Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Vindam Nerchukundam 4th November-8th November programmes details

Vindam Nerchukundam 4th November-8th November programmes details


'విందాం - నేర్చుకుందాం' లైవ్ స్ట్రీమింగ్ కొరకు క్రింది link ను క్లిక్ చేయండి.
Click here for Vindam nerchukundam live streaming
"విందాం నేర్చుకుందాం"
తేది: 05-11-2019 నాటి రేడియో పాఠం
 విషయం  : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : రకరకాల ఇళ్లు
తరగతి :3 వ తరగతి

సమయం : 11 AM
 నిర్వహణ సమయం : 30 ని.లు
"విందాం - నేర్చుకుందాం"
తేది: 05-11-2019 నాటి రేడియో పాఠం
విషయం : గణితం
పాఠం పేరు : "గుణకారం"..
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *గుణకారం* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• గుణకారం భావనను అవగాహన పరచుకొని నిత్యజీవితంలో అవసరమైన సందర్భాలలో వినియోగించగలరు. సమస్యలను సాధించగలరు.
• 2 digit x  1  digit , 3 digit x  1  digit సంఖ్యలకు సంబంధించిన ఒకే రేటులో పెరగడం , ఆవర్తన సంకలనం , నిలువు వరసలు , అడ్డు వరసలు మొదలగు సందర్భాలలో గుణకారం సమస్యలను పద్దతి ప్రకారం సాధించగలరు. 
• గుణకార సమస్యా సాధన సందర్భాలలో తగిన కారణములను తెలుపగలుగుతారు. 
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:* 
1. నల్లబల్ల  2.సుద్దముక్క 3. పాటను రాసి ఉంచిన చార్టు 4. 3 వ తరగతి గణిత పాఠ్యపుస్తకం
★★★★★★★★★★★★★
*కృత్యం -ఆట :*
(అ): తరగతిలో మధ్యలో వీలైనంత పెద్దగా గుండ్రంగా గీత గీయాలి. మ్యూలర్ తో పాటు పిల్లలు తరగతిలో గుండ్రంగా గీసిన గీత వెంబడి పరుగెతూ రేడియో టీచర్ సూచనల ప్రకారం Bell Sound రాగానే ఇద్దరు పిల్లలు చొప్పున వలయం మధ్యలో వచ్చి నిలబడాలి. రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగ కృత్యం నిర్వహించాలి (గుణకార భావన, గుణకార గుర్తు అవగాహనకై )
(ఆ) 3 తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని 6 వ పేజీలోని 'ఇవి చేయండి.' శీర్షికలోని 'సమూహాలను కలపడం ద్వారా గుణకారం' ను అవగాహన పరచే కృత్యం (జట్లలో)
( ఇ) రేడియో టీచర్ సూచనల ప్రకారం 2 digit x 1 digit గుణకార సమస్యలను పిల్లలచే (నల్లబల్ల పై) చర్చింపజేస్తూ సాధింప జేయడం.
★★★★★★★★★★★★★
🎼  *పాట*
*ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.*

🎤 *పల్లవి :*
గణితం అంటే మాకిష్టం
లెక్కలు చేయుట భలే ఇష్టం
అందులోనా గుణకారం
చాలా చాలా ఇష్టం  //గణితం అంటే//

🎻 *చరణం 1:*
ఒకే సంఖ్యను మళ్ళీ మళ్ళీ కూడితే
దానినే అంటామండీ ఆవర్తన సంకలనం
ఆవర్తన సంకలనమే గుణకారానికి మరో రూపం  //గణితం అంటే//

🎻 *చరణం 2:*
సమాన సమూహాలను కలుపుతూ పోవడం
ఇదే ఇదే గుణకారం మొదటి లక్షణం
ఇచ్చిన రాశిని ఒకే రేటులో పెంచడమే మరో లక్షణం
ఇదే ఇదే గుణకారం
గణితానికే ఇది మణిహారం //గణితం అంటే//

🎻 *చరణం 3:*
పెద్ద సంఖ్యల గుణకారం సులువుగా చేయడానికి
స్థాన విలువల ఆధారంగా రాసిమేము గుణిస్తాం
గుణకారం చేసేస్తాం, లబ్దాలను చెప్పేస్తాం
ఇదే ఇదే గుణకారం - గణితానికే ఇది మణిహారం //గణితం అంటే//
*ఇంటి పని:* 3 వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని 75 వ పేజీలోని “ ప్రయత్నించండి"  శీర్షికలోని లెక్కలను ఇంటిపనిగా ఇచ్చి వ్యక్తిగతంగా సాధింప జేయండి. వాటిని మరుసటి రోజు సరిచూడండి.
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
తేది: 04-11-2019 నాటి విందాం నేర్చుకుందాం: నేటి రేడియో పాఠం
4 వ తరగతి ( పరిసరాల విజ్ఞానం) : ప్రభుత్వ సంస్థలు
సమయం : 11 AM
✳ *మండల స్థాయిలో ప్రభుత్వ సంస్థలు* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• మండలం అంటే ఏమిటో తెల్సుకుంటారు.
• మండల స్థాయిలో ఉండే కార్యాలయాలను గురించి తెల్పుకొంటారు.
• మండల స్థాయిలో ఉండే కార్యాలయాల విధులను గురించి తెలుసుకుంటారు.
• మండల స్థాయిలో పనిచేసే అధికారుల గురించి తెలుసుకొంటారు
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:* 
1. నల్లబల్ల  2.సుద్దముక్క 3. పాటను రాసి ఉంచిన చార్టు 4. పాఠ్యపుస్తకం
★★★★★★★★★★★★★
*కృత్యం -ఆట :*
(అ) కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణ పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి
(ఆ) : కార్యక్రమంలో ఆడించే ఆటపై టీచర్ కు అవగాహన కల్గి ఉండాలి.
• రేడియో టీచర్ కొన్ని ప్రశ్నలను అడుగుతుంది. దానికి విద్యార్థులు సమాధానం చెప్పాలి.
• అలాగే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాజు,లతలు కూడా చెప్పుతారు. వాటిని వినేలా చూడాలి 
• టీచర్ ఆట ప్రారంభమయ్యే ముందు విద్యార్థుల పుస్తకాల సంచులను ఒక ప్రక్కకు పెట్టించండి.
• తరగతి గది మధ్యలో విద్యార్థులు తిరిగేలా సుద్దముక్క తో పెద్ద వృత్తం గీయండి
• విద్యార్థులను ఆ వృత్తం పై నిలబెట్టండి..
• టీచర్ రేడియోలో రేడియో టీచర్ చెప్పే సూచనలు పాటిస్తూ ఆటను ఆడించాలి.

★★★★★★★★★★★★★
🎼  *పాట*
*ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎤 *పల్లవి :*
మండల స్థాయిలో మన అందరి
సేవల కొరకు నెలవైన
కార్యాలయాలకు వెళ్ళండి
ప్రభుత్వ సేవలు పొందండి   //మండలస్థాయి//
🎻 *చరణం 1:*
విద్య, వైద్యం కావాలన్నా
ఎం.పి.డి.ఒ ను కలవండి
ధృవ పత్రాలను పొందాలన్నా
తహసీల్దార్ ను కలవండి    //మండలస్థాయి//
🎻 *చరణం 2:*
విద్యా వసతులు కావాలన్నా
ఎం.ఇ.ఓ. ను కలవండి
శాంతి భద్రతలు కాపాడాలన్నా
పోలీస్ స్టేషన్‌కు వెళ్ళండి   //మండలస్థాయి//
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
Previous
Next Post »
0 Komentar