Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

AP Cabinet approval for cancellation of council

AP Cabinet approval for cancellation of council

శాసన మండలి రద్దుకు ఏ.పి. మంత్రివర్గం ఆమోదం
శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాసేపట్లో  ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు.ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్‌ భేటీలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది.
శాసన, న్యాయపరంగా ఉన్న చిక్కులను  పరిగణలోనికి తీసుకొని, తదుపరి ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది..

Previous
Next Post »
0 Komentar