Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nationwide lockdown extended up to 30th June



జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 4 గడువు రేపటితో ముగియనుండగా.. దానిని మరో 30 రోజులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన జోన్లకు లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఉంటాయని తెలిపింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అటు ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ జూన్ 8 నుండి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతించింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్లకు మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వలేదు.
ఫేజ్‌ 1
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) జారీ చేయనున్న నిభందనల ప్రకారం
>జూన్‌ 8వ తేదీ నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుస్తారు.
>హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు ప్రారంభం
>షాపింగ్‌ మాళ్లు ప్రారంభించవచ్చు.
ఫేజ్‌ 2
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) జారీ చేయనున్న నిభందనల ప్రకారం
>పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్ల ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం జూలైలో నిర్ణయం తీసుకుంటారు.
>రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యా సంస్థల స్థాయిలో తల్లిదండ్రులు, ఈ అంశంతో ముడిపడి ఉన్న వారితో చర్చిస్తాయి. వారి స్పందన ఆధారంగా ఈ విద్యా సంస్థలను తెరవడంపై నిర్ణయం వెలువడుతుంది.
ఫేజ్‌ 3
పరిస్థితులను బట్టి కింది కార్యకలాపాలు పునరుద్ధరన తేదీలు ప్రకటిస్తారు.
>అంతర్జాతీయ విమాన సర్వీసులు..
>మెట్రో రైళ్లు
>సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, పార్క్‌లు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు, ఈ కోవలోకి వచ్చేవి.
>సామాజిక, రాజకీయ, క్రీడాపరమైన, వినోదపరమైన, బోధనపరమైన, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, ఇతర భారీ సమావేశాలు
లాక్‌డౌన్‌ కట్టడి జోన్లకే..
> లాక్‌డౌన్‌ 5.0 కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగుతుంది.
>కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రకటించవచ్చు.
>కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు. వైద్య అత్యవసర సేవలకు, నిత్యావసర వస్తువుల రవాణాకు మినహాయింపు ఉంటుంది.
>రాష్ట్రాలు కట్టడి జోన్ల వెలుపల బఫర్‌ జోన్లను కూడా గుర్తించాలి. కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బఫర్‌ జోన్లు అంటారు. ఈ బఫర్‌ జోన్లలో కూడా జిల్లా యంత్రాంగాలు తగిన ఆంక్షలు విధించవచ్చు.
ఇతర నిబంధనలు
>రాష్ట్రాలు అవసరాన్ని బట్టి కట్టడి జోన్లు కాని ప్రాంతాల్లో వివిధ కార్యకలాపాలపై నిషేధం లేదా ఆంక్షలు విధించవచ్చు.
>రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. వీటి కోసం ఎలాంటి ప్రత్యేక పాస్, అనుమతి పొందాల్సిన అవసరం లేదు.
 >రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఆంక్షలు అవసరం అని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దీనిపై ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలి.
>రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు సంబంధించిన విమాన సేవలు, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రామాణిక నియమావళి జారీ చేస్తారు.
>ఎలాంటి వస్తు రవాణానూ రాష్ట్రాలు అడ్డుకోరాదు.
>65 ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.
>ప్రజలు ఆరోగ్యసేతు మొబైల్‌ యాప్‌ను వినియోగించాలి. దీనిపై జిల్లా యంత్రాంగాలు మరింత దృష్టి పెట్టాలి.
>లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చరాదు.
>జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

>కోవిడ్‌–19 నిర్వహణకు సంబంధించి ఇదివరకే జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి.
లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు...
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags