Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: New Guidelines For Marriages

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు..

ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 21 నుంచి శ్రావణ మాసం మొదలు అవుతుండటంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన పెళ్లిళ్ల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టరేట్‌ల నుంచి పెళ్లిళ్లకు అనుమతి పొందాల్సి వచ్చేది. అయితే ఆ ప్రక్రియ కాస్తా ఆలస్యం అవుతుండటంతో.. మండల పరిధిలోని స్థానిక తహసీల్డార్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
పెళ్లిళ్లకు వధువు- వరుడు తరుపున 20 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక పెళ్ళికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్డార్‌కు సమర్పించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని.. మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం తీసుకుంటామని జగన్ సర్కార్ జీవోలో పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar