Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SMC / PMC Elections Schedule and details

SMC Elections Schedule and details


In the circumstances reported by the State Project Director, SSA in the reference cited and after careful examination of the matter, Government hereby permit the State Project Director, SSA to conduct elections to form fresh School Management Committees in the State as per schedule below subject to change the name of the School Management Committee as either Parent Monitoring Committee or Parent Committee:
Click here for STMS APP & How to upload details in STMS app


పేరెంట్‌ కమిటీల ఎంపిక ఇలా..
- పేరెంట్‌ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తారు. 
- మూజువాణీ విధానంతో ఎన్నిక నిర్వహిస్తారు. అవసరమైతే రహస్య బ్యాలెట్‌ పద్ధతిని అనుసరిస్తారు.
- తల్లిదండ్రులు, సంరక్షకుల్లో 50 శాతానికి తగ్గకుండా ఎన్నికకు హాజరు కావాల్సి ఉంటుంది. 
- తల్లిదండ్రుల్లో ఒక్కరికే ఓటుహక్కు ఉంటుంది. 
- ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారితోపాటు ఇద్దరు మహిళలై ఉండాలి. 
- ఎన్నికైన సభ్యులు తమ నుంచి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరిలో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారు, మరొకరు మహిళ ఉండాలి. 
- ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 24 మంది సభ్యులుంటారు.
- ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 9 మంది సభ్యులను ఎన్నుకుంటారు.
- సభ్యుల కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది, లేదా ఆ విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లే వరకు ఉంటుంది. 
- స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఒక టీచర్, సంబంధిత వార్డు మెంబర్, కౌన్సిలర్‌/ కార్పొరేటర్, ఏఎన్‌ఎం, వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షులు, అంగన్‌వాడీ వర్కర్‌లను నియమిస్తారు.
- కోఆప్టెడ్‌ సభ్యులుగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విద్యావేత్తలను, దాతలను, స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేస్తారు. 
పేరెంట్‌ కమిటీలకు కీలక బాధ్యతలు
ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల సమగ్రాభివృద్ధికి పేరెంట్‌ కమిటీలను బలోపేతం చేయనుంది. కమిటీలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. కమిటీలను ఏర్పాటు చేసి కీలక బాధ్యతలు అప్పగించనుంది.
- విద్యా హక్కు చట్టం ప్రకారం.. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందేలా కమిటీలు చూస్తాయి.
- నిధులను వినియోగించే అధికారం కమిటీలకే ఉంటుంది.
- పాఠశాలల పనితీరును సమీక్షించి సరైన రీతిలో కొనసాగేలా చేస్తాయి.
- స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడంతోపాటు పనులు అనుకున్న విధంగా జరిగేలా చూస్తాయి.
- ప్రభుత్వ నిధులతో కొనసాగే నిర్మాణ పనులు, ఇతర కార్యక్రమాల్లో లోపాలు లేకుండా పర్యవేక్షిస్తాయి.
PMC ఎన్నికలపై సందేహలు మరియు  సమాధానాలు
సందేహం
SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి??
సమాధానం
ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి. వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.
సందేహం
ఒక అబ్బాయి/అమ్మాయి 2వ తరగతిలో ఉన్నాడు.వీరి  మరొక అబ్బాయి/అమ్మాయి 5వ తరగతి లో ఉంది.వీరికి రెండు ఓట్లు ఇవ్వాలా??లేక ఒక ఓటు ఇవ్వాలా??
సమాధానం
వివిధ తరగతులలో చదువుచున్న తమ పిల్లల తల్లి/తండ్రి ఆయా తరగతికి సంబంధించి ఓటింగ్ చేయుటకు అర్హులు.
సందేహం
SMC కి ప్రతి తరగతి నుండి ముగ్గురుని ఎన్నుకోవాలి కదా!.ఆ ముగ్గురు ఎవరై ఉండాలి?
సమాధానం
1.dis-advantage group కి చెందిన వారై ఉండాలి. అంటే sc, st, అనాధలు,వలసలు, వీధి బాలలు, cwsn పిల్లలు, HIV effected పిల్లలు
2.weaker sections చెందిన వారై ఉండాలి. అంటే BC, మైనార్టీలు.
3.కుటుంబ వార్షిక ఆదాయం 60,000/- లోపు గలవారు.
సందేహం
SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి?
సమాధానం
ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి. వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.
సందేహం
SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి?
సమాధానం
వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.
సందేహం
ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి?
సమాధానం
ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య ఆరు లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య ఆరు ఉండునట్లు చూడవలెను.
సందేహం
ఎవరిని SMC చైర్మన్ గా??ఎవరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకోవాలి?
సమాధానం
ఇద్దరిలో ఒకరు కనీసం మహిళ అయి ఉండాలి. మరొకరు ప్రతికూల పరిస్థితిలలో ఉన్న వర్గానికి చెందినవారు లేదా బలహీన వర్గాలకు చెందినవారు అయి ఉండాలి.
సందేహం
SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి?
సమాధానం
వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.
సందేహం
ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి?
సమాధానం

ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య ఆరు లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య ఆరు ఉండునట్లు చూడవలెను.
పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికకు ఉత్తర్వులు విడుదల..
రాష్ట్రంలోని ప్రాధమిక ...ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటుకు  ప్రభుత్వం ఉత్తర్వులు.
ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్య కమిటీలు గా పిలవబడుతున్న పేరు ను పేరెంట్ మోనిటరింగ్ కమిటీ లేదా పేరెంట్ కమిటీ గా వ్యవహరించాలని పేర్కొంది.
దీని ప్రకారం...ఈ నెల 16 వతేదీ సోమవారం ఉదయం పది గంటలకు పాఠశాల స్థాయిలో మోనిటరింగ్  కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల ఎన్నికకు నోటిఫికేషన్  విడుదల చేయాలి.
అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల లిస్ట్ పాఠశాల నోటీస్ బోర్డ్ ద్వారా  ప్రకటించాలి.
19 వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాలు స్వీకరించాలి.
అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల కు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి పాఠశాల నోటీస్ బోర్డ్ లో అంటించాలి.
23 వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల మోనిటరింగ్  కమిటీ ఎన్నిక నిర్వహించాలి.
అదే రోజు మధ్యాహ్నం 1:30 కి పేరెంట్ మోనిటరింగ్  కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాలి.
మధ్యాహ్నం 2 గంటలకి ప్రమాణస్వీకారం చేయాలి.
మధ్యాహ్నం‌3 గంటలనుండి 3:30 గంటల వరకు మొదటి సమావేశం నిర్వహించాలి.
సభ్యుల ఎన్నిక మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లు అనీ ఉపాధ్యాయులకు ఆయా మండల విద్యాశాఖాధికారుల ద్వారా తెలియచేయబడతాయి.
Rc.No.3939 Dated:16.09.2019 of SPD,SSA,AP వారి ఉత్తర్వుల ప్రకారం 
👉 హై స్కూల్ నందు గతంలో మాదిరి 6 నుండి 8 తరగతులకు SMC మరియు 9,10 తరగతుల తో SMDC వేర్వేరు గా ఏర్పాటు చేయరాదు.. SSA,RMSA రెండు కలిపి సమగ్ర శిక్షా అభియాన్ గా మరినందున 6 నుండి 10 తరగతులకు కలిపి ఒకే పీఎంసి కమిటీ 15 మందితో ఏర్పాటు చేయాలి.
👉 తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు,ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు  అప్లోడ్ చేయాలి.
Click here for Minits proforma
Click here all proformas
SMDC's in High Schools are merged in SMC Rc.No.3939 Dated 16.09.2019
Click here for detailed MEMO
Click here for Model Invitation
Click here for Notification proforma
Click here for Voter list proforma
Click here for Pledge
Click here for STMS APP & How to upload details in STMS app
Previous
Next Post »
0 Komentar

Google Tags