Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Grama, ward Sachivalayam recruitment exams postponed

AP Grama, ward Sachivalayam recruitment exams postponed

ఏపీ గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా...
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు రెండో వారంలో జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై త్వరలో మళ్లీ వెళ్లడిస్తామని తెలిపారు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరిలో విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరీ కల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 6), డిజిటల్ అసిస్టెంట్ , విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అంతకు ముందు రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags