Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RTC bus services between Telugu states


తెలుగు రాష్ట్రాల మధ్య వారంలో ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం
వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ మేరకు విజయవాడలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారుల చర్చలు ముగిశాయి. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై చర్చించారు. ప్రాథమికంగా కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని తిప్పేందుకు చర్చల్లో అంగీకారం కుదిరింది. ఈనెల 23న ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. తొలి దశలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణకు 256 సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదించారు.
అంతరాష్ట్ర బస్‌ సర్వీసులను కోవిడ్‌ నిబంధనల ప్రకారమే నడుపుతామని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌కు మాత్రమే సర్వీసులు నడుపుతామని స్పష్టం చేశారు. ప్రయాణీకుల్లో 5 శాతం మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే హోం క్వారంటైన్‌ చేస్తామన్నారు.
కర్ణాటకకు వచ్చే వారం 293 సర్వీసులు
ఏపీ నుంచి కర్ణాటకకు ఈ నెల 17 నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కాగా 168  సర్వీసుల్ని నడపాలని ప్రతిపాదనలు రూపొందించగా 10 జిల్లాల నుంచి 140 సర్వీసులు మాత్రమే నడిచాయి. రెండో దశలో 293 బస్సు సర్వీసులు నడపాలని ప్రతిపాదనలు రూపొందించారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags