Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Health benefits of Sorghum in Telugu

Health benefits of Sorghum in Telugu
జొన్నలు
ప్రపంచంలో మొదటి ఐదు ఆరోగ్యకరమైన ధాన్యాల్లో జొన్నలు కూడా ఉన్నాయి. శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ర౦గు రుచి వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి, జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లో నయినా కలుపుకోవటానికి వీలుపడుతుంది.
పోషక పదార్థాలు (100 గ్రా.)
పిండిపదార్ధాలు - 72.6 గ్రా.
మాంసకృత్తులు - 10.4 గ్రా.
పీచు - 1.6 గ్రా
ఇనుము - 4.1 మి.గ్రా.
కాల్షియం - 25 మి.గ్రా.
ఫోలిక్‌ ఆమ్లం - 20 మి.గ్రా.
జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
>జొన్నలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది.
>జొన్నల్లో ఉన్న ఫైబర్ కారణం గా అవి చెడు కోలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. దాని వల్ల గుండె జబ్బులు కానీ, స్ట్రోక్ కానీ రాకుండా ఉంటాయి.
>జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
>అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, తల్లికే కాదు.. బిడ్డకు మంచిదే.
>జొన్నలు నెమ్మదిగా అరుగుతాయి కాబట్టి రక్తంలో చక్కెర శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. బరువు తగ్గుదామనుకునే వారికీ, డయాబెటీస్ తో బాధ పడుతున్న వారికీ చక్కటి ఆహారం.
>జొన్నల్లోని మెగ్నీషియం, కాపర్, కాల్షియం వంటివి ఎముకలని బలంగా మారుస్తాయి. జొన్నల్లోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
>జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి.
>క్యాన్సర్ ను నిరోధించే శక్తి కూడా వీటిలో ఉంది. చర్మ క్యాన్సర్ కూడా దరిచేరకుండా చేస్తుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags