Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Importance of Seven special days on 21st June



జూన్ 21 ఒక్కరోజే ‘‘సెవెన్ స్పెషల్ డేస్’’
జూన్ 21 ఒక్కరోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదికకానుంది. వీటితో పాటు ప్రపంచం నాశనమవుతుందన్న ‘‘డూమ్స్ డే’’ కూడా ఉండంతో మరో విశేషం. దీని గురించి పక్కన బెట్టితే ఏ దినోత్సవాలు ఎందుకు జరుగుతాయో తెలుసుకుందాం..
ప్రపంచ యోగా దినోత్సవం: 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన తరువాత ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది. ఏడాది మొత్తం మీద పగటి పూట ఎక్కువగా ఉండే జూన్ 20,21,22 తేదీల్లో మాత్రమే. ఈ మూడు రోజుల మధ్య రోజైనా జూన్ 21 ను యోగ డే గా మోడీ ఎంపిక చేశారు.    
ఫాదర్స్ డే: వాస్తవానికి ఫాదర్స్ డే ప్రతి ఏటా జూన్ మూడవ ఆదివారం నాన్నల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మూడో ఆదివారం జూన్ 21న వచ్చింది. కుటుంబం శ్రేయస్సు కోసం పాటుపడే తండ్రిని గౌరవించుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ మానవత్వ దినోత్సవం: ప్రజల్లో మానవత్వాలను పెంచేలా 1980 నుంచి మానవత్వ దినోత్సవం జరుగుతోంది. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవత్వం పెంపొందించటానికి కృషి చేసేందుకు స్ఫూర్తినిచ్చే రోజు.
జల దినోత్సవం (హైడ్రోగ్రఫీ డే): జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడివుండేలా చేసేందుకు హైడ్రోగ్రఫీ డే, 2005 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. ఐరాస కూడా దీన్ని గుర్తించింది. హైడ్రో గ్రఫీ అంటే జన వనరుల భౌతిక స్వరూపాల కొలామానాల విజ్ఞానశాస్త్రం. నదులు చిత్రాలు సరస్సులు ఇతర జలాశయాలను అన్ని రంగాల అభివృద్ధికి హైడ్రో గ్రఫీ తోడ్పడుతుంది.
సంగీత దినోత్సవం: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 1982లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లూ హెమోవిస్ మ్యూజిక్ డేను ప్రారంభించారు. ఈరోజున బహిరంగ ప్రదేశాల్లో తమ తమ వాయిద్య పరికరాలతో సంగీతాన్ని వినిపిస్తుంటారు సంగీత కళాకారులు.
హ్యాండ్ షేక్ డే: షేక్ హ్యాండ్ డే అంటే కరచాలన దినోత్సవం. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ ఏడాది కరచాలన దినోత్సవం జరిగేలా లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యం కదా.
టీ షర్ట్ డే: టీ షర్ట్ డే వల్ల సమాజానికి ఎటువంటి శ్రేయస్సు లేకపోయినా..2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డే ని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీ లేదు.

Previous
Next Post »
0 Komentar