Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Class 10th & 12th Examination Dates confirmed

సీబీఎస్‌ఈ 10,12వ తరగతుల పరీక్షల తేదీలు ఖరారు


పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను జులై 1వ తేదీ నుంచి 15వరకు నిర్వహిస్తుందని మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ తెలిపింది.  సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ వారం ప్రకటించనున్నారు. కాగా పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేయలేదని, వాటిని నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఇటీవల వివరణ ఇచ్చింది. పరీక్షల నిర్వహణకు ముందు విద్యార్ధులకు ప్రిపరేషన్‌ కోసం తగినంత సమయం ఇస్తామని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ నిర్వహించడానికి ముందే 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags