Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Cancellation of the AP Administrative Tribunal


AP administrative tribunal
ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు
ఆంధ్రప్రదేశ్ అడ్మిని స్టేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజానివేదనలు, పెన్షన్ల శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ 26 అక్టోబరు 1989న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు సమ్మతి పొందిన తరువాత చేసిన అభ్యర్థన మేరకు నాటి గెజిట్ ను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ గెజిట్ తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar