Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 7th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 7th March Information
చరిత్రలో ఈరోజు
2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు 1921 వ సం.లో జన్మించారు.
అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్టిమోర్ 1938 వ సం.లో జన్మించారు.
వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ 1952 వ సం.లో జన్మించారు.
1955: అనుపమ్ ఖేర్ హిందీ సినీ నటుడు జననం.
భారతదేశంలో ప్రముఖ గురువు పరమహంస యోగానంద 1952 వ సం.లో మరణించారు.
భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్యదర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు అప్పడవేదుల లక్ష్మీనారాయణ 1973 వ సం.లో మరణించారు.
గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు అయ్యంకి వెంకటరమణయ్య 1979 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
తేలు ఏడాదికొకసారి తిన్నా బ్రతుకుతుందా?
తేలు గురించి ఓ విచిత్రమైన నిజం ఉంది. అవసరమైతే ఇవి ఏడాదికి ఒక్క పురుగు దొరికినా చాలు దాన్ని తిని బతికేస్తాయి. ఇవి సుమారు 2000 జాతులు దాకా ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా జీవిస్తాయి. ఒక్కోసారి తిండి దొరక్కపోతే జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. అప్పుడు దీనికి ఏడాదికి ఓసారి భోంచేస్తే చాలన్న మాట.  నేలలో బొరియలు చేసుకుని రాళ్ళక్రింది కూడా జీవిస్తాయి.
మంచి మాట:
ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు సముద్రం కంటే గొప్పది- మదర్‌ థెరెసా
నేటి జి.కే.
ప్రశ్న: హిమోగ్లోబిన్ వుండే రక్త భాగ‌ము ఏది?
జ: ఎరిత్రోసైట్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
> ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.
> ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కొత్తపట్నం సముద్ర తీరంలో నేటి నుంచి రెండు రోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌-2020  నిర్వహించనున్నారు.
>తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 20 వరకు జరగనున్నాయి.
> తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్‌ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.
> కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా నియమితులైన బిమల్‌ జుల్కా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
> కరోనా వైరస్(కొవిడ్‌-19) మనిషి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి సహాయపడుతున్న ప్రోటీన్‌ను గుర్తించినట్లు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
> మార్స్ గ్ర‌హం మీద‌కు నాసా కొత్త‌ గా రోవ‌ర్‌ను పంప‌నున్న‌ది.  దానికి ప‌ర్సీవ‌రెన్స్ అన్న పేరును పెట్టారు.
> కొవిడ్‌- 19 (కరోనా వైరస్‌)తో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడనుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అభిప్రాయపడింది.
> దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 15 నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ కరోనా కారణంగా మే నెలకు వాయిదా పడింది.
> యెస్‌ బ్యాంకుకు చెందిన ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు.

> భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు 2019 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్లేయర్ అవార్డు ను సొంతం చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో భాగంగా సింధును ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా ఎంపిక చేశారు.
School Assembly 7th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2020 school assembly,March 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు,
Previous
Next Post »
0 Komentar

Google Tags