Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Let's celebrate the Diwali festival safely ...

Let's Celebrate the Diwali Festival Safely

దీపావళి బాణసంచాను కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

=====================

దుకాణం నుండి తెచ్చిన బాణాసంచాను ఇంట్లో ఓ కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌ వంటి దాన్లో పెట్టాలి. ఈ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి.

బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.

టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్‌ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు.

మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది.

చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు.

బాణాసంచాను కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది. 

వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.

బాణాసంచాను ఒక సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.

కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.

ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి.

నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి. 

గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి.

గాయాన్ని కడగడానికి ఐస్‌ వాటర్‌ ఉపయోగించడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.

మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సల్ఫర్, గన్‌పౌడర్‌ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.

బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.

డైరెక్ట్‌ గా మంట కంటికి తగిలితే కార్నియా దెబ్బతింటే కంటికి శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది.

=====================

పై జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ ను సురక్షితంగా జరుపుకుందాం.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags