Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

What is Lockdown ? Details of Lockdown


What is Lockdown ? Details of Lockdown
లాక్ డౌన్ అంటే ఏమిటి ? వేటికి వర్తిసుంది ? వేటికి వర్తించదు ?
ఇప్పుడు ఎక్కువ మంది నోట వింటున్న మాట “లాక్ డౌన్”. ఇండియా లో చాలా రాష్ట్రాలు ఈ లాక్ డౌన్ ను ప్రకటించాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ లాక్ డౌన్ ను ప్రకటించాయి. లాక్ డౌన్ అనేది ఓ అత్యవసర నిర్వహణ నియమం (ప్రోటోకాల్). అసలు ఈ లాక్ డౌన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.
* సాధారణ పరిభాషలో దీని అర్థం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం.
* అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రోటోకాలను ఉపయోగించే వెసులు బాటు ఉంటుంది. * తమ పరిధిలోని ప్రజలను రక్షించ డానికి పాలకులు ఈ ప్రోటోకాలను సాధారణంగా ఉపయోగిస్తారు.
* బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకు వస్తున్నప్పుడు లేదా ఇతర బాహ్య సంఘటన నుంచి రక్షించడానికి లాక్ డౌన్ ప్రయోగిస్తారు.
* భవనాలలో లా డాన్ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటికి పోరు.
* అలాగే, పూర్తి స్థాయి లాక్ డౌన్ (ఫుల్ లాక్ డౌన్) అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి.
* చెప్పిన చోటు నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదు. బయటకు రాకూడదు.
* లాక్ డౌన్ రెండు రకాలు. ఒకటి నివారణ లాక్ డౌన్ (ప్రివెంటివ్ లాక్ డౌన్), రెండోది ఎమర్జెన్సీ లాక్ డౌన్.
* ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది ప్రివెంటివ్ లాక్ డౌన్.
* అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యలలో భాగం.
* ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. .
* ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్ డౌన్ ను విధిస్తారు.
ఇవీ లాక్‌డౌన్‌..
* రాష్ట్ర సరిహద్దులు మూసివేతతో అంతర్రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ, రాష్ట్రంలో బస్సులు, ఆటోలు, ఇతర ప్రజా, ప్రైవేట్‌ రవాణా వాహనాలు, పాఠశాలలు, కళాశాలలు, అన్ని విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌ క్లబ్‌లు, సోషల్‌ ఈవెంట్‌ సెంటర్లు, పెద్ద పెద్ద ఆలయాల్లో దర్శనాలు, వస్త్రదుకాణాలు, జ్యూయలరీ షాపులు, అత్యవసరం కాని అన్ని ఇతర షాపులు, అత్యవసర సర్వీసులు అందించేవి మినహా ఇతర ఆఫీసులు, గోదాములు,మార్కెట్‌ యార్డులు.
* 31వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వీయనిర్బంధంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రాకూడదు.
ఇవి ఓపెన్‌..
* పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు, మందుల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు.
* అత్యవసర సేవలకు మాత్రమే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి. అప్పుడు కూడా కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ ఆఫీసులు స్కెలెటిన్‌ స్టాఫ్‌తో రొటేషన్‌ పద్ధతిలో పనిచేయాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags