Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Elimination of negative marks in Departmental tests..!

Elimination of negative marks in Departmental tests..!
శాఖాపరమైన  పరీక్ష (డిపార్టుమెంటల్ టెస్ట్) లలో నెగెటివ్ మార్కులను తొలగింపు- సర్కారుకు ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు
శాఖాపరమైన పరీక్షల్లో (డిపార్టుమెంటల్ టెస్ట్ లలో) నెగెటివ్ మార్కులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది . ప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహించే అబ్జెక్టివ్ పరీక్షల్లో ఉద్యో గుల ఉత్తీర్ణతా శాతం బాగా తక్కువగా నమోదు అవుతోంది . గత మే / జూన్ నెలల్లో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో అత్యధికులు ఉత్తీర్ణులు కాలేదు.  నెగెటివ్ మార్కులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విధానం అమల్లోకి రాకముందు పేపరు - పెన్ను విధానంలో  వందకు 40 - మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లు గుర్తించేవారు . రుణాత్మక మార్కుల విధానాన్ని ప్రవేశ పెట్టిన అనంతరం అర్హత మార్కులను 35గా తగ్గించినప్పటికీ సత్ఫలితాలు రాలేదు . ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి సర్కారుకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి . దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏపీపీఎస్సీ తీసుకెళ్లింది . ప్రభుత్వం ఆమోదిస్తే ) నెగెటివ్ మార్కుల విధానానికి ఫుల్ స్టాఫ్ పడుతుంది .
Previous
Next Post »
0 Komentar