Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam Nerchukundam 11th-19th october programmes details

Vindam Nerchukundam 11th-19th october programmes details


'విందాం - నేర్చుకుందాం' లైవ్ స్ట్రీమింగ్ కొరకు క్రింది link ను క్లిక్ చేయండి.
Click here for Vindam nerchukundam live streaming
"విందాం - నేర్చుకుందాం" తేది : 16.10.2019 నేటి రేడియో పాఠం
పాఠం పేరు : "పెద్ద సంఖ్యలు"..
తరగతి : 5వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

బోధనా లక్ష్యాలుబోధనాభ్యసన సామాగ్రిబోధనాభ్యసన కృత్యాలుగేయం...

"విందాం - నేర్చుకుందాం" తేది : 14.10.2019 నేటి రేడియో పాఠం
విషయము : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : "దారి తెలుసుకుందామా!"
తరగతి : 4వ తరగతి
సమయం : 11-00 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
విద్యార్థులు దిక్కులను గురించి తెలుసుకుంటారు.
విద్యార్థులు మూలలను గురించి తెలుసుంటారు.
పటం తయారీ గురించి తెలుసుకుంటారు.
గ్రామం, మండలం మరియు జిల్లా సరిహద్దులు గురించి అవగాహవ చేసుకుంటారు.
బోధనాభ్యసన సామగ్రి:
సుద్దముక్క, నల్లబల్ల.
కృత్యం -ఆట :
 కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.
కృత్యం-1:
విద్యార్థులను వరుసగా నిలబడమనండి.
టీచర్ మీకు విద్యార్థులకు అందే విధంగా దిక్కులు, మూలలు కు సంబంధించిన పటాన్ని మాత్రమే గీయండి.
విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా టేబుల్ పై సుద్దముక్క ఉంచండి.
రేడియోలో దిక్కులు 4. మూలలు 4, దిక్కులు, 4, మూలలు 4, దిక్కులు 4 , మూలలు 4 అవి వస్తుంది.
రేడియో లో చెప్పిన దిక్కు పేరులోని మొదటి అక్షరాన్ని నల్లబల్లపై గీసిన పటంలో సరైన చోట రాయాలి.
ఉదా: దిక్కులు 4 -మూలలు 4, దిక్కులు 4 -మూలలు 4  నేను చెప్పే దిక్కు ఉత్తర దిక్కు అని రేడియోలో వస్తే విద్యార్థి  "ఉ"   అని నల్లబల్లపై గుర్తించి రాయాలి.
ఆట
ఈ కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్నీ తెలుసుకొని ఉండాలి
ఆట పేరు : గోడకు వెళ్ళండి”.
ఆట ఆడించే విధానం :
టీచర్ మీ తరగతి లోని 4 గోడలను, తూర్పుగోడ, పడమర గోడ, ఉత్తర గోడ, దక్షిణ గోడ అని విద్యార్థులకు పరిచయం చేయాలి.
తదుపరి విద్యార్థులను తరగతి గది మధ్యలో నిలబడమనండి.
రేడియో లో వెళ్ళండి - వెళ్ళండి, వెళ్ళండి - వెళ్ళండి వెళ్ళండి- వెళ్ళండి  "తూర్పు గోడకు వెళ్ళండి" అని వస్తుంది. అపుడు విద్యార్థులు తూర్పు గోడ వద్దకు వెళ్లేలా  చూడండి.
ఇలా రేడియో లో చెప్పిన దిక్కున గోడ వద్దకు ప్రతిసారీ విద్యార్థులు వెళ్లేలా చూడండి. 
ఇలా వెళ్లలేని విద్యార్థులను అవుట్ గా ప్రకటించండి.
ఇలా రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఆటను ఆడించండి.
కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట
పల్లవి :
నవ్య పథానికి దారి చూపుతూ
గమ్య పథం గతిని తెలుపుతూ
మనుషుల పాలిట మార్గ సూచీలు
దిక్కులు మనకు నాలుగు   //నవ్య పథానికి//
చరణం 1:
ఊరిలో వీధి తెలియాలన్నా
ఆఫీస్ అడ్రస్ కావాలన్నా
ఇంటికి మనము చేరాలన్నా
దిక్కుల గురించి తెలియాలి  //నవ్య పథానికి//
చరణం 2:
ఊరికి హద్దులు తెలియాలన్నా
ఇంటికి స్థలం కొనాలన్నా
గ్రామ పటం గీయాలన్నా
దిక్కుల గురించి తెలియాలి  //నవ్య పథానికి//
పాట ప్రసార సమయంలో..
మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటనుచార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.



"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం తేదీ : 11.10.2019
విషయం : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : చెట్లను పెంచుదాం
తరగతి : 5వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యం, ఆట, పాట...
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• భూమి మీద విస్తీర్ణంలో అడవులు 33% ఉండాలనే విషయం తెలుసుకుంటారు.
• అడవుల విస్తీర్ణం తగ్గడం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుంటారు.
• అడవుల వలన కలిగే లాభాల గురించి తెలుసుకుంటారు.
• అందరూ మొక్కలను, చెట్లను పెంచాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు.
• పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కల గురించి తెలుసుకుంటారు.
• మొక్కలు ఎలా నాటాలో తెలుసుకుంటారు.
• పర్యావరణ పరిరక్షణ కొరకు స్వచ్ఛంద సంస్థలు చేసే సహాయం గురించి తెలుసుకుంటారు.
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• గన్నేరు. మల్లె, నిమ్మ, మామిడి, గులాబి, దామంత, జమ, సపోటా అని రాసి ఉన్న చీటీలు, డబ్బా, బంతి, నల్లబల్ల, సుద్దముక్క (చాక్ పీస్), పాఠ్యపుస్తకం. 
✡ *ప్రపార పూర్వ కృత్యాలు:*
 *కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.*
*కృత్యం:*
• తరగతిలోని విద్యార్థులందరిని నల్లబల్లకెదురుగా కూర్చోబెట్టాలి.
• రేడియో టీచర్ ప్రశ్న అడగ్గానే ఒక విద్యార్థి నిలబడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
• విద్యార్థి సమాధానం చెప్పిన తర్వాత రాజు, లతలు కూడా రేడియోలో సమాధానం చెపుతారు.
• సమాధానాలు బాగా చెప్పిన విద్యార్థులను అభినందించాలి,
*ఆట*
✡ *ఈ కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్నీ తెలుసుకొని ఉండాలి*
• తరగతిలోని విద్యార్థులందరినీ నల్లబల్లకెదురుగా వలయాకారంలో కూర్చోబెట్టాలి.
• నల్లబల్లను రెండుగా విభజించి మొదటి సగభాగంలో పూలమొక్కలు అని రెండవ సగభాగంలో పండ్ల మొక్కలు అని రాయాలి.
• గన్నేరు, ముల్లె, నిమ్మ, మామిడి, గులాబి, చామంతి, జామ, సపోటా అని రాసిన చీటీలను డబ్బాలో ఉంచాలి.
• వలయాకారంలో కూర్చున్న విద్యార్థులందరి మధ్యలో చీటీలున్న డబ్బాను ఉంచాలి.
• రేడియోలో మ్యూజిక్ వస్తున్నంత సేపు విద్యార్థులందరు బంతిని ఒకరినుండి మరొకరికి విసురుతూ ఉండాలి.
• రేడియోలో మ్యూజిక్ ఆగిపోగానే బంతి ఏ విద్యార్థి దగ్గర ఉంటే ఆ విద్యార్థి డబ్బాలోని చీటిని తీసి చదవి అది ఏరకం మొక్కైతే నల్లబల్లపై దానికింద రాయాలి.
• డబ్పాలోని చీటీలన్ని తీసి చదివి నల్లబల్ల పై రాసే వరకు ఈ ఆట ఆడాలి.
• నల్లబల్లపై సరిగా రాసిన విద్యార్థులను అభినందించాలి.
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼  *పాట*
🎤 *పల్లవి :* 
 ప్రగతికి బాటలు వేయాలంటే
పచ్చని చెట్లను పెంచాలి
వానలు బాగా కురవాలంటే
వన సంరక్షణ చేయాలి  // ప్రగతికి//
🎻 *చరణం 1:*
కమ్మని పండ్లు పొందాలంటే
పండ్ల తోటను పెంచాలి
చక్కని పూలు కావాలంటే
పూల వనాలు పెంచాలి   // ప్రగతికి//
🎻 *చరణం 2:*
మానవ మనుగడ సాగాలంటే
పర్యావరణం రక్షించాల
ప్రకృతిని రక్షించాలంటే
అందరూ చెట్లను పెంచాలి   //ప్రగతికి//
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags