Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Unlock 2.0 Guidelines



అన్‌లాక్‌ -2 కేంద్రం విధివిధానాలివే..
కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌
దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మేరకు అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు మెట్రోరైళ్లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌, జిమ్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
Detailed Unlock 2.0 guidelines
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar