Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School assembly 9th December information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....


School Assembly 9th December Information

నేటి ప్రాముఖ్యత

*అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
[అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 9 న జరుపుకుంటారు. దీనిని 2003 అక్టోబరు 31 న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన "అవినీతి వ్యతిరేక సదస్సు" ద్వారా నిర్ణయించారు]
*ప్రపంచ రోగి భద్రతా దినము
చరిత్రలో ఈ రోజు

*1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
*2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.
*1742: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త జననం
*1913: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత జననం
*1946: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు జననం
*2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు మరణం
వార్తలలోని ముఖ్యాంశాలు

>నేటి నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చారిత్రక చట్టాలు ఆమోదం పొందనున్నాయి. వీటిలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం అలాగే ఆర్టీసీ ఉద్యోగులను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చట్టం చేయనున్నాయి.
>ఢిల్లీలోని అనాజ్ మండి ప్రాంతం లో నాలుగు అంతస్తుల భవనంలో ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది కార్మికులు  చనిపోయారు.
>వైయస్సార్ కాపు నేస్తం కింద ఆరు లక్షల మందికి  వచ్చే మార్చి నుండి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళల ఇక స్వావలంబన కోసం ఏటా 15 వేల  సాయం అందిస్తారు.
>APSRTC పెంచిన బస్సుచార్జీల తో ప్రయాణికులపై ఏటా దాదాపు 700 వందల కోట్లు మేర భారం పడనుంది.  ప్రస్తుతం సంస్థకు ఏటా 1200 కోట్ల మేర నష్టం వస్తుంది. పెంచిన ఛార్జీలు తో కొంత మొత్తం సర్దుబాటు కానుంది
>ఉల్లి ధరలు మరో నెలపాటు ఇలాగే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి పంట వచ్చే వరకు ధరలు తగ్గేలా లేవు.

>కాళేశ్వరంలో భాగం గా నిర్మించే బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టు పరీవాహకానికి తరలించి నీటి లభ్యతను పెంచడం, ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా అధ్యయనం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లను ఆదేశించారు. 
> గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్‌షాక్‌:బాలుడి మృతి: గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్‌ వైర్లు తగిలి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆదివారం చోటుచేసుకుంది.
> ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ లో 1-1 తో నిలిచింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది.
నేటి సుభాషితం
"చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే...పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు."
"You are a Good Human Being When Circumstances Suit your Temper but, you become an Excellent Person When you Can Make your Temper Suit any Circumstance."
మంచి పద్యం
కాలముతో అడుగేయ్ దేవా
వెనుకబడితే  మిగిలిపోతావ్
విస్తరాకులొ  వదలబడినవి
చెత్తకుండే  చేరుతాయ్....!
నేటి జీ.కె
ప్రశ్న: పిల్లి గ‌ర్భావ‌ధి కాలంతో స‌మాన‌మ‌యిన గ‌ర్భావ‌ధి కాలం ఉండే జంతువు ఏది?
జ: కుక్క


School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day,news of the day, golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, december month school assembly day wise, december 2019 school assembly, december 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని ముఖ్యాంశాలు, 9th december 2019 assembly,11th december 2019 assembly, news of the day history, news of the day highlights, 9th dec 2019 assembly, dec 9th assembly, dec 9th historical events, 9th december 2019 assembly, december 10th assembly, december 9th historical events, school related today assembly, school related today news, school related december 9th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags