Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Digital learning initiatives of Ministry of HRD: Promote digital learning

Digital learning initiatives of Ministry of HRD: Promote digital learning


సంభందిత ఉత్తర్వుల కోసం క్రింద చూడగలరు
కోవిడ్-19 ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్/ ఇ-లెర్నింగ్ ప్లాట్ఫారమ్స్ ద్వారా చదివించు కోవాల్సిందిగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ మేరకు తమ తమ రాషాల్లోని విద్యార్థులకు ఈ సమాచారం అందేలాగ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ డిజిటల్/ఇ-లెర్నింగ్ ప్లాట్ఫారమ్స్ అన్నీ కూడా ఉచితంగానే లభ్యమవుతాయని స్పష్టం చేసింది.
*స్కూలు విద్య: దీక్ష వెబ్ సైట్లో సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్ట్, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సిలబన్లతో కూడిన పాఠ్యపుస్తకాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 80,000కు పైగా ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇందుకు సంబంధించిన యాపు ఐఒఎస్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్ సైట్ చిరునామా: https://diksha.gov.in or https://seshaqun.gov.in/shaqun
*ఇ-పాఠశాల వెబ్ సైట్లో 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బహుళ భాషల్లో 1,886 ఆడియోలు, 2,000 వీడియోలు, 696 ఇ-బుక్స్, 504 ఫ్లిప్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్ చిరునామా: http://epathshala.nic.in or http://epathshala.gov.in
*ఎస్ఆర్ఓఇఆర్ పోర్టల్ లో వివిధ భాషల్లో మొత్తం 14,527 ఫైల్స్ ఉన్నాయి.ఇందులో 401 కలెక్షన్స్, 2,779 డాక్యుమెంట్స్, 1,845 ఇంటరాక్టివ్స్, 1,664 ఆడియోలు, 2,588 ఇమేజిస్, 8,158 వీడియోలు ఉన్నాయి. వెబ్ సైట్ చిరునామా Website: http://nroer.gov.in/welcome
*స్వయం నేషనల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాంలో తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రాడ్యుయేషన్, పీజీ,ఇంజనీరింగ్, మానవ వనరులు, సోషల్ సైన్స్, లాకు చెందిన 1900లోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్ చిరునామా:swavam.gov.in
Previous
Next Post »
0 Komentar

Google Tags