Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Employee Voluntary retirement

Employee Voluntary retirement
వాలంటరీ రిటైర్మెంట్ (స్వచ్చంద పదవీ విరమణ)
* వాలంటరీ రిటైర్మెంట్ కొరకు 20 సం. అర్హత గల సర్వీసు పూర్తి చేసినవారు 3 నెలల ముందుగా తానున్న పోస్టుకు నియామకము చేయు అధికారికి నోటీసు ఇవ్వాలి.
* వాలంటరీ రిటైర్మెంట్ అనుమతికై ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్టు, డ్యూటీ చేయుటకు అర్హత కలిగినట్లు ఇద్దరు వైద్యులచే (Civil Surgeons) సర్టిఫికెట్ సమర్పించాలి.
* అనారోగ్యం, ఉన్నత విద్యాభ్యాసమునకు పెట్టిన జీతనష్టపు సెలవు తప్ప, మరే ఇతర జీతనష్టపు సెలవు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.
* అధికారి ఐచ్చిక రిటైర్మెంట్ కు అనుమతి ఇచ్చిన తర్వాత పదవీ విరమణ చేయాలి.
* గ్రాట్యూటీ మాత్రము 20 సం. వచ్చేదే ఇస్తారు. కుటుంబ పెన్షస్,కమ్యూటేషస్ సౌకర్యాలు ఉంటాయి.
A.P.R.P Rule 1980 Rule 43(5) (G.O.Ms.No.413 F&P Dt:29-11-1977)
* వాలంటరీ రిటైర్మెంట్ పొందువారికి (ఇతర కారణాలపై) కారుణ్య నియామక సౌకర్యం వర్తించదు.
* వాలంటరీ రిటైర్మెంట్ కు ప్రత్యేక వైద్య పరీక్షలు అవసరం లేదు. ( పైన తెలిపిన సర్టిఫికెట్స్ చాలు ).
* 20 సం. సర్వీసు కలిగి యుండి వాలంటరీ రిటైర్మెంట్ చేయు ఉద్యోగి ఇంకను 5 సం. మించి సర్వీసు ఉంటే 5 సం. వెయిటేజి కలుపుతారు. 5 సం. లోపు సర్వీసు ఉంటే అంతకాలం మాత్రమే సర్వీసు వెయిటేజి కలుపుతారు. దాని ఆధరాంగానే పెన్షన్ లెక్కిస్తారు.
Click here for above information in PDF
Previous
Next Post »
0 Komentar