Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FIT India Day wise programmes details

FIT India Day wise programmes details


పాఠశాలల్లో ఫిట్‌నెస్‌ వీక్‌
ఆరు రోజుల కార్యాచరణ
మొదటి రోజు చేయవలసిన కృత్యం
* ఉదయం అసెంబ్లీ-యోగా
* విద్యార్థులు మరియు సిబ్బందికి శారీరక ధారుడ్యం మరియు పోషణపై అవగాహన కల్పించుట.
 రెండవ రోజు చేయవలసిన కృత్యం
* ఉదయం అసెంబ్లీ-చేతులతో వ్యాయామం
* మానసిక ధారుడ్యంపై అవగాహనా కార్యక్రమం (ఉదా : చర్చలు, క్రీడా, మానసిక తత్వవేత్తల ఉపన్యాసాలు)
మూడవ రోజు చేయవలసిన కృత్యం
*ఖేల్ ఇండియా యాప్ ద్వారా విద్యార్ధుల "ఫిట్ నెస్ అసెస్ మెంట్ప్రారంభం.
*“ఫిట్ బాడీ - ఫిట్ మైండ్ - ఫిట్ ఎన్విరాన్ మెంట్అనే అంశాలపై విద్యార్థులందరికీ పోస్టర్ తయారీ పై పోటీ నిర్వహణ.
నాల్గవ రోజు చేయవలసిన కృత్యం
* నృత్యము, ఏరోబిక్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్, రోప్-స్కిప్పింగ్, గార్డెనింగ్ మొదలైన అంశములపై విద్యార్థులందరికీ శిక్షణా కార్యక్రమం.
* "ఫిట్ ఇండియా స్కూల్అనే అంశంపై విద్యార్థులందరికీ వ్యాసరచన / పద్య రచన పోటీల నిర్వహణ.
ఐదవ రోజు చేయవలసిన కృత్యం
*విద్యార్థులందరికీ ఫిట్ నెస్ పై స్పోర్ట్స్ క్విజ్
ఆరవ రోజు చేయవలసిన కృత్యం
సాంప్రదాయ / స్వదేశీ / ప్రాంతీయ ఆటలలో ( ఉదా : కబడ్డీ, ఖోఖో ఆట, బొంగరాల ఆట, దొంగ పోలీస్ ఆట, గొలుసు ఆట, గోటి ఆట, పులి ఆట) విద్యార్థులు, సిబ్బంది మరియు తల్లిదండ్రుల కోసం పోటీల నిర్వహణ, మన దేశ వైవిధ్యంలో ఐక్యతను, మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడం మొదలగు అంశాలపై విద్యార్థులను, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి ఉత్తేజ పూరితమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయుట.
లాగిన్‌అయ్యేదిలా.....
ప్రతి పాఠశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడు అధికారి ఫిట్‌ ఇండియా స్కూల్‌వీక్‌ పోర్టల్‌లో నమోదు కావాలి. యూజర్‌ ఐడి,పాస్‌వర్డ్ ను నమోదు చేసుకోవాలి. ఇందుకోసం వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలి. తరువాత వారోత్సవాల సందర్భంగా చేసిన కార్యక్రమాలు ఫొటోలు, వీడియోలు ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలుతీసుకోవాలి. అన్ని పాఠశాలలకు భారత ప్రభుత్వంచే డిజిటల్‌ సర్టిఫికెట్‌ అందిస్తుంది. ఈ సర్టిఫికెట్‌ను ఫిట్‌ ఇండియా వీక్‌ విజయవంతంగా నిర్వహించినతరువాత ఫిట్‌ఇండియా పోర్టల్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చు.
పాఠశాలలకు రేటింగ్‌.....
భారత క్రీడా సాధికార సంస్థ ప్రతి పాఠశాలకు వారు చేసిన కార్యక్రమాలు,అక్కడ ఉన్న సౌకర్యాలను బట్టీ రేటింగ్‌ ఇస్తారు. ఇందు కోసం త్రీస్టార్‌ఫైవ్‌స్టార్‌ రేటింగ్ ను ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఆయా పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలుక్రీడలు, వ్యాయామ విద్యకు కల్పిస్తున్న సౌకర్యాలుఇందుకోసం కేటాయించే పనిగంటల ఆధారంగా రేటింగ్‌ ఇస్తారు. కార్యక్రమాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. రోజువారీ కార్యక్రమాలు రాష్ట్ర పథక సంచాలకులకు నివేదిక అందజేయాలి.
* FIT INDIA రిజిస్ట్రేషన్ కొరకు క్రింది Registration లింక్ ను క్లిక్ చేయండి.
* తరువాత 6 Activities  వస్తాయి.
* వాటి క్రింద box లో  tick mark చేసి,  organise click చేయండి.
* School Registration చేయండి.
* కేవలం 2 నిముషాలలో రిజిస్ట్రేషన్ అవుతుంది.
Registration సంబంధించి పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన ( చివరిలో) image లను చూడగలరు.

Click here for FIT India Registration
Click here for Registration process
Click here for FIT India programme details
        
Previous
Next Post »

1 comment

Google Tags