ తరువాత గాజు బుడ్డిలోని గాలిని వెలుపలకి తీసి, దానిలో నైట్రోజన్, ఆర్గాన్ వాయువులను నింపుతారు. ఈ వాయువులను నింపడం వల్ల ఫిలమెంట్ ఉష్ణోగ్రత వలన కరిగిపోకుండా ఉంటుంది. విద్యుచ్ఛక్తి ఫిలమెంట్ ద్వారా ప్రవహించినప్పుడు ఇది ముందుగా ఎర్రగా అయి, వేడెక్కి తెల్లబడుతుంది. ఈ ఫిలమెంట్ వల్లనే కాంతి వెలువడుతుంది.
మంచి మాట /సుభాషితం:
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడవఁ బోకుమయ్య కుమారా !
భావం- గురువు మాటకు ఎదురు చెప్పకు. చేరదీసిన వారిని నిందించకు. చేసే పనిపై ఎక్కువ ఆలోచింపకు. మంచి మార్గం వదలి పెట్టకు.


వార్తలలోని ముఖ్యాంశాలు
పుల్వామా దాడికి భారత్‌ మంగళ వారం గట్టిగా బదులు తీర్చుకుంది. పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్‌ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది.
దేశం సురక్షిత హస్తాల్లో ఉందనీ, భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకునే పరిస్థితి రానివ్వనని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి భరోసా ఇచ్చారు. దేశం కంటే మరేదీ గొప్ప కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో 10.17 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నారు.
గాంధీ శాంతి బహుమతులను కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర (2015), అక్షయపాత్ర ఫౌండేషన్‌, సులభ్‌ ఇంటర్నేషనల్‌ (2016), ఏకల్‌ అభియాన్‌ ట్రస్ట్‌ (2017), యోహి శసకవా (2018)లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు.
అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలని మంగళవారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వివాదంలో మధ్యవర్తిత్వానికి ఒక్క శాతం అవకాశం ఉన్నా దాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ఇస్కాన్‌ ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు.  800 కేజీల బరువు, 670 పేజీలతో ఉన్న ఈ భగవద్గీత భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో రూ.3.83 లక్షల కోట్లు సంపదతో పదో స్థానంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు.   
ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, పోటీ పరీక్షల శిక్షకుడు.. ద్వానా శాస్త్రిగా సుప్రసిద్ధులైన ద్వాదశి నాగేశ్వరశాస్త్రి (71) దివంగతులయ్యారు.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:27th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:27th February(వార్తలలోని ముఖ్యాంశాలు)


  • School Assembly 27th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 27th February 2019 assembly, 27th February 2019 assembly,news of the day history,news of the day highlights,27th dec 2019 assembly, dec 27th assembly, dec 27th historical events, 27th February 2019 assembly, February 27th assembly, February 27th historical events,school related today assembly,school related today news, school related February 27th information, school related February month information, School Assembly 27th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 27th Feb 2019 assembly, 27th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,27th dec 2019 assembly, dec 27th assembly, dec 27th historical events, 27th Feb 2019 assembly, Feb 27th assembly, Feb 27th historical events,school related today assembly,school related today news, school related Feb 27th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar