Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Be careful if you have more PAN cards

ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా... జాగ్రత్త మరి... రూ.10,000 జరిమానా...
ఒక వ్యక్తి ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌‌)ను కలిగి ఉండాలనే నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డ్‌లను కలిగిన వారికి రూ.10,000 ల జరిమానా విధించాలని ఆ శాఖ నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వలన ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులను కలిగి ఉన్నవారు...తమ వద్ద అదనంగా ఉన్న పాన్‌కార్డ్లను స్వాధీనం చేయటం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కలిగించింది. వారు అటువంటి కార్డులను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
ఎక్కువ పాన్‌కార్డులా?
సాధారణంగా ఎన్నారైలు ఈ విధంగా ఎక్కువ పాన్‌ కార్డులను కలిగిఉంటారు. భారత్‌ను వీడి వెళ్లక ముందు వీరికి ఒక పాన్‌కార్డు ఉంటుంది. ఆపైన కొన్ని సంవత్సరాల అనంతరం స్వదేశానికి మళ్లీ వచ్చినప్పుడు వారు మరో పాన్‌ కార్డును తీసుకుంటారు. అంతేకాకుండా తమ పాన్‌ కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు... వాటిని సరిచేయవచ్చు. దానికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలికార్డును స్వాధీనం చేయకుండానే మరోదాన్ని పొందుతారు.
ఏం చేయాలి?
వివిధ కారణాల వలన ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ జరిమానా, చర్యలకు గురికావలసి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే వారు ఆన్ లైన్‌, ఆఫ్‌లైన్‌ ... రెండు విధానాల ద్వారా కూడా తప్పని సరిగా అదనపు పాన్‌ కార్డులను స్వాధీనం చేయవలసి ఉంటుంది. చాలా సులువైన విధానం ద్వారా అదనపు పాన్‌ కార్డులను ప్రభుత్వానికి అప్పగించవలసివుంటుంది.
Previous
Next Post »
0 Komentar