Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 2nd February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 2nd February Information

నేటి ప్రాముఖ్యత 
వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1970: ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ 1902 వ సం.లో జన్మించారు.
ప్రముఖ రచయిత కుష్వంత్ సింఘ్ 1915 వ సం.లో జన్మించారు.
మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం గల తిమ్మావజ్జల కోదండ రామయ్య 1925 వ సం.లో జన్మించారు.
వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు వెలమాటి రాందాస్ 1923 వ సం.లో జన్మించారు.
జాతీయ విద్యకై విశేష కృషి చేసిన వారు కోపల్లె హనుమంతరావు 1922 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సర్వ రోగనివారిని - పసుపు
ఐదు వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేద, గృహవైద్యాల్లో వాడుకలో ఉన్న పసుపు గురించీ అందులోని కుర్క్యుమిన్ అనే రసాయనం గురించీ కొత్త సంగతులెన్నో చెప్పుకొస్తున్నారు పాశ్చాత్య నిపుణులు. టాక్సిన్లని బయటకు పంపించడం ద్వారా పసుపు కాలేయ పనితీరుని మెరుపరుస్తుందనీ, వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుందనీ, క్యాన్సర్ కణాల పెరుగుదలనూ ఇది అడ్డుకుంటుంది. ముఖ్యంగా క్లోమ, ప్రొస్టేట్, చర్మ క్యాన్సర్లను నివారిస్తుందట. మంటను తగ్గిస్తుంది. హృద్రోగాలనీ నియంత్రిస్తుంది. ఆర్దయిటిస్తో పోరాడుతుంది. జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. ఆహారానికి రంగునీ రుచినీ ఇవ్వడంతోబాటు జీర్ణశక్తికీ తోడ్పడుతుంది. ఇంకా కీళ్ల నొప్పులు, పొట్టనొప్పి, డయేరియా, తేన్పులు, ఆకలి లేకపోవడం, కామెర్లు, బ్రాంకైటిస్, తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు, జలుబు, జ్వరాలూ, .. ఇలా ఒకటేమిటి, సకల వ్యాధులకూ కుర్క్యుమిన్ మందులా పనిచేస్తుందని అధ్యయనాలూ పరిశీలనలూ వెల్లువెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పసుపు వాడకం పెరిగింది. దాంతో క్యాప్సూల్స్ రూపంలోనే కాకుండా ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు.
మంచి మాట /సుభాషితం:
అందమైనది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, మంచిగా ఉన్న వారు ఎప్పుడూ అందాన్ని పొందుతారు.- గౌతమ బుద్ధుడు
వార్తలలోని ముఖ్యాంశాలు
సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో ఏన్డీయే ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అరుణ్‌జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లిన తరుణంలో ఆర్థిక మంత్రి హోదాలో గోయల్‌ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
తాజా బడ్జెట్‌లో 5ఎకరాల లోపు ఉన్న సన్నకారు రైతులకు ఏడాది రూ.6వేలు ఆర్థికసాయం, వార్షికాదాయం రూ.5లక్షలు కలిగిన వారికి ఆదాయపుపన్ను నుంచి మినహాయింపు, అసంఘటితరంగంలో పని చేసి 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌వంటి ప్రజాకర్షక పధకాలు  ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు యథావిధిగా మొండిచేయి చూపింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న ప్రాజెక్టులేమీ మంజూరు చేయలేదు. కొన్ని సంస్థలకు మొక్కుబడిగా కేటాయింపులు జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 17 సార్లు ప్రధానమంత్రి,  కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వంపై  సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయమేంటో చెప్పాలంటూ భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎకరానికి రూ.8వేలు ఉన్న రైతు పెట్టుబడి సాయాన్ని వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి తెరాస సర్కారు రూ.10వేలకు పెంచనున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న సన్నకారు రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మొత్తం కలిపి ఏడాదికి రూ.16వేలు పెట్టుబడి సాయం కింద లబ్ధి చేకూరనుంది.
డేవిస్‌ కప్‌ గ్రూప్‌ ఫైనల్స్‌ క్వాలిఫయర్స్‌లో తొలి రోజు రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.
భారత మహిళా క్రికెట్ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో ఆడిన మూడో వన్డేతో ఆమె ఈ మైలురాయిని అందుకుంది. 

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:2nd February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట )
  • SCHOOL ASSEMBLY:2nd February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 2nd February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd February 2019 assembly, 2nd February 2019 assembly,news of the day history,news of the day highlights,2nd dec 2019 assembly, dec 2nd assembly, dec 2nd historical events, 2nd February 2019 assembly, February 2nd assembly, February 2nd historical events,school related today assembly,school related today news, school related February 2nd information, school related February month information, School Assembly 2nd Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd Feb 2019 assembly, 2nd Feb 2019 assembly,news of the day history,news of the day highlights,2nd dec 2019 assembly, dec 2nd assembly, dec 2nd historical events, 2nd Feb 2019 assembly, Feb 2nd assembly, Feb 2nd historical events,school related today assembly,school related today news, school related Feb 2nd information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar