Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th class Biology PREPARATION PLAN & IMPORTANT QUESTIONS


10th class Biology PREPARATION PLAN & IMPORTANT QUESTIONS 
By: T. Satyanarayana
10వ తరగతి జీవశాస్త్రం - ప్రిపరేషన్ ఎలావుండాలి?
బట్టీవిధానానికి స్వస్తిపలికి, వివిధ సామర్థ్యాలను విధ్యార్థులలో కల్పించాలనే ఉద్దేశ్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం సి.సి.ఇ విధానంను ప్రవేశపెట్టటం జరిగిందని మనందరికీ తెలిసిందే. ఈ విధానంలో 10వ తరగతి జీవశాస్త్ర పరీక్ష పేపరును ఒకసారి లోతుగా పరిశీలిద్దాం.
చాఫ్టరువారీ మార్కుల కేటాయింపు: పాఠ్యపుస్తకం లోని 10 చాప్టర్లకు సమాన వెయిటేజీ ఇవ్వటం జరుగుతుంది. అనగా ప్రతి చాప్టరు నుండి అత్యధికంగా 5 మార్కుల వరకు ప్రశ్నలిస్తారు. 9,10 చాప్టర్ల నుండి మూడు లేదా నాలుగు మార్కులు తగ్గించి వాటిని పర్యావరణ విధ్య నుండి అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం 50 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.
సెక్షన్లవారి మార్కుల కేటాయింపు:
సెక్షన్-1లో లక్ష్యాత్మక ప్రశ్నలు 12 (1-12) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు అర మార్కు చొప్పున 6 మార్కులకు ప్రశ్నలిస్తారు. అన్నింటికి సమాధానం వ్రాయాలి.
సెక్షన్-2లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు 8 (13-20) ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒక మార్కు చొప్పున 8 మార్కులకు ప్రశ్నలిస్తారు. అన్నింటికి సమాధానం వ్రాయాలి.
సెక్షన్-3లో స్వల్ప సమాధాన ప్రశ్నలు 8 (21-28) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 16 మార్కులకు ప్రశ్న లిస్తారు. అన్నింటికి సమాధానం వ్రాయాలి.
సెక్షన్-4లో వ్యాసరూప ప్రశ్నలు 5 (29-33) ఉంటాయి. ప్రతిప్రశ్నకు 4 మార్కుల చొప్పున 20 మార్కులకు ప్రశ్నలిస్తారు. వీటికి మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది.
Click here for 10th class Biology PREPARATION PLAN & IMPORTANT QUESTIONS
Previous
Next Post »
0 Komentar

Google Tags