Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

S2 Form / Correction in Subscriber Master details / Reissue of I-Pin, T-Pin, PRAN Card

S2 FORM పై పూర్తి వివరణ

S2 ఫారం ను మనం ఎందుకు దరఖాస్తు చేసుకుంటామంటే గతములో మనం PRAN అప్లికేషన్ పూర్తి చేసినపుడు ఇచ్చిన సమాచారం లో ఏమన్నా మార్పులు చేసుకోవాలి అంటే S2 ఫారం ను దరఖాస్తు చేసుకోవడం తప్పని సరి.
ఇందులో SECTION A, B,C,D లు ఉంటాయి.
SECTION:A
ఇందులో మన పేరు, తండ్రి పేరు, పాన్ నెంబర్, PRESENT ADDRESS, PERMANENT ADDRESS, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ID, BANK DETAILS, VALUE ADDED SERVICE మొదలగు సమాచారంతో కూడిన COLOUMNS ఉంటాయి.
వివరణ:
1.మన PRAN కార్డ్ నందు మన SURNAME కానీ మన పేరు కానీ ,  తండ్రి పేరు కానీ తప్పుగా ముద్రితమై ఉంటే S2 ఫారం దరఖాస్తు చేసుకొని మార్పు చేసుకునవచ్చు.
2.గతం లో PRAN అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న సమయంలో లో మనకి పాన్ నెంబర్ లేకుండా కొత్తగా పాన్ నెంబర్ పొందినట్లైతే S2 ఫారం ద్వారా మన పాన్ నెంబర్ ను PRAN అకౌంట్ కు లింక్ చేసుకోవచ్చు.
3. గతములో ఇచ్చిన అడ్రస్ లను ఇపుడు మార్చుకోవాలి అన్న S2 ద్వారా మార్పు చేసుకోవచ్చు.
4.గతము లో MOBILE నెంబర్ ఇవ్వకున్న, ఇచ్చిన మొబైల్ నెంబర్ మారి యున్న కొత్తగా మొబైల్ నెంబర్ ను S2 ఫారం ద్వారా మార్పు చేసుకోవచ్చు.
5.గతము లో ఇమెయిల్ ID ఇవ్వకున్న ఇపుడు కొత్తగా ఇమెయిల్ ID ని నమోదు చేసుకోవాలి అన్న S2 ఫారం తప్పని సరి.
6.కొత్తగా మొబైల్ నెంబర్,ఇమెయిల్ ID లను నమోదు చేసుకుని VALUE ADDED SERVICES COLOUMN వద్ద YES అని టిక్ మార్కు ని నమోదు చేస్తేనే మన మొబైల్కి,మెయిల్ కి Message వస్తాయి.
7.గతములో ఇచ్చిన BANK నెంబర్ గనుక మారినట్లైన, గతములో ఇచ్చిన BANK నెంబర్ ని కనుక వేరే శాఖ కు మార్చుకున్న కొత్త శాఖ యొక్క MICR ని కూడా S2 ఫారం ద్వారా మార్చుకోవచ్చును.
SECTION: B
గతములో ఇచ్చిన NOMINEE లను మార్చుకోవాలి అన్న, గతములో పెళ్లి కాకుండా ఇపుడు వివాహం అయి వారి SPOUSE లను NOMINEE లగ మార్చాలి అన్న, గతములో పిల్లలు లేకుండా కొత్తగా పిల్లలను నామినీల గ నమోదు చేసుకోవాలి అన్న S2 ఫారం తప్పని సరిగా దరఖాస్తు చేసుకోవాలి.
SECTION: C
మనకి PRAN కిట్ వచ్చినపుడు ఇచ్చిన I-PIN, T-PIN లను కనుక పోగొట్టుకున్న ,తిరిగి వాటిని పొందాలి అన్న S2 ఫారం తప్పని సరి.
SECTION: D
మనకి వచ్చిన PRAN కిట్ లను మనం పొందనపుడు, PRAN కార్డ్ ను పోగొట్టుకున్న తిరిగి వాటిని పొందాలి అంటే S2 ఫారం తప్పనిసరి.
గమనిక: S2 ఫారం ను బ్లాక్ పెన్ తో మాత్రమే పూరించాలి.

APCPSEA వారి సౌజన్యం తో
Previous
Next Post »
0 Komentar

Google Tags