Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam Nerchukundam IRI 27th-31st January Programme details

Vindam Nerchukundam IRI 27th-31st January Programme details


"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 31-01-2020
పాఠం పేరు : "Learn English is Fun"..
తరగతి : 1st & 2nd Class
సమయం : 11 AM

నిర్వహణ సమయం : 30 ని.లు
...........................................................

"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 30-01-2019
విషయం : తెలుగు
పాఠం పేరు : "ఆణిముత్యాలు"..
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "ఆణిముత్యాలు" (30.01.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, ఆట, కృత్యాలు నిర్వహణ, పాట...
Download.. 30th IRI Programme details
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 29-01-2020
పాఠం పేరు : "TTP.."
సమయం : 11 AM

నిర్వహణ సమయం : 30 ని.లు
---------------------------
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 28-01-2020
విషయం : గణితం
పాఠం పేరు : "ఇది ఎంత పొడవు ఉంది.."
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

నేటి రేడియో పాఠం : "ఇది ఎంత పొడవు ఉంది" (28.01.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, కృత్యాలు, గేయం....
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 27-01-2020
విషయం : తెలుగు
పాఠం పేరు : " పల్లె చిత్రం "..
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "పల్లె చిత్రం" (27.01.2020)... బోధనా లక్ష్యాలు, బోధనా సామాగ్రి, కృత్యం, ఆట, పాట...
💁‍♂ *"విందాం - నేర్చుకుందాం"*
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 27.01.2020
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : "పల్లె చిత్రం"
★ *తరగతి : 4వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
✳ *పల్లె చిత్రం*
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• చిత్రకారులు అననేమో తెలుసుకుంటారు.
• రోడ్లపై, కాన్వాస్ లపై, గోడలపై  చిత్రకారులు గీసే చిత్రాలను పరిశీలిస్తారు.
• చిత్ర ప్రదర్శనశాల సందర్శన చేసి అక్కడ చిత్రాలను పరిశీలిస్తారు.
• కొందరి చిత్రకారుల పేర్లను తెలుసుకుంటారు.
• ఆసక్తి, కుతూహలం వుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకుంటారు.
(చిలకమ్మా, రాజు, లత ల సంభాషణ ఉంటుంది)
• చిలకమ్మ చెప్పిన సక్రూ కథ ను తెలుసుకుంటారు.
*ప్రశ్నోత్తర పద్దతి(13 నిమిషాలు)*
1) గుహలో బొమ్మలను చూసిన సక్రూ కు ఏమనిపించింది?
జ: ఆశ్చర్యం, ఆసక్తి .
2) సక్రూ తాను గీచిన బొమ్మలకు రంగులుగా ఏ ఏ పదార్ధాలను వాడాడు?
జ: ఎర్రమట్టి, ఆకులు, దుంపలు, కాయలు మొదలగునవి.
3) సక్రూ బొమ్మలు గీయడం ఎలా నేర్చుకున్నాడు?
జ:  ప్రకృతి అంశాలను పరిశీలించడం ద్వారా.
4) ఈ పాఠానికి నీవైతే ఏపేరు పెడతావు?
జ:  బాల చిత్రకారుడు.
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• 1) నల్లబల్ల,    2) సుద్దముక్క,    3) పాఠ్యపుస్తకం.
★★★★★★★★★★★★★
✡ *కార్యక్రమంలో నిర్వహించవలసిన కృత్యములు:*
*కృత్యము-1:*
పాఠ్య పుస్తకం లోని 116 వ పేజీలో చివరి పేరా ను చదివించాలి.
ప్రశ్నలు
1) సక్రూ గీచిన చిత్రాన్ని పోటీకి పంపించిందెవరు?
2) సక్రూ గీచిన చిత్రానికి ఏ బహుమతి వచ్చింది?
3) పిల్లలకు బహుమతులు ఏ ఏ సందర్భాలలో ఇస్తారు?
4) మీకు తెలిసిన కొన్ని పత్రికలు ఏవి?
5) అవధులు అనే పదానికి అర్ధం ఏమిటి?
*కృత్యం-2*
తరగతి గదిలో పెద్ద వృత్తం గీయండి.  ⭕
పిల్లలను వృత్తంపై నిలబెట్టండి.
చెరువు బయట/ లోపల/ పైకి ఆట ఆడించాలి.
"ఆశ్చర్యంగా" సొంత వాక్యం చెప్పి వృత్తం లో గట్టు మీదకు వెళ్ళాలి.
"సంతృప్తిగా"   సొంత వాక్యం చెప్పి వృత్తం లో చెరువు బయటకు వెళ్ళాలి.
"ఆసక్తిగా"  సొంత వాక్యం చెప్పి వృత్తం లో చెరువు లోపలికి  వెళ్ళాలి.
"కళ్లప్పగించి" సొంత వాక్యం చెప్పి వృత్తం లో చెరువు లోపలికి  వెళ్ళాలి.
*కృత్యం-3*
మ్యూజిక్ మొదలవగానే  వృత్తంపై తిరగాలి.
మ్యూజిక్ ఆగగానే చెరువు బయటకు వెళ్ళాలి.
ఈ ఆటను ఆడించాలి.
నామవాచక పదాలు, క్రియా పదాలు, సర్వనామాలు, విశేషణా పదాలు ఆట ఆడించాలి
★★★★★★★★★★★★★
✡ *కార్యక్రమంలో వినిపించబోయే పాటను పెద్ద అక్షరాలతో ఒక చార్డుపై రాసి, ప్రసార సమయంలో పిల్లలందరికీ కనిపించేలా తరగతి గదిలో ప్రదర్శించాలి.*
 🎼 *పాట*
*🎤 పల్లవి :*
భలే భలే బాలుడు  పల్లెటూరు బాలుడు
బొమ్మలెన్నో గీశాడు బాల చిత్రకారుడు   //భలే//
 *🎻 చరణం 1:*
అమ్మా నాన్నతో వెళ్ళాడు
రంగులు ఎన్నో వేసాడు
పల్లె చిత్రం గీశాడు
పోటీ కతడూ పంపాడు
ప్రధమ బహుమతి పొందాడు
అందరు ప్రజలూ మెచ్చారు    //భలే//

[పాట ఇంకా ఉంటుంది. ఇక్కడ పూర్తిగా లేదు] 
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
★★★★🔚🙋‍♂★★★★
*ఇంటి పని*
[పిల్లలు నోట్ పుస్తకం లో వ్రాసుకొంటారు]
1) మీ పాఠశాల చిత్రాన్ని గీయండి. ఆ చిత్రానికి రంగులు వేయండి. ఆ చిత్రం గురించి రాయండి.
2) మీకు తెలిసిన చిత్రకారులు, ఆటగాళ్లు పేర్లు సేకరించి పట్టికను తయారు చేయండి. 🙋‍♂
Previous
Next Post »
0 Komentar

Google Tags