Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AMMAVA VODI data after 6 steps verification

JAGANANNA AMMAVA VODI 


జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. దీనికి గాను క్రింది  లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసివెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని తెలుసుకోవచ్చు. 

అమ్మ ఒడి.. హాజరు నిబంధన మినహాయింపు
అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. తొలి ఏడాది 75శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలిఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75శాతం హాజరు నిబంధన పాటించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నాడు నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతపై సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు

అయితే ఈ సందర్భంగా 61,344 పిల్లలకు సంబంధించి చిరునామాలు సరిగ్గా లభ్యం కావడంలేదని.. అందుకు కొంత సమయం కావాలని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. త్వరగా వెరిఫికేషన్‌ పూర్తిచేయాలన్నారు. 7,231 అనాథ పిల్లలకు సంబంధించి అమ్మ ఒడి డబ్బును సగం అనాథశ్రమానికి, సగం పిల్లల పేరుమీద డిపాజిట్‌ చేయాలని సూచించారు. 1,81,603 మంది పిల్లలకు సంబంధించిన కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల కరెంటు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారంటూ క్షేత్రస్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. మరోసారి రీ వెరిఫికేషన్‌ చేయించి అర్హులైన వారికి తప్పనిసరిగా అమ్మ ఒడి వర్తింపు చేయాలని స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో తప్పులు కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే ఆ ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వారిని అర్హులుగా గుర్తించాలని సీఎం చెప్పారు. 1,38,965 మంది పిల్లలు ఈ కేటగిరీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.*అమ్మఒడి పథకానికి సంభందించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ మరల అప్డేట్ చేయడం జరిగింది*
*కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి, కావున మరల ప్రతి స్కూల్ వారు ఆన్లైన్ లో Fresh Eligible List చూడగలరు, ఆన్లైన్ లో HM లాగిన్ లో ఎలిజిబుల్  లిస్ట్ ఉంది.
Click on below link to check
https://ammavodihm3.apcfss.in/EligibleAndInEligibleReport12272019.htm
*అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు మరియు schedule.*
* List-2 & 3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను.
* ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి. 
b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.
2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.
5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
 ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land (విస్తీర్ణము), dry land (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి...
SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు.... అమ్మవడి కి అర్హతలేదని ఉత్తర్వులు..Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..
Server-1
https://ammavodihm3.apcfss.in/logout.htm
Server-2: District wise logins
http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html
అమ్మ ఒడి అనర్హుల వివరములు సవరణ దరఖాస్తు
Download
అమ్మ ఒడి పధకం వర్తింపునకు దరఖాస్తు
Download
అమ్మ ఒడి అనర్హుల అభ్యంతరాల దరఖాస్తు
Download
*మండల విద్యాశాఖ అధికారులు అందరికీ తెలియజేయునది ఏమనగా విద్యార్థుల వివరాలు మార్పు చేసుకొనుటకు విద్యార్థులు చదువుతున్న మండలం లోను మరియు వాళ్ళ రెసిడెన్స్ మండలంలోనూ మార్పు చేసుకొనుటకు సదుపాయం కల్పించడం జరిగింది.
*మార్పు కావలసినవారు వాళ్లు వినతిపత్రం సమర్పించ వలెను. మండల విద్యాశాఖ అధికారులు చూసి సదరు మార్పులకు సంబంధించిన డాక్యుమెంట్ తల్లిదండ్రుల వద్ద తీసుకుని దానిపైన సంతకం చేసి లాగిన్ నందు అప్లోడ్ చేయవలెను.
*ముందుగా పిల్లల యొక్క చైల్డ్ ఐడి ద్వారా సెర్చ్ చేసి  వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ చూసి ఎడిట్ చేసుకుని వాళ్ల సమర్పించిన వినతి పత్రం అప్లోడ్ చేయవలెను మరియు సంబంధిత డాక్యుమెంట్ ని సంతకాలు చేసి కూడా అప్లోడ్ చేయవలెను.
*ముఖ్య గమనిక ఏవైతే మార్పు సంబంధిత డాక్యుమెంట్స్ లేకుండా అప్లోడ్ చేస్తారో అది పరిగణలోకి తీసుకోవడం జరగదు.
*గమనిక:- ఎడిట్ ఆప్షన్ ఒక విద్యార్థి కి ఒకసారి మాత్రమే
*అమ్మఒడి పధకమునకు సంబందించి HM Login లోసరిచేయడానికి అవకాశం ఉంటుంది.
1. Eligible in First List,
2. List of Candidates who require further verification on given remarks
3. Requires confirmation of given data
అనే 3 అంశాల వారీగా రిపోర్ట్ వచ్చును. సదరు రిపోర్టుల యందు చూపించబడిన సంఖ్య పై క్లిక్ చేసినట్లయితే విద్యార్ధుల వివరములు చూపించ బడును. ఈ విధంగా మీ పాఠశాల యందు విద్యార్ధుల రిపోర్టు సరిచూసుకొన గలరు.
*ప్రధానోపాధ్యాయులు అందరూ సదరు రిపోర్టుల యందు ఏవైనా సవరణలు ఉన్న ఎడల విద్యార్ధుల యొక్క తల్లిదండ్రులను గ్రామ లేదా  వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ల వద్దకు మాత్రమే పంపించి ఈ క్రింది విధంగా వెరిఫికేషన్ చేయించుకొన వలసినదిగా తెలియజేయగలరు.
1.విద్యార్ధి తల్లి యొక్క రేషన్, ఆధార్, ఖాతా మరియు IFSC కోడ్ లకు సంబందించి సవరణలు ఉన్న ఎడల సవరణల దరఖాస్తు ఫారం తల్లిదండ్రుల వద్ద నుండి తీసుకొనవలెను.
2.ఆదాయపు పన్ను కట్టిన వారు అని వచ్చిన ఎడల తల్లిదండ్రుల వద్ద నుండి ధృవీకరణ పత్రం తీసుకోవలెను.
3. పొలం ఉన్నది అని వచ్చిన ఎడల సంబందిత వి.ఆర్.ఓ., దగ్గర నుండి పొలం లేదని ధృవీకరణ పత్రం తీసుకోవలెను.
4. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా అదనంగా ఉన్నది అని వచ్చిన ఎడల సదరు కరెంట్ ఆఫీసు నుండి గత  3 నెలల స్టేట్ మెంట్ లేదా 3 నెలల కరెంటు బిల్లుల నకలు కాపీలు తీసుకొనవలెను.
5. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ అని ఉన్న ఎడల వారు సంబందిత ఉద్యోగి లేదా పెన్షనర్ కాకపోయినట్లు అయితే ఎడ్యుకేషన్ / డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్ లు ధృవీకరణ పత్రం తల్లిదండ్రుల వద్ద నుండి తీసుకొని జతపరచ గలరు.
6.4 చక్రముల వాహనములు ఉన్నాయి అని వచ్చిన ఎడల వాహనము లేదని ధృవీకరణ పత్రం లేదా వాహనము ఉన్న ఎడల టాక్సీ గా నడుపబడు చున్నట్లయితే వాహనము యొక్క సి బుక్ నకలు కాపీ జత చేయవలెను. ఒక వేళ వాహనము అమ్మినట్లయితే బదిలీ అయినట్లుగా నకలు కాపీ జత చేయవలెను.

7. Long Absentee, Migrated, Death అని వచ్చినట్లు అయితే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం తీసుకొన వలెను.
ఎవరైనా తల్లి లేదా గార్డియన్ తమ విద్యార్థి వివరాలు తప్పు గా నమోదయ్యాయి సవరించమని కోరితే వారిచే క్రింది అప్లికేషన్ పూర్తి చేయించి వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు తల్లి లేదా గార్డియన్ సంతకం తో MEO ఆఫీసు లో అందజేయమని చెప్పండి.
Important information:
*All DEOs are requested to direct the MEOs to take print out of 2nd and 3rd lists also and place them for social audit through village secretariats and ward Secretariats.

*With regard to the 1st list of eligible children for identifying unique mothers under Ammavodi program, the lists will be kept for social audit at Gram/ward secretariat level till 1st January and get the approval of gram/ward sabha and submit to District Collectors for approval. They should be ready by 2nd for preparation of bills.*

*With regard to 2nd and 3rd lists where the data is incomplete or requires reverification, the gram/ward Secretariats will receive compliants/claims if any and forward them to MEOs for verification.

*MEOs shall in turn colect the copies of support documents, if any, from the concerned claimants and submit them to DEOs for further orders. Detailed instructions in this regard will be issued separately.

*Chinaveerabhadrudu CSE (FAC)*
మూడు రకాల జాబితాలు
*పథకానికి రేషన్‌ కార్డు అర్హతగా తీసుకుని అర్హుల జాబితా ఒకటి రూపొందించారు
తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌, తల్లి బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ సక్రమంగా ఉంటే వారిని అర్హుల జాబితాలో చేర్చారు.
*రెండోది విత్‌హెల్డ్‌ జాబితా
దీనిలో ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్‌ పేయిర్స్‌ పిల్లలు వస్తారు. వీరికి పథకం సాయం వర్తించదు.
*మూడోది రిక్వెస్ట్‌ ఫర్‌ రీ వెరిఫికేషన్‌ 
దరఖాస్తు చేసే సమయానికి రేషన్‌, ఆధార్‌కార్డులు కనిపించలేదని చెప్పేవారిని మూడో జాబితాలో చేర్చారు.

*అర్హుల జాబితాను శనివారం ప్రదర్శించారు. ఈ జాబితాలో పేర్లు లేకపోయినా, పేర్లు తప్పుగా ముద్రించినా వెంటనే చూసి వాటిపై తిరిగి అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మూడు జాబితాలు నేరుగా ఎంఈఓ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి.
సామాజిక గణన
*ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా అర్హుల జాబితాను రూపొందించింది. దాన్ని ఈనెల 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రతి గ్రామ సచివాలయం వద్ద అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, దానిపై ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం సామాజిక తనిఖీలు చేస్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
*సామాజిక తనిఖీకి ఐదు రోజులు సమయమిచ్చారు. ఈ వ్యవధిలో అర్హుల జాబితాలో ఏమైనా తప్పులు ఉన్నా, అక్రమాలు చోటుచేసుకున్నా సామాజిక ఆడిట్‌ బృందాల దృష్టికి తీసుకురావొచ్ఛు. వాటిని సంబంధిత అధికారులు గ్రామాల్లోనే ధ్రువీకరించుకుని వారు అర్హుల కాదా అని తేల్చి తుది జాబితాను తయారుచేస్తారు.
*జనవరి 4న తుది జాబితా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అర్హులకు జనవరి 9వ తేదీ నుంచి వారి బ్యాంకుఖాతాలకు ప్రభుత్వ సాయం జమచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
*ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సం.లు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మఒడి వర్తిస్తుంది.
*మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.
ఈ క్రింది కారణాలతో అమ్మఒడి వర్తించదు:
1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే...
2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే...
3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా...
4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే...
5. 4చక్రాల వాహనం ఉంటే..
6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే...
7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే..
8. గ్రామంలో నివాసం లేకుంటే...
9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే...
10. మరణించి ఉంటే...
11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే...
పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.
*ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.
Previous
Next Post »

5 comments

 1. Amma vodi Chittoor district Nagari list kavali sir

  ReplyDelete
 2. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 3. i really like this article please keep it up. web design agency

  ReplyDelete
 4. Is Phase - 1final list is exact final list .

  ReplyDelete
 5. It manufactures an acceptable degree of certainty and trusts among shippers and buyers. 먹튀토토사이트

  ReplyDelete