Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New reforms in Andhrapradesh government schools


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త సంస్కరణలు
➤రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఇక మంచి రోజులు రానున్నాయి.
➤రాష్ట్రంలో పాఠశాలల సమూల ప్రక్షాళనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
➤విద్య వ్యవస్థ చక్కగా నడిచినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, దీనికి ఇక అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేసారు.
➤రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 లక్షల మందికి పైగా విద్యార్థులున్నారనివీరంతా పాఠశాలలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
➤మొత్తం 44 వేల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి గా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
➤పాఠశాలల్లో మరుగుదొడ్లు, శుభ్రమైన తాగునీరు, విద్యార్థులు కూర్చోవడానికి ఫర్నీచర్, తరగతి గదుల్లో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు, క్రీడా మైదానాలు, ప్రహరీ గోడలతో పాటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సి.ఎం ఆదేశించారు.
➤పాఠశాల భవనాలకు రంగులు వేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ఫొటోలు తీయించి, ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. తాను చెప్పిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి, తదుపరి సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులను కోరారు.
➤సకాలంలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు విద్యార్థులకు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
➤పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక వైఎస్సార్‌ అక్షయ పాత్రగా పిలుస్తామని ప్రకటించారు.
➤మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు నెలకు ఇచ్చే రూ. 1000 గౌరవ వేతనాన్ని  రూ.3000 కు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అక్షయపాత్ర సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులకు వడ్డించేందుకు వారి సేవలను వినియోగించుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు.
➤విద్యార్థులకు నాణ్యమైన తాజా ఆహారం అందించాలని, సకాలంలో పాఠశాలలకు చేరేలా వంటశాలల ఏర్పాటు చేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు.
➤మధ్యాహ్న భోజనం తయారీకి ఆధునిక వంటశాలలు ఉండాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తయారు చేయాలని పేర్కొన్నారు.
➤విద్యార్ధులపై ఒత్తిడి లేని విధంగా వారంలో ఒక రోజు స్కూల్ కు బ్యాగు లేకుండానే వచ్చి, విద్యార్థులు రోజంతా ఆడుతూ, పాడుతూ చదువు సాగేలా సరికొత్తగా విద్యా క్యాలెండర్ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
➤భూటాన్ తరహాలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ప్రతి రోజు ఉదయం అరగంటపాటు ఒక మంచి విషయంపై పిల్లలతో మాటాడిస్తారు. విద్యార్ధులలో మానసిక స్థైర్యాన్ని నింపి చదవుపట్ల ఆసక్తిని రేకెత్తిస్తారు.
➤దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన అనంతరం గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.

New reforms in Andhrapradesh government schools, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త సంస్కరణలు
Previous
Next Post »
0 Komentar

Google Tags