Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Health Benefits of Figs


The Health Benefits of Figs
ఆరోగ్యానికి అంజీర ఫలము
కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.
కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు.
నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉరటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. సూవర్‌ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.
రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది. ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ పండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర తరహా మాత్రం కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనివిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.
అత్తి పండు తియ్యని రుచి గల పండు. దీనిని విరిచి తినవచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విదిలించి తింటారు. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది. అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు. ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి. అత్తిపండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యత ఉంది. మెత్తగా, తియ్యగా, మధురంగా ఉండే ఈ పండులో అన్నీ మంచి గుణాలే. అన్నీ ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే. అయితే మెత్తగా ఉండటంవల్ల దీనికి పండిన తరువాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టి డ్రైఫ్రూట్ రూపంలో వాడుతుంటారు.
దీనిలో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాల వంటివి అల్పమోతాదులో ఉంటాయి. పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. దీనిని నేరుగా గాని, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి గాని తీసుకోవచ్చు. పిండి పదార్థాలను తీసుకోవటంవల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే, ఆ పదార్థాలతోపాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది. అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అత్తిపండ్లను కేకుల తయారీలోను, జాముల తయారీలోనూ వాడతారు. దీనిని దీర్ఘవ్యాధులనుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు.
అత్తి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
1. మల బద్ధకం: ఎండిన లేదా తాజాగా ఉన్న అత్తి పండ్లు ఒక సహజ వీరేచనాల మందుగా పనిచేస్తాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉండుటం వల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికల పని తీరును ప్రోత్సహిస్తుంది.
2. బరువు తగ్గడం: అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ మరియు ఫైబర్ సంబంధిత ఆహారాలు ఉండుటవల్ల బరువు తగ్గించటంలో సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది.
3. కొలెస్ట్రాల్ తగ్గించడానికి: అత్తి పండ్లలో పెక్టిన్ అని పిలిచే కరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థ కొలెస్ట్రాల్ బయటకు పంపుతుంది.
4. గుండె సంబంధిత వ్యాధులు: అత్తి పండ్లలో ఫినాల్ మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని సహజ గుండె బూస్టర్లు అని చెప్పవచ్చు. కాబట్టి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది.
5. పెద్దప్రేగు కేన్సర్: అత్తి పండ్లలో ఉండే ఫైబర్ పదార్దాలు క్యాన్సర్‌ను తగ్గిస్తాయని నమ్మకం. ముఖ్యంగా పెద్దప్రేగు కేన్సర్ నివారించడంలో అత్తి పండ్లు బాగా సహాయపడతాయి.
6. మధుమేహ వ్యాధి: అత్తి చెట్టు యొక్క ఆకులు ఫైబర్ ఎక్కువగా ఉండి తినదగిన భాగాలలో ఒకటి. మధుమేహం తగ్గించడానికి మరియు ఇన్సులిన్ ఇంజక్షన్లు తగ్గించదానికి అత్తి ఆకులు నుంచి తయారుచేసిన రసంను అల్పాహారంలో చేర్చండి.
7. రక్తపోటు: అత్తి పండ్లలో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అది రక్తపోటుకు దూరంగా ఉంచటానికి సహకరిస్తుంది.
8. మూలశంక వ్యాధి: మూలశంక వ్యాధితో బాధపడేవారు అత్తి పండ్లను ప్రతి రోజు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags