Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Awareness on Corona virus

Awareness on Corona virus

కరోనా వైరస్ లక్షణాలు బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
ఇటీవల చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతోంది ప్రాణాంతక కరోనా వైరస్. ఈ వైరస్ బారిన పడిన వారికి జలుబు, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేని పరిస్థితి, తల నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీని బారిన పడినవారికి వైరస్ సింప్టమ్స్‌కి మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. కొన్ని సూచనలను పాటించాలని చెబుతూ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది.
డబ్ల్యూహెచ్‌వో సూచనలివే
రోజులో అప్పుడప్పుడూ చేతులను సబ్బు లేదా అల్కహాల్ బేస్డ్ జెల్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డంపెట్టుకోవాలి. ఆ వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.
ఎవరైనా జ్వరం, తీవ్రమైన జలుబు, శ్వాస సమస్యలతో బాధపడుతుంటే వారికి దూరంగా ఉండండి.
మీకు జ్వరం, జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే జాగు చేయకుండా వైద్యుల్ని కలవండి.
ఇప్పటికే కరోనా సోకిన ప్రాంతాల్లో జంతువులను పొరబాటున కూడా తాకవద్దు.
మాంసం, గుడ్లు తినేటప్పుడు బాగా ఉడికించాలి. పాలు కూడా ఎక్కువగా వేడి చేశాకే తాగాలి.

లక్షణాలు
*తీవ్రమైన జ్వరం
*దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
*న్యుమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు
*కిడ్నీలు విఫలం కావడం
మరికొన్ని జాగ్రత్తలు
*మాస్క్‌ లు ధరించడం
*అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం, అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం
*మాంసాహారం మానేయడం లేదా బాగా ఉడికించి తినడం
*గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం
*కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం
*ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం
*ఉతికిన దుస్తులు ధరించడం
*వైరస్‌ సోకిన వారికి దూరంగా ఉండటం
*దగ్గు, తుమ్ములు వచ్చినపుడు రుమాలు ఉపయోగించడం
*వన్యప్రాణులకు దూరంగా ఉండటం
Previous
Next Post »
0 Komentar